https://oktelugu.com/

Low Budget Car: రూ. 5 లక్షల లోపు బడ్జెట్ లో కారు కొనాలనుకుంటున్నారా? ఇవి మీకోసమే..

మారుతి కంపెనీకి చెందిన మరో కారు ఎస్ ప్రెస్సో 5 సీటర్ కారును రూ.4.26 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు. 5 సీటర్ కారు అయినా ఇందులో స్మార్ట్ ప్లే స్టూడియోతో డైనమిక్ సెంటర్ కన్సోల్ ను కలిగి ఉంది.

Written By:
  • Srinivas
  • , Updated On : April 4, 2024 / 01:10 PM IST

    Low budget cars

    Follow us on

    Low Budget Car:  కార్ల వినియోగం రోజురోజుకు పెరిగిపోతుంది. దీంతో కొన్ని కంపెనీలు వినియోగదారులను ఆకర్షించేందుకు రకరకాల మోడళ్లను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. అయితే చాలా మంది కారు కొనాలనుకునేవారు ధర తక్కువగా ఉండేవాటిపై ఇంట్రెస్ట్ పెడుతారు. దీంతో కొన్ని కంపెనీలు సామన్యులకు అందుబాటులో ఉండే విధంగా తయారు చేసి మార్కెట్లోకి తీసుకొచ్చాయి. ఇవి రూ.5 లక్షల లోపు ఉండడం విశేషం. ఈ మోడళ్లు ధర తక్కువైనా మైలేజ్ విషయంలో తగ్గేదేలే అన్నట్లుగా ఉన్నాయి. మరి వాటి గురించి వివరాల్లోకి వెలితే..

    చిన్న ఫ్యామిలీ అయి ఉండి తక్కువ అవసరాలకు ఉపయోగించే కొందరు లో బడ్జెట్ లో కారు కొనాలని చూస్తారు. ఇలాంటి వారి కోసం కొన్ని కంపెనీలు రూ.5 లక్షల లోపు కార్ల ను విక్రియించేందుకు రెడీ అయ్యాయి. వీటిలో మారుతికి చెందిన మూడు కార్లు ఉన్నాయి. ఒకటి ఆల్టో కే 10 5 సీటర్ ఉంది. దీనిని రూ.3.99 లక్షల ప్రారంభ ధరతో విక్రయించనున్నారు.

    మారుతి కంపెనీకి చెందిన మరో కారు ఎస్ ప్రెస్సో 5 సీటర్ కారును రూ.4.26 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు. 5 సీటర్ కారు అయినా ఇందులో స్మార్ట్ ప్లే స్టూడియోతో డైనమిక్ సెంటర్ కన్సోల్ ను కలిగి ఉంది. ఈ రెండు కార్లలో పెట్రోల్ వేరియంట్ తో పాటు సీఎన్ జీ ఆప్షన్లు కూడా ఉన్నాయి. ఇవి సీఎన్ జీ లో 26.78 కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వనుంది.

    రెనాల్ట్ కంపెనీకి చెందిన క్విడ్ కారు రూ.4.70 లక్షలతో విక్రయించనున్నారు. ఇది ఏ ఎంటీ డయల్ ను కలిగి ఉంది. 279 లీటర్ల బూట్ స్పేస్ ను కలిగి ఉన్న ఈ కారు మిడిల్ క్లాస్ పీపుల్స్ కు కన్వినెంట్ గా ఉండనుంది. ప్రపంచీకరణలో భాగంగా కార్ల ధరలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. కానీ సామాన్యులకు సైతం కార్లను అందించానే ఉద్దేశంతో కొన్ని కంపెనీలు తక్కువ ధరకే విక్రయించడంతో వీటిపై ఆసక్తి చూపుతున్నారు.