Sandeep Reddy Vanga : ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న దర్శకులందరూ కథలను నమ్ముకునే కంటే ఎలివేషన్స్ బాగా నమ్ముకుంటున్నట్టుగా తెలుస్తోంది. అందుకే ఏ స్టార్ హీరో సినిమా చూసినా కూడా ఎలివేషన్స్, ఎమోషన్స్ తోనే డ్రామాని లాగిస్తున్నారు తప్ప కథ మీద పెద్దగా ఫోకస్ అయితే పెట్టినట్టుగా కనిపించడం లేదు. మరి ప్రేక్షకులు కూడా అలాంటి సీన్స్ ఉన్న సినిమాలకే బ్రహ్మారథం పడుతున్నారు. ఇక ఇప్పుడు సందీప్ రెడ్డివంగా – ప్రభాస్ కాంబినేషన్ లో వస్తున్న ‘ స్పిరిట్’ సినిమా కూడా అలాంటి కోవకే చెందినది కావడం విశేషం…మరి వీళ్ళిద్దరి కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా ఎంతటి సక్సెస్ ని సాధించబోతుందనేది కూడా తెలియాల్సిన అవసరమైతే ఉంది. ఇక ఇప్పుడు హను రాఘవ పూడి దర్శకత్వంలో ఫౌజీ అనే సినిమా చేస్తున్న ప్రభాస్ ఈ సినిమాని కంప్లీట్ చేసిన వెంటనే సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో చేయబోయే స్పిరిట్ సినిమా మీదకి తన ఫోకస్ ని పెట్టబోతున్నట్టుగా తెలుస్తోంది. అయితే సందీప్ రెడ్డి వంగా అంటేనే భారీ ఎలివేషన్ తో సీన్స్ రాసుకుంటాడనే విషయం మనందరికీ తెలిసిందే. కాబట్టి ఈ సినిమాతో కూడా అంతకు మించిన సక్సెస్ ను ఇవ్వాలనే ఉద్దేశ్యంతో ప్రభాస్ చేత ఈ సినిమాను చేయించాలనే ఉద్దేశ్యంతో కంటెంట్ ను అయితే రెడీ చేశాడు. ఇక దానికి తగ్గట్టుగానే ప్రభాస్ ఇందులో పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడనే ఒక న్యూస్ ను కూడా లీక్ చేశాడు. ఇక అభిమానులకైతే ఇప్పటివరకు ప్రభాస్ ఫుల్ లెంత్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ లో కనిపించలేదు.
కాబట్టి ఒక కొత్త క్యారెక్టర్ గా చెప్పుకోవడానికి అలాగే ఈ సినిమాని సక్సెస్ ఫుల్ గా నిలపడానికి అవకాశం అయితే ఉంది…ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకునే దర్శకులు ఇండస్ట్రీలో చాలామంది ఉన్నప్పటికి సందీప్ రెడ్డి వంగ కి చాలా ప్రత్యేకమైన గుర్తింపైతే ఉంది.
ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ ని ఏలుతున్న దర్శకుడు అయిన రాజమౌళి లాంటి దిగ్గజ దర్శకుడికి కూడా సందీప్ రెడ్డి వంగ ఫేవరేట్ డైరెక్టర్ గా మారాడు అంటే ఆయన అంత టాలెంటెడ్ డైరెక్టర్ అనేది మనం అర్థం చేసుకోవచ్చు…
ఇక సందీప్ రెడ్డివంగ నుంచి సినిమా వస్తుంది అంటే చాలు యూత్ లో మంచి క్రేజ్ అయితే ఉంటుంది. ఇక ప్రభాస్ కి ఎంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో మనకందరికీ తెలిసిందే. కాబట్టి వీళ్ళ కాంబినేషన్ లో రాబోతున్న స్పిరిట్ సినిమా ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందనేది తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిందే…