YS Jagan : ఎన్నికల పై జగన్ సంచలన ట్వీట్

YS Jagan ప్రపంచవ్యాప్తంగా దాదాపు అభివృద్ధి చెందిన ప్రజాస్వామ్య దేశాల్లో ఎన్నికల ప్రక్రియ పేపర్ బ్యాలెట్ ద్వారా జరుగుతున్న విషయాన్ని జగన్ గుర్తుకొచ్చారు. మొత్తానికి అయితే ఏపీలో ఈవీఎంల ట్యాంపరింగ్ తో విజయాన్ని సొంతం చేసుకున్నారని జగన్ పరోక్షంగా సంకేతాలు పంపారు.

Written By: NARESH, Updated On : June 18, 2024 10:11 am

YS Jagan

Follow us on

YS Jagan : దేశవ్యాప్తంగా ఇప్పుడు ఈవీఎం యంత్రాలపై బలమైన చర్చ నడుస్తోంది. వాటి పనితీరుపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సార్వత్రికి ఎన్నికల్లో ఈవీఎంలను టాంపరింగ్ చేశారని.. వాటిల్లో రికార్డ్ అయిన ఫలితాలను తారుమారు చేశారంటూ మీడియాలో కథనాలు వస్తున్నాయి. దేశవ్యాప్తంగా 140కి పైగా లోక్ సభ నియోజకవర్గాల్లో ఓటర్ల జాబితా కంటే అధికంగా ఓట్లు ఫోన్ కావడం అనుమానాలు ఉన్నాయి. దీనిపై సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఇప్పటికే ప్రస్తావించారు. ఒక అడుగు ముందుకేసి ప్రశాంత్ భూషణ్ న్యాయపోరాటానికి సిద్ధపడుతున్నారు.

ఏపీలో వచ్చిన ఫలితాలు చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. చివరకు టిడిపి శ్రేణులు సైతం నమ్మలేకపోతున్నాయి. తమ పార్టీ క్యాడర్ ఓట్లు ఎటు వెళ్లిపోయాయి అంటూ వైసీపీ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలకు ముందు వరకు వై నాట్ 175 అన్న నినాదంతో వారు ముందుకు సాగారు. కానీ కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితమయ్యారు. టిడిపి కూటమి గెలిచిన చోట 50వేల ఓట్లకు పైగా మెజారిటీ వచ్చింది. వైసిపి గెలిచిన చోట తక్కువ మెజారిటీ లభించింది. వైసీపీ వర్సెస్ ఓటమి మధ్య గట్టి ఫైట్ నడిచింది. కానీ ఏకపక్షంగా కూటమి విజయం సాధించింది. 120 కి పైగా అసెంబ్లీ స్థానాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు 50 వేలకు పైగా మెజారిటీ సాధించారు. దీంతో ఒక రకమైన నమ్మకం అందరిలో నాటుకు పోయింది. వైసిపి పై ఈ స్థాయిలో వ్యతిరేకత లేదని.. కానీ ఫలితాలు ఏకపక్షంగా రావడం ఏమిటన్న ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఈవీఎంలను హ్యాక్ చేయడం, వాటిని మార్చి వేయడం వంటి వాటితోనే ఏపీలో ఫలితాలు తారుమారు అయ్యాయనే వాదనలు లేకపోలేదు.

జైంట్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ సోషల్ మీడియాలో ఈవీఎంలపై పెట్టిన ట్విట్ సంచలనం గా మారింది. ఈవీఎంలను హ్యాక్ చేయవచ్చని కూడా ఆయన తెలిపారు. మనుషుల ద్వారా లేదా ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ద్వారా ఈవీఎంలను హ్యాక్ చేయడం సాధ్యపడుతుందని చెప్పారు. ఎన్నికల్లో ఈవీఎంల వినియోగాన్ని నియంత్రించాల్సిన అవసరం ఉందన్నారు. దీనిపై తాజాగా వైసిపి అధినేత జగన్ స్పందించారు. ఈవీఎంల పనితీరుపై అనుమానాలు వ్యక్తం చేశారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ఆయన స్పందించడం ఇదే తొలిసారి. న్యాయం జరగడం మాత్రమే కాదు. అది జరిగినట్టు కనిపించాల్సిన అవసరం కూడా ఉందని జగన్ వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి అంటే అది బలంగా కనిపించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు అభివృద్ధి చెందిన ప్రజాస్వామ్య దేశాల్లో ఎన్నికల ప్రక్రియ పేపర్ బ్యాలెట్ ద్వారా జరుగుతున్న విషయాన్ని జగన్ గుర్తుకొచ్చారు. మొత్తానికి అయితే ఏపీలో ఈవీఎంల ట్యాంపరింగ్ తో విజయాన్ని సొంతం చేసుకున్నారని జగన్ పరోక్షంగా సంకేతాలు పంపారు.