Homeఎంటర్టైన్మెంట్Allu Arjun : అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్, ఇండస్ట్రీ హిట్ పడినా...

Allu Arjun : అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్, ఇండస్ట్రీ హిట్ పడినా తప్పడం లేదు, మేటర్ ఏంటంటే?

Allu Arjun :  పుష్ప 2 అనేక కొత్త రికార్డులు నమోదు చేస్తుంది. అత్యంత వేగంగా రూ. 500 కోట్ల వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది. పుష్ప 2 ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ రికార్డులను తుడిచి పెడుతుంది. ముఖ్యంగా బాలీవుడ్ లో ఈ చిత్రానికి ఎవరూ ఊహించని రెస్పాన్స్ దక్కుతుంది. ఫస్ట్ డేకి మించి 3వ రోజు వసూళ్ళు ఉండనున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో టికెట్స్ ధరలు తగ్గిస్తే ఇంకా మంచి రెస్పాన్స్ ఉంటుందని అంటున్నారు. టికెట్స్ ధరలు కొంత మేర వసూళ్లను ప్రభావితం చేశాయనే వాదన ఉంది. పుష్ప 2 టీమ్ చాలా హ్యాపీగా ఉన్నారు. సక్సెస్ మీట్ కూడా ఏర్పాటు చేసుకున్నారు. పుష్ప 2 రన్ ముగిసే నాటికి అనేక సరికొత్త రికార్డులు ఆ చిత్రం పేరిట ఉంటాయి అనడంలో సందేహం లేదు.

సుకుమార్ ఏకంగా మూడేళ్లు పుష్ప 2 కోసం కష్టపడ్డారు. అల్లు అర్జున్ మాస్ మేనరిజం, బాడీ లాంగ్వేజ్ పుష్పరాజ్ పాత్రను ఎక్కడికో తీసుకెళ్లాయి. అల్లు అర్జున్ జాతీయ ఉత్తమ నటుడు అవార్డుకి అర్హుడు. పుష్ప 2 చిత్రానికి ఆయనకు మరోసారి ఈ అవార్డు రావచ్చని అంటున్నారు. అల్లు అర్జున్ కి జంటగా రష్మిక మందాన నటించింది. ఫహద్ ఫాజిల్, జగపతిబాబు, సునీల్, అనసూయ, రావు రమేష్ వంటి నటులు కీలక రోల్స్ చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించగా, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు.

ఇదిలా ఉంటే అల్లు అర్జున్ తన తదుపరి చిత్రం త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చేస్తున్నాడు. జనవరిలో పూజా కార్యక్రమాలు జరుపుకుని సమ్మర్ లో ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళుతుందని అంచనా వేశారు. కానీ జూన్, జులై వరకు త్రివిక్రమ్ శ్రీనివాస్-అల్లు అర్జున్ చిత్రం మొదలయ్యే సూచనలు లేవట. అల్లు అర్జున్ మార్కెట్, రేంజ్ రీత్యా.. అదే స్థాయిలో భారీగా ప్లాన్ చేస్తున్నారట. స్క్రిప్ట్ వర్క్ తో పాటు ప్రీ ప్రొడక్షన్ పూర్తి కావడానికి సమయం ఉందట. దాదాపు 7 నెలలకు పైగా అల్లు అర్జున్ ఖాళీగా ఉండాల్సిందే ఉంటున్నారు.

నాపేరు సూర్య మూవీ అనంతరం అల్లు అర్జున్ కి రెండేళ్ల గ్యాప్ వచ్చింది. అల వైకుంఠపురములో చిత్రంలో తనపై తానే సెటైర్ వేసుకుంటాడు అల్లు అర్జున్. ”గ్యాప్ తీసుకోలేదు వచ్చింది” అని త్రివిక్రమ్ రాసిన డైలాగ్ పాప్యులర్ అయ్యింది. ఇక వీరిద్దరూ హ్యాట్రిక్ పూర్తి చేశారు. డబుల్ హ్యాట్రిక్ కి సిద్ధం అవుతున్నారు. త్రివిక్రమ్ గత చిత్రం గుంటూరు కారం పర్లేదు అనిపించుకుంది. పూర్తి స్థాయిలో మెప్పించలేదు.

RELATED ARTICLES

Most Popular