https://oktelugu.com/

Tollywood: ఈ డైరెక్టర్లు కేవలం సీనియర్ హీరోల వల్లనే హిట్ లు సంపాదిస్తున్నారా?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది దర్శకులు స్టార్ హీరోలందరికి సక్సెస్ లను ఇస్తున్నారు. కానీ యంగ్ హీరోల విషయానికి వస్తే ఈ విషయంలో తడబడుతున్నారు.

Written By: , Updated On : February 16, 2024 / 12:09 PM IST
Tollywood
Follow us on

Tollywood: ఒక సినిమా తెరకెక్కించాలంటే కథ, నటన బాగుండాల్సిందే. లేదంట సినిమా ఫ్లాప్ పక్కా. సెవన్ స్ట్రాఫ్ట్స్ అద్భుతంగా ఉంటేనే సినిమా సక్సెస్ అవుతుంది. అయితే కొందరు స్టార్ డైరెక్టర్లు సక్సెస్ సాధించాలంటే స్టార్ హీరోలతోనే సాధ్యం అవుతుందట? లేదంటే కష్టమేనా అంటున్నారు కొందరు. ఎందుకు అనుకుంటున్నారా? అయితే ఓసారి చదివేయండి..

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది దర్శకులు స్టార్ హీరోలందరికి సక్సెస్ లను ఇస్తున్నారు. కానీ యంగ్ హీరోల విషయానికి వస్తే ఈ విషయంలో తడబడుతున్నారు. ఇలాంటి వారిలో బోయపాటి శ్రీను ఒకరు. ఈయన స్టార్ హీరోలకు భారీ సక్సెస్ లను అందించారు. కానీ యంగ్ హీరోలైన రామ్, రామ్ చరణ్ లాంటి హీరోలకు మాత్రం భారీ డిజాస్టర్ లను ఇస్తున్నారు. అందుకే ఈయనతో సినిమాలు చేయడానికి యంగ్ హీరోలు భయపడుతున్నారు.

రీసెంట్ గా ఈయన రామ్ తో చేసిన స్కంద సినిమా ఫ్లాప్ అవడంతో ఆయనను నమ్మి సినిమాను చేయడానికి యంగ్ హీరోలు ముందుకు రావడం లేదు. అందుకే బాలయ్యతోనే మళ్లీ సినిమా చేయాలి అనుకుంటున్నారట బోయపాటి. ఇదే కోవలోకి వస్తున్నారు వివి వినాయక్. ఎందుకంటే ఈయన కూడా స్టార్ హీరోలకు సక్సెస్ లను అందిస్తున్నారు కానీ యంగ్ హీరోలు హీరోల విషయంలో ఫెయిల్ అవుతున్నారట. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అఖిల్, సాయిధరమ్ తేజ్ లాంటి హీరోలకు మాత్రం సక్సెస్ లను ఇవ్వలేకపోయారు.

దాంతో ఇప్పుడు ఈయనను నమ్మి కూడా సినిమాలు చేయడం లేదనే చెప్పాలి. ఇక మళ్లీ ఆయన చేయాల్సి వస్తే సీనియర్ హీరోలతోనే చెయాలి అంటూ కామెంట్లు వస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే ఈయన యంగ్ హీరోలకు డిజాస్టర్ ఫలితాలను అందించారు. అయితే వీరు తెరకెక్కించే సినిమాలు కథల వల్ల హిట్ అవుతున్నాయా? లేదా స్టార్ స్టేటస్ వల్ల హిట్ అవుతున్నాయా అంటూ సందేహం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు.