https://oktelugu.com/

Vishnu : విష్ణు చేసిన మోసం వల్లే మనోజ్ మీడియా ముందుకు వచ్చాడా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళని వాళ్ళు స్టార్ హీరోలుగా ఎస్టాబ్లిష్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ముందుకు సాగుతున్నారు.

Written By:
  • Gopi
  • , Updated On : December 12, 2024 / 08:11 AM IST

    Vishnu

    Follow us on

    Vishnu : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళని వాళ్ళు స్టార్ హీరోలుగా ఎస్టాబ్లిష్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ముందుకు సాగుతున్నారు. కానీ మంచు ఫ్యామిలీలో హీరోలు మాత్రం సినిమాల్లో పెద్దగా రాణించకపోగా ప్రస్తుతం వార్తల్లో నిలుస్తూ ఇప్పటిదాక ఉన్న అంతో ఇంతో ఇమేజ్ ని కూడా పోగొట్టుకుంటున్నారు… ఇక ఏది ఏమైనా కూడా వాళ్లకంటూ ఒక సపరేట్ ఐడెంటిటి ని క్రియేట్ చేసుకోవడంలో మంచు హీరోలు ఫెయిల్ అయ్యారనే చెప్పాలి…

    మంచు మనోజ్ దొంగ దొంగది సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన విషయం మనకు తెలిసిందే. అయితే ఈ సినిమా అనుకున్న రేంజ్ లో ఆడలేదు. అప్పటినుంచి ఇప్పటివరకు ఆయన పలు రకాల సినిమాలను చేస్తూ వచ్చినప్పటికి పెద్దగా సక్సెసు లైతే దక్కడం లేదు. ఇక ఎప్పుడైతే అతనికి మొదటి పెళ్లి అయి డివోర్స్ అయిందో అప్పటినుంచి ఆయన సినిమాలు చేయడం మానేశాడు. దాదాపు ఏడు సంవత్సరాల నుంచి ఒక్క సినిమాలో కూడా కనిపించకుండా ఖాళీగా ఉంటున్నాడు. కానీ ఇప్పుడు మాత్రం కొన్ని సినిమాల్లో విలన్ పాత్రలను ఓకే చేసి అందులో నటించడానికి సిద్ధమవుతున్నాడు. కారణం ఏదైనా కూడా మంచు మనోజ్ మంచి నటుడు అనే ఒక కాంప్లిమెంట్ అయితే పొందాడు. అలాంటి వ్యక్తి ఇప్పుడు వరుస సినిమాలను చేయడానికి ఆసక్తి చూపిస్తూ ఉండడం విశేషం. ఇక ఇదిలా ఉంటే గత కొద్దిరోజుల నుంచి ఆయన పర్సనల్ విషయాల్లో చాలావరకు ఇబ్బందులైతే ఎదుర్కొంటున్నాడు. వాళ్ళ నాన్న మోహన్ బాబు అతని మనుషులను పెట్టి మనోజ్ ను కొట్టించడంతో మనోజ్ గత రెండు రోజుల నుంచి హాస్పిటల్ లోనే ఉంటున్నాడు. కారణం ఏదైనా కూడా మనోజ్ మీద మోహన్ బాబు కొంతవరకు నిర్లక్ష్య ధోరణి లో వ్యవహరిస్తున్నట్టుగా తెలుస్తోంది.ఇక ఇదిలా ఉంటే మంచు విష్ణు సైతం మనోజ్ ను పెద్దగా పట్టించుకోవడం లేదట…ఇక మనోజ్ మొదటి పెళ్లి చేసుకున్నప్పుడు ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉంది.

    అయితే కొద్దిరోజులకు మనోజ్ మొదటి వైఫ్ బిహేవియర్ పట్ల అసంతృప్తిని వ్యక్తం చేసిన మోహన్ బాబు ఫ్యామిలీ మొత్తానికైతే మనోజ్ చేత ఆమెకు విడాకులు ఇచ్చేలా చేశారు. మంచు మనోజ్ పేరు మీద ఉన్న ఆస్తులను విష్ణు పేరు మీద రాయించారట.

    కారణం ఏంటి అంటే అతని పేరు మీద ఉన్న ఆస్తుల్లో కొంత భాగం ఆమె డైవర్స్ తీసుకున్నప్పుడు అడుగుతుంది. కాబట్టి అతని పేరు మీద ఏ ఆస్తులు లేకపోతే ఎలాంటి భరణాన్ని చెల్లించాల్సిన అవసరం లేదనే ఉద్దేశ్యంతోనే మోహన్ బాబు ఈ ప్లాన్ వేశారట. మరి విష్ణు పేరు మీద రాసిన మనోజ్ ఆస్తులు మళ్లీ అతనికి తిరిగి ఇవ్వాలి.

    కానీ విష్ణు మాత్రం అలా చేయడం లేదట…అందువల్లే గొడవలు జరుగుతున్నాయి అంటూ కొంతమంది మీడియాలో కొన్ని వార్తలనైతే వైరల్ చేస్తున్నారు…ఇక ఈ గొడవలన్నింటికి కారణం విష్ణునే అంటూ మరికొంతమంది కామెంట్స్ చేయడం విశేషం…