https://oktelugu.com/

NTR: నందమూరి, నారా ఫ్యామిలీలు ఎన్టీయార్ ని ఎందుకు పట్టించుకోవడం లేదు…

నందమూరి ఫ్యామిలీ హీరో అయిన ఎన్టీఆర్ ని చంద్రబాబు, బాలయ్య బాబు ఇద్దరు దూరం పెడుతూ వస్తున్నారు. దానికి గల కారణం ఏంటి అనేది చాలా రోజుల నుంచి ఎన్టీయార్ అభిమానుల్లో ఉన్న ఒక ప్రశ్న అనే చెప్పాలి.

Written By:
  • Gopi
  • , Updated On : January 18, 2024 / 10:03 AM IST

    NTR

    Follow us on

    NTR: సినిమా ఇండస్ట్రీలో పెద్ద ఫ్యామిలీ గా చెప్పుకునే నందమూరి ఫ్యామిలీకి మంచి క్రేజ్ ఉంది. ఇక సీనియర్ ఎన్టీఆర్ తర్వాత ఆ ఫ్యామిలీ నుంచి వచ్చిన బాలయ్య బాబు స్టార్ హీరోగా చాలా సంవత్సరాల పాటు కొనసాగుతూ వస్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే మూడోతరం హీరోగా వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ కూడా ఆ ఫ్యామిలీని నిలబెట్టడంలో తను కూడా చాలా వరకు ప్రయత్నం చేస్తూ స్టార్ హీరోగా ఎదిగి వరుస సినిమాలు చూస్తూ వస్తున్నాడు.

    ఇక ఇది ఇక ఉంటే చాలా రోజుల నుంచి నందమూరి ఫ్యామిలీ హీరో అయిన ఎన్టీఆర్ ని చంద్రబాబు, బాలయ్య బాబు ఇద్దరు దూరం పెడుతూ వస్తున్నారు. దానికి గల కారణం ఏంటి అనేది చాలా రోజుల నుంచి ఎన్టీయార్ అభిమానుల్లో ఉన్న ఒక ప్రశ్న అనే చెప్పాలి. అయితే దానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే చంద్రబాబు టిడిపి పార్టీ కోసం 2019 లో జూనియర్ ఎన్టీఆర్ ని ప్రచారానికి రమ్మంటే తను రాకపోవడమే మెయిన్ కారణంగా అభివర్ణిస్తున్నారు. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ ని వాడుకుంటే కొన్ని ఎక్కువ ఓట్లు పడతాయనే ఉద్దేశ్యం తో చంద్రబాబు జూనియర్ ఎన్టీఆర్ ని ప్రచారానికి ఆహ్వానించారు.

    అయినప్పటికీ తను నో చెప్పడంతో అప్పటి నుంచి ఎన్టీఆర్ ని దూరం పెడుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఎన్టీఆర్ నో చెప్పడానికి గల రీజన్ ఏంటి అంటే 2009 ఎలక్షన్స్ టైం లో ఎన్టీఆర్ టిడిపి పార్టీ ప్రచారానికి వెళ్లి వస్తుంటే యాక్సిడెంట్ కి గురయ్యాడు. అయినప్పటికీ తను ప్రచారాన్ని సక్సెస్ ఫుల్ గా కొనసాగించాడు. ఇక దానికి కృతజ్ఞత ఏమాత్రం చూపకుండా ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత టిడిపి పార్టీ కి అనుకూలంగా ఉండే కొన్ని మీడియా ఛానల్స్ ఎన్టీఆర్ ని టార్గెట్ చేసి పర్టికులర్ ఎక్కడైతే ఎన్టీయార్ ప్రచారం చేశాడో అక్కడక్కడ టిడిపి పార్టీ ఓడిపోయింది. ఎన్టీఆర్ కి జనాల్లో అంతగా క్రేజ్ లేదు అంటూ నెగిటివ్ ప్రచారం చేశారు. ఇక దాంతో ఎన్టీఆర్ కి కొంచెం కోపం రావడంతో 2019 ప్రచారానికి వెళ్ళలేదు. దాంతో మన పార్టీ ప్రచారానికి రానప్పుడు మనం ఎందుకు అతన్ని పట్టించుకోవాలనే ఉద్దేశ్యంతో అప్పటి నుంచి చంద్రబాబు బాలయ్య లు ఎన్టీఆర్ ని లైట్ తీసుకున్నారు.

    అయితే రీసెంట్ గా ఒక కేసు విషయంలో చంద్రబాబు నాయుడు జైలుకు కూడా వెళ్లారు. ఆ పరిస్థితి లో ఆయన్ని చాలామంది పరామర్శించినప్పటికీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఆయనని కలవలేదు. ఆయన మీద ఒక్క పోస్ట్ కూడా పెట్టలేదు. దాంతో వీళ్ళ మధ్య చాలా పెద్ద గొడవలు ఉన్నాయని జనాలు మాట్లాడుకుంటున్నారు. ఇక వీళ్ళ మధ్య ఉన్న గొడవలు సద్దుమణిగి వీళ్లంతా ఎప్పుడు కలుస్తారు అని నందమూరి అభిమానులు గాని, టిడిపి పార్టీ కార్యకర్తలు గాని ఎదురుచూస్తున్నారు…