Serials: వెండి తెరకు ఏ రేంజ్ లో ఫ్యాన్స్ ఉంటారో బుల్లితెరకు కూడా అదే రేంజ్ లో ఫ్యాన్స్ ఉంటారు. ఒకరకంగా సీరియల్స్ కే ఇంకా ఎక్కువ మంది అభిమానులు ఉంటారు. సీరియల్స్ లో నటించే వారిని తమ ఇంట్లో వారిలాగా భావస్తూ ఉంటారు కొందరు. సీరియల్స్ లో కూడా డిఫరెంట్ కాన్సెప్ట్ ఉన్న సీరియల్స్ వస్తున్నాయి. కొన్ని సీరియల్స్ లో మాత్రం కొన్ని సీన్స్ మీద డిఫరెంట్ గా ఉన్నాయనే టాక్ వస్తుంది. అయితే ఇలాంటి సీరియల్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
జీ తెలుగులో వచ్చే త్రినయిని సీరియల్ కు చాలా మంది అభిమానులు ఉన్నారు. ఈ సీరియల్ లో హీరోయిన్ కు కొన్ని శక్తులు ఉంటాయి. హీరోయిన్ తో పాటు ఉన్న నాగదైవం, హీరోయిన్ కి ఎవరైనా ఇబ్బంది కలిగిస్తే వారి నుంచి కాపాడుతూ ఉంటుంది. ఇక ఈ సీరియల్ లో ఇటీవల ఒక సీన్ టెలికాస్ట్ చేశారు. అందులో విలన్ నిలుచొని ఉంటే పాముకు కార్ డ్రైవ్ చేస్తున్నట్టు చూపించారు. ఇది గ్రాఫిక్స్ ద్వారా తీసిన సీన్ అని చూస్తుంటేనే అర్థం అవుతుంది. దీన్ని చూసి పలువురు పలు రకాలుగా స్పందిస్తున్నారు.
అయితే దేవుడు త్రినయని కాపాడుతున్నాడు అని మరొక రకంగా చూపిస్తే బాగుండు.. కానీ ఇలా పాము కారు డ్రైవ్ చేయడం ఏంటి అది కూడా గ్రాఫిక్స్ అని క్లియర్ గా అర్థం అవుతుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు కొందరు. ఈ సీరియల్ లో ఇలాంటి సీనే అంతకు ముందు కూడా జరిగింది. ఈ సీరియల్ లో ఉండే ఒక నటి ఉయ్యాల కోసం చీరని కట్టి ఫోన్ వస్తుంది అని అక్కడ నుంచి వెళ్లిపోతుంది. ఇదంత పైన ఫ్లోర్ లో జరుగుతుంది. కింద ఫ్లోర్ లో కూర్చున్న విలన్ పాత్ర పోషిస్తున్న నటి లేచి నడుచుకుంటూ ముందుకు వెళ్లుంటే.. పైన ఉన్న చీర కిందకి పడిపోయి ఉరి పడినట్టు ఆమె మెడకు చుట్టుకుంటుంది.
ఈ సీన్ మీద కూడా చాలా కామెంట్లు వచ్చాయి. ఆ తర్వాత ఈ సీరియల్ లో కూడా ఇలాంటి సీన్స్ చాలానే వచ్చాయి. అయితే ఇలాంటి సీరియల్స్ త్రినయిని సీరియల్ లో మాత్రమే కాదు.. తెలుగు సీరియల్స్ లో ఇలాంటి సీన్లు వస్తునే ఉంటాయి. అయితే ఇలాంటి సీన్లు కేవలం తెలుగు వారికే సొంతం అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు. ఇలా కూడా జరుగుతుందా అనేలా ఉండకుండా.. ఇలా జరగడం కామన్ అనేట్టుగా ఉంటే బాగుంటుంది అంటున్నారు సీరియల్ లవర్స్.