Homeఎంటర్టైన్మెంట్Vijay Devarakonda-Rashmika: రష్మిక-విజయ్ దేవరకొండ కలిసే ఉంటున్నారా.. మళ్ళీ అడ్డంగా బుక్ అయ్యారుగా!

Vijay Devarakonda-Rashmika: రష్మిక-విజయ్ దేవరకొండ కలిసే ఉంటున్నారా.. మళ్ళీ అడ్డంగా బుక్ అయ్యారుగా!

Vijay Devarakonda-Rashmika: నిప్పులేనిదే పొగరాదు అంటారు. విజయ్ దేవరకొండ-రష్మిక మందాన మధ్య ఏదో నడుస్తుంది అనే టాక్ ఎప్పటి నుంచో ఉంది. కానీ దాన్ని వాళ్లిద్దరూ ఒప్పుకోరు. అయితే ఎప్పుడూ కలిసే ఉంటారు. తాజాగా ఈ క్రేజీ లవ్ బర్డ్స్ మరోసారి బుక్ అయ్యారు. ఆ వివరాలు ఏమిటో చూద్దాం. రష్మిక మందాన-విజయ్ దేవరకొండ గీత గోవిందం మూవీలో మొదటిసారి కలిసి నటించారు. ఆ మూవీ బ్లాక్ బస్టర్. విజయ్ దేవరకొండ, రష్మిక మందాన కెరీర్స్ కి గట్టి పునాదులు వేసిన చిత్రం అది.

తర్వాత డియర్ కామ్రేడ్ టైటిల్ తో మరో చిత్రం చేశారు. ఈ చిత్రం ఆశించిన స్థాయిలో ఆడలేదు. అయితే విజయ్ దేవరకొండ, రష్మిక మందాన మధ్య కెమిస్ట్రీ అదిరింది. ముద్దు సన్నివేశాల్లో రెచ్చిపోయి నటించారు. లైగర్ మూవీ షూటింగ్ సమయంలో ముంబైలో తరచుగా చక్కర్లు కొడుతూ కనిపించారు ఈ జంట. దాంతో బాలీవుడ్ మీడియాలో వరుస కథనాలు వెలువడ్డాయి. విజయ్ దేవరకొండ-రష్మిక రిలేషన్ లో ఉన్నారనే టాక్ వినిపించింది.

రెండుసార్లు విజయ్ దేవరకొండ-రష్మిక మందాన మాల్దీవ్స్ వెకేషన్ కి వెళ్లారు. ఈ విషయాన్ని రష్మిక మందాన ఒప్పుకోవడం విశేషం. విజయ్ దేవరకొండ నాకు ఫ్రెండ్ అతనితో వెకేషన్ కి వెళితే తప్పేముందని రష్మిక మందాన అన్నారు. వీరిద్దరూ ఒకే హోటల్ రూమ్ లో ఉన్నట్లు కూడా ఆధారాలు దొరికాయి. రష్మిక మందాన ఆ హోటల్ నుండి ఫ్యాన్స్ తో ఆన్లైన్ చాట్ చేసింది. అప్పుడు బ్యాక్ గ్రౌండ్ లో విజయ్ దేవరకొండ ఫోన్లో మాట్లాడుతున్న వాయిస్ వినిపించింది.

ఇలా పలు విషయాలు వారిద్దరూ ప్రేమికులే అని ధ్రువీకరిస్తున్నాయి. తాజాగా మరోసారి బుక్ అయ్యారు. ఇద్దరూ ఒకే చోట ఉన్నట్లు వారి సోషల్ మీడియా పోస్ట్స్ తో క్లారిటీ వచ్చింది. దాంతో అసలు విజయ్ దేవరకొండ-రష్మిక మందాన కలిసే ఉంటున్నారనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. త్వరలోనే వీరు తమ రిలేషన్ పై ఓపెన్ అవుతారు. గుడ్ న్యూస్ చెబుతారని అంటున్నారు. అయితే ఇద్దరు తమ తమ ప్రాజెక్ట్స్ లో బిజీగా ఉన్నారు. నేను లవ్ మ్యారేజ్ చేసుకుంటానని విజయ్ దేవరకొండ ఇటీవల చెప్పారు.

Exit mobile version