https://oktelugu.com/

Allu Arjun: ఫ్యాన్స్ ని చూసి అల్లు అర్జున్ హీరో ఎలా అయ్యాడు..? ‘గంగోత్రి’ సినిమాకి ఓపెనింగ్స్ ఇచ్చింది అల్లు రామలింగయ్య అభిమానులేనా?

నిన్న జరిగిన మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా పాల్గొన్న అల్లు అర్జున్, ఆ ఈవెంట్ లో చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Written By:
  • Vicky
  • , Updated On : August 22, 2024 / 03:42 PM IST

    Allu Arjun

    Follow us on

    Allu Arjun: ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ ఇమేజ్ లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన మెగాస్టార్ చిరంజీవి, నేడు తన కుటుంబం నుండి ఎంతమంది స్టార్ హీరోలను మన ఇండస్ట్రీ కి పరిచయం చేసాడో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆయన చూపించిన దారి నుండే నేడు అల్లు అర్జున్ కూడా ఇండస్ట్రీ కి వచ్చాడు, పాన్ ఇండియన్ సూపర్ స్టార్ అయ్యాడు. అయితే అల్లు అర్జున్ కి ఒకటి రెండు హిట్స్ వచ్చిన తర్వాత, అతని ప్రవర్తన పూర్తిగా మారిపోయింది, ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఒకప్పుడు చిరంజీవి లేకపోతే, నేను లేను అని తన ప్రతీ ఈవెంట్ లో చెప్పుకునే అల్లు అర్జున్, ఇప్పుడు చిరంజీవి ఊసే ఎత్తడం లేదు. పవన్ కళ్యాణ్ విషయంలో కూడా ఒకప్పటి అల్లు అర్జున్ వైఖరిని, ప్రస్తుతం ఉన్న అల్లు అర్జున్ వైఖరిని చూస్తే ఇంత మార్పు ఎలా వచ్చింది అని ఆశ్చర్యపోక తప్పదు.

    నా ప్రతీ సినిమాకి మొట్టమొదటి టికెట్ తెంపేది మెగా అభిమానియే అని చెప్పుకునే అల్లు అర్జున్, ఇప్పుడు మాత్రం నా అభిమానులను చూసి హీరో అయ్యాను అంటూ చెప్పుకొస్తున్నారు. నిన్న జరిగిన మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా పాల్గొన్న అల్లు అర్జున్, ఆ ఈవెంట్ లో చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అభిమానులను చూసి హీరో అవ్వడం ఏమిటి..?, అంటే అల్లు అర్జున్ హీరో కాకముందే ఆయనకు అభిమానులు ఉన్నారా?, అది ఎలా సాధ్యం?, అంటే ఆయన మొదటి చిత్రం గంగోత్రి ని థియేటర్స్ లో చూసింది చిరంజీవి – పవన్ కళ్యాణ్ అభిమానులా?, లేకపోతే అల్లు రామలింగయ్య అభిమానులా అని సోషల్ మీడియా లో చర్చించుకుంటున్నారు. ఇదంతా పక్కన పెడితే పవన్ కళ్యాణ్ ఎన్నో పోరాటాలు చేసి పదేళ్ల రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించి జనసేన పార్టీ ని నిలబెట్టుకున్నాడు. ఆయనకు కుటుంబం మొత్తం అండగా నిలబడింది, కొంతమంది సినీ ప్రముఖులు మరియు పవన్ కళ్యాణ్ అభిమానులు అన్నం కూడా తినకుండా ఆయన కోసం ఎన్నికల ప్రచారం చేసారు. అలాంటి సమయంలో అల్లు అర్జున్ జనాలకు తప్పుడు సంకేతాలు ఇచ్చేలాగా వైసీపీ పార్టీ కి చెందిన నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవికి వెళ్లి సపోర్టు చెయ్యడం అభిమానుల దృష్టిలో ముమ్మాటికీ తప్పే. శిల్పా రవి రావొద్దు, నీకు సమస్య అవుతుంది, ఇలాంటి పరిస్థితులు వస్తాయని అల్లు అర్జున్ కి చెప్పినా కూడా , ఆయన మాట వినకుండా శిల్పా రవి ఇంటికి వెళ్ళాడు.

    ఇది కావాలని చేసింది కాకుండా మరేంటి?, శిల్పా రవి కి వచ్చి సపోర్ట్ చేసారు కదా, పవన్ కళ్యాణ్ గారి కోసం పిఠాపురం కి వెళ్తారా అని అల్లు అర్జున్ ని రిపోర్టర్ అడగగా, దానికి అల్లు అర్జున్ ‘పవన్ కళ్యాణ్ గారు నన్ను పిలవలేదు..పిలిస్తే కచ్చితంగా వెళ్ళేవాడిని, కానీ శిల్పా రవి పిలవకపోయినా ఎందుకో నాకు చెయ్యాలని అనిపించింది’ అంటూ చెప్పుకొచ్చాడు. అంటే నీ సొంత మామయ్య కంటే శిల్పా రవి ఎక్కువ అయిపోయాడా? అని అభిమానుల మనస్సులో మెలుగుతున్న ప్రశ్న. ఆ సంఘటన కూడా అభిమానులు మర్చిపోతున్న సమయంలో అల్లు అర్జున్ నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ‘నా మనసుకి నచ్చిన పని ఏదైనా చేస్తా’ అంటూ మాట్లాడడం చూస్తుంటే, అతను మెగా ఫ్యామిలీ నుండి పూర్తిగా దూరం అవ్వాలని చూస్తున్నట్టు తెలుస్తుంది.