https://oktelugu.com/

Prabhas: వర్షం సినిమా సెట్ లో ప్రభాస్ కి షాక్ ఇచ్చిన కృష్ణం రాజు…

సినిమా షూటింగ్ సమయంలో ప్రభాస్ కి ఒక సడన్ సర్ఫ్రైజ్ కలిగిందట. అది ఏంటి అంటే నిజానికి ప్రభాస్ కి బాగా సిగ్గు ఉంటుంది. ఇక వాళ్ల పెదనాన్న ముందు యాక్టింగ్ చేయడం అంటే ఆయనకి చాలా సిగ్గుగా ఉంటుందట...

Written By:
  • Gopi
  • , Updated On : March 2, 2024 / 02:53 PM IST
    Follow us on

    Prabhas: తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తనకంటు ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న ప్రభాస్.. ప్రస్తుతం వరుసగా పాన్ ఇండియా సబ్జెక్టులని ఎంచుకుంటూ సినిమాలు చేస్తూ తన ఫ్యాన్స్ తో పాటు గా, ప్రేక్షకులను సైతం ఎంటర్టైన్ చేయడానికి రెడీ అవుతున్నాడు. ఇక ఇదిలా ఉంటే ప్రభాస్ కెరియర్ స్టార్టింగ్ లో చేసిన వర్షం సినిమా సూపర్ సక్సెస్ అవ్వడంతో పాటుగా ఆయనకి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను కూడా సంపాదించి పెట్టింది. అయితే ఆయన కెరియర్ లో ఎన్ని సక్సెస్ లు వచ్చినా కూడా వర్షం సినిమా అనేది ఆయనకి ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా అనే చెప్పాలి.ఇక ఆయన కెరియర్లో తనకి దక్కిన మొదటి సక్సెస్ ఫుల్ సినిమా కూడా ఇదే కావడం విశేషం…

    అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో ప్రభాస్ కి ఒక సడన్ సర్ఫ్రైజ్ కలిగిందట. అది ఏంటి అంటే నిజానికి ప్రభాస్ కి బాగా సిగ్గు ఉంటుంది. ఇక వాళ్ల పెదనాన్న ముందు యాక్టింగ్ చేయడం అంటే ఆయనకి చాలా సిగ్గుగా ఉంటుందట… అందుకే ఆయన కెరియర్ మొదట్లో కృష్ణంరాజు(Krishnam Raju) సినిమా సెట్ లో ఉంటే ఆయన వెళ్లిపోయే దాకా వెయిట్ చేసి అప్పుడు తను షూటింగ్ చేసేవాడట. అందుకే ప్రభాస్ సినిమా షూటింగ్ లకి ఎప్పుడు కృష్ణంరాజు వచ్చేవాడు కాదట. దాంతో ప్రభాస్ నార్మల్ గా యాక్టింగ్ చేసేవాడట. అయితే ఒక రోజు వర్షం సినిమా షూటింగ్ జరుగుతుంటే ఆ సినిమా ప్రొడ్యూసర్ అయిన ఎమ్మెస్ రాజు కృష్ణంరాజును షూటింగ్ స్పాట్ కి రమ్మన్నాడట…

    అయితే ఆ విషయం ప్రభాస్ కి తెలియదు. ఇక అప్పటికే త్రిషకి ప్రభాస్ కి మధ్య ఒక రొమాంటిక్ సీన్ ను దర్శకుడు తెరకెక్కిస్తున్నాడట..ఆ సీన్ అయిపోయాక పక్కకొచ్చి చూస్తే కృష్ణంరాజు ప్రభాస్ ను చూస్తూ సెట్ లో కుర్చున్నాడట. ఇక దాంతో ఒక్కసారిగా షాక్ అయిన ప్రభాస్ పెదనాన్న ముందు రొమాంటిక్ సీన్ చేసినందుకు చాలా సిగ్గుపడ్డట..

    కానీ కృష్ణంరాజు మాత్రం ప్రభాస్ భుజం మీద చెయ్యి వేసి యాక్టర్స్ అన్న తర్వాత ఇవన్నీ కామన్ అంటూ ఆ సినిమాకి సంబంధించిన విశేషాలను అడిగి తెలుసుకున్నాడట…ఇక మొత్తానికైతే ప్రభాస్ కి కృష్ణంరాజు అంటే అమితమైన గౌరవం ఉంటుందనే చెప్పాలి. ఇక వీళ్లిద్దరూ కలిసి బిల్లా, రెబల్, రాధే శ్యామ్ సినిమాల్లో కలిసి నటించారు…