Mohan Babu : ప్రతి ఫ్యామిలీలో గొడవలు అనేవి కామన్ గా జరుగుతూనే ఉంటాయి. కానీ సెలబ్రిటీల జీవితాల్లో గొడవలు జరిగితే మాత్రం అవి హాట్ టాపిక్ గా మారుతూ ఉంటాయి. కారణం ఏంటి అంటే సినిమాల్లో మాత్రమే కనిపించే మన హీరోలు వాళ్ళ ఫ్యామిలీ విషయంలో కూడా గొడవలు పెట్టుకోవడం చూస్తున్న జనాలకి చాలా చిరాకు తెప్పించడమే కాకుండా మనలాగే వాళ్ళు కూడా ఒకరిని ఒకరు కొట్టుకుంటారు అనే ఒక చులకన భావం అయితే కలుగుతుంది…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక్కప్పుడు మోహన్ బాబుకి చాలా మంచి క్రేజ్ అయితే ఉండేది. ఇక విలక్షణమైన నటుడిగా గుర్తింపును సంపాదించుకోవడమే కాకుండా తనదైన రీతిలో సినిమాలు చేస్తూ అందర్నీ మెప్పించాడు. ఇక అలాగే తన ఫ్యామిలీ మొత్తాన్ని క్రమశిక్షణతో పెంచాను అంటూ చెప్పుకుంటూ ఉంటాడు. ఇక ఏది ఏమైనా కూడా మోహన్ బాబు లాంటి నటులు ఇండస్ట్రీ లో చాలా అరుదుగా ఉంటారనే చెప్పాలి. కానీ తన పర్సనల్ విషయాల్లో మాత్రం ఇప్పుడు ఆయన చాలా వరకు ఫెయిల్ అయిపోయాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ప్రస్తుతం ఆయన చిన్న కొడుకు అయిన మనోజ్ తో చాలా వరకు విభేదాలను పెట్టుకొని అతన్ని కొట్టించినట్టుగా కూడా కొన్ని వార్తలైతే వచ్చాయి. మరి ఏది ఏమైనా కూడా ఫ్యామిలీ మ్యాటర్స్ అనేవి ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. కానీ తన కొడుకుని కొట్టించడం పైన కొంతమంది సినీ మేధావులు సైతం మోహన్ బాబుని తీవ్రంగా విమర్శిస్తున్నారు. అయితే మోహన్ బాబు కి విష్ణు అంటే చాలా ఇష్టం అని మనోజ్ అంటే పెద్దగా నచ్చదని కొన్ని వార్తలు కూడా వెలువడుతున్నాయి. దానికి కారణం ఏంటి అంటే మోహన్ బాబు చెప్పిన వినకుండా మనోజ్ భూమా మౌనిక రెడ్డిని పెళ్లి చేసుకున్నాడనే కారణంతోనే మనోజ్ ని మోహన్ బాబు పక్కన పెట్టినట్టుగా తెలుస్తోంది. తనతో అసలు మాట్లాడడానికి కూడా పెద్దగా ఇంట్రెస్ట్ చూపించరట.
ఇక దానివల్ల విష్ణు తోనే ఉంటూ అతను ఎలాంటి సినిమాలు చేయాలి ఏ జానర్ సినిమాలు చేస్తే అతనికి సక్సెసులు దాక్కుతాయనే ధోరణిలో ఇతర దర్శకులతో చర్చలు జరిపి మరీ ఆయనకు కాంబినేషన్స్ సెట్ చేసే పనిలో మోహన్ బాబు అయితే ఉన్నాడు.
మనోజ్ మాత్రం తన పని తను చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. అందులో భాగంగానే ప్రస్తుతం ఆయన కొన్ని సినిమాల్లో విలన్ పాత్రలను కూడా పోషించడానికి సిద్ధమయ్యాడు. ఇక దాదాపు 6 నుంచి ఏడు సంవత్సరాల వరకు సినిమా ఇండస్ట్రీకి దూరమైన మనోజ్ మరోసారి విలన్ పాత్రల కోసం మేకప్ వేసుకోవడం విశేషం…
ఇక ఏది ఏమైనా కూడా మంచు మనోజ్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా మంచి నటుడు అనే గుర్తింపునైతే తెచ్చుకున్నాడు. కానీ ఆయన అనుకున్న రేంజ్ లో సక్సెస్ అయితే సాధించలేకపోయాడు… ఇక ఇప్పుడు వీళ్ళ ఫ్యామిలీలో జరుగుతున్న గొడవలు ఎప్పుడు సద్దుమనుగుతాయనే విషయం మీద క్లారిటీ అయితే రావడం లేదు…