https://oktelugu.com/

Old Houses Sale:కొత్త ఇల్లు వద్దు.. పాతదేే ముద్దు.. హైదరాబాద్ లో మారిన సీన్..

మొన్నటి వరకు నిర్మాణంలో జరుగుతున్న ప్లాట్లను, కొత్త వాటిని కొనుగోలు చేశారు. కానీ ఇప్పుడు పాత వాటికి డిమాండ్ పెరుగుతుంది. కొందరు ప్రత్యేకంగా పాత ఇళ్లు కావాలని కోరుకుంటున్నారు.

Written By:
  • Srinivas
  • , Updated On : February 16, 2024 / 12:04 PM IST

    Old houses

    Follow us on

    Old Houses Sale: ఇల్లు కట్టుకోవడం ప్రతి ఒక్కరి కల. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో దగ్గర ఉండి ఇల్లు కట్టుకోవడం సాధ్యం కాదు. దీంతో చాలా మంది ఉద్యోగస్తులు, వ్యాపారులు రెడిమేడ్ ఇళ్లు, అపార్ట్ మెంట్ లోని ప్లాట్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ లో ఇల్లు కట్టుకోవడానికి అనువైన ప్రదేశం దొరకదు. ల్యాండ్ కావాలంటే సుదూరం వెళ్లాల్సిందే. దీంతో చాలా మంది అపార్ట్ మెంట్ లోని ప్లాట్లను కొనుగోలు చేస్తారు. అయితే మొన్నటి వరకు నిర్మాణంలో జరుగుతున్న ప్లాట్లను, కొత్త వాటిని కొనుగోలు చేశారు. కానీ ఇప్పుడు పాత వాటికి డిమాండ్ పెరుగుతుంది. కొందరు ప్రత్యేకంగా పాత ఇళ్లు కావాలని కోరుకుంటున్నారు. కారణం ఏంటంటే?

    కాలం మారుతున్న కొద్దీ హైదరాబాద్ ప్రజల జీవన స్థితిగతులు మారుతున్నాయి. ఒకప్పుడు లగ్జరీ లైఫ్ ను అనుభవించిన వాళ్లు ఇప్పుడు డబ్బును బాగా పొదుపు చేయాలని అనుకుంటున్నారు. కరోనా తరువాత ఎప్పుడు ఎలాంటి అవసరం వస్తుందో తెలియని పరిస్థితి ఉన్నందున డబ్బును కొన్నింటిపై ఎక్కువగా ఖర్చు చేయాలనుకోవడం లేదు. పైగా ఇప్పుడు కొత్త ఇల్లు గానీ, అపార్ట్ మెంట్ లోని ప్లాట్ కావాలంటే హైదరాబాద్ శివారుల్లోకి వెళ్లాల్సిందే. దీంతో కార్యాలయాలకు, షాపింగ్ వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. మరో విషయమేంటంటే సొంత ఇల్లు ప్రశాంత వాతావరణంతో పాటు గేటెడ్ కమ్యూనిటీలో ఉండాలని కోరుకుంటున్నారు.

    ఈ నేపథ్యంలో పాత ఇళ్లకు డిమాండ్ పెరుగుతోంది. సాధారణంగా అపార్ట్ మెంట్ లోని ప్లాట్ రోజులు గడిచిన కొద్ద దాని వ్యాల్యూ పడిపోద్ది. దీంతో రేటు తగ్గుతుంది. అంతేకాకుండా గేటేడ్ కమ్యూనిటీలో ఉండడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవు. పైగా సిటీ మధ్యలో ప్లాట్ దొరికితే ఇంకా సౌకర్యంగా ఉంటుంది. అందువల్ల చాలా మంది ఇప్పుడు పాత ప్లాట్లు కొనుగోలు చేయాలని ఆసక్తి చూపుతున్నారు. దీంతో పాత ఇళ్లకు డిమాండ్ పెరుగుతోంది.

    కొత్త ప్లాట్ కొనాలంటే సింగిల్ బెడ్ రూం కు రూ.కోటికి పైగానే అవుతోంది. అదే రూ.60 నుంచి రూ.70 లక్షల వరకు పాత త్రిబుల్ బెడ్ రూం ప్లాట్ వస్తుంది. దీంతో చాలా మంది పాత ఇళ్లను కొనుగోలు చేయాలని అనుకుంటున్నారు. అయితే కొందరు ఇల్లు లేదా ప్లాట్ అమ్మేటప్పుుడు మోసం చేసే అవకాశం ఉంది. రిజిస్ట్రేషన్ డ్యాక్యుమెంట్లు సరిగా ఉండవు. అంతేకాకుండా ఇల్లు పగుళ్లు దాచిపెట్టి తాత్కాలికంగా పెయింట్ వేసే అవకాశం ఉంది. అందువల్ ఈ విషయాలను పరిగణలోకి తీసుకొని పాత ఇల్లను కొనుగోలు చేయాలని రియల్ ఎస్టేట్ నిపుణులు చెబుతున్నారు.