Sukumar and Ram Charan : సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ముందుకు సాగుతున్న విషయం మనకు తెలిసిందే… ఇక ఏది ఏమైనా కూడా తమదైన రీతిలో సత్తా చాటుకున్న హీరోలు వరుసగా భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ లను సాధించడానికి ట్రై చేస్తున్నారు…
మెగా పవర్ స్టార్ గా తనకంటూ ప్రత్యేకతను ఏర్పాటు చేసుకున్న హీరో రామ్ చరణ్…ఆయన ఇప్పుడు చేయబోతున్న సినిమాల మీద భారీగా దృష్టిని సారించినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ఆయన చేసిన చాలా సినిమాలు మంచి విజయాలను సాధిస్తూ ముందుకు సాగుతున్నాయి. ఇక శంకర్ డైరెక్షన్ లో చేసిన గేమ్ చేంజర్ సినిమా 2025 సంక్రాంతి కానుకగా ప్రేక్షకులకు ముందుకు రాబోతుంది. ఇక ఈ సినిమా రిలీజ్ కి మరొక 20 రోజుల సమయం మాత్రమే ఉన్న నేపధ్యంలో సినిమా యూనిట్ ఇప్పటికే ప్రమోషన్స్ ను మొదలుపెట్టారు. ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో భారీ సక్సెస్ ని సాధించాలని చూస్తున్న రామ్ చరణ్ తనదైన రీతిలో సత్తా చాటుకుంటాడా లేదా అనేది కూడా తెలియాల్సిన అవసరమైతే ఉంది… ఇక రామ్ చరణ్ తదుపరి సినిమాని బుచ్చిబాబు తో చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఆ తర్వాత సుకుమార్ డైరెక్షన్ లో ఒక సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాడు. ఇక వీళ్ళ కాంబినేషన్ లో తెరకెక్కే సినిమా భారీ సక్సెస్ ని సాధించబోతున్నట్టుగా కూడా తెలుస్తోంది. అయితే వీళ్ళ కాంబినేషన్ లో ఇంతకు ముందే రంగస్థలం అనే సినిమా వచ్చింది.
ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఇక ఇప్పుడు రాబోయే సినిమా కూడా ఇలాంటి జానర్ లోనే తెరకెక్కుతుందా? లేదంటే కొత్తగా ఏదైనా ట్రై చేస్తున్నారా? అంటూ ప్రేక్షకుల నుంచి కొంతవరకు ప్రశ్నలైతే వెలువడుతున్నాయి. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం రాజమౌళి మహేష్ బాబు ఎలాగైతే ఒక అడ్వెంచర్ జానర్ లో సినిమాని చేయాలని చూస్తున్నారో వీళ్ళు కూడా అలాంటి ఒక అడ్వెంచర్ జానర్లోనే సినిమాలు చేయబోతున్నట్టుగా తెలుస్తోంది.
మరి రాజమౌళికి పోటీగా సుకుమార్ ఈ సినిమాని దింపుతున్నాడు అంటూ మరి కొంతమంది భావిస్తుంటే రాజమౌళి ని ఢీకొట్టే కెపాసిటీ సుకుమార్ కి ఉందా? అంటూ మరి కొంతమంది కామెంట్లైతే వ్యక్తం చేస్తున్నారు. ఇక పుష్ప 2 సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న సుకుమార్ మరోసారి తన సత్తా ఏంటో చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా తెలుస్తోంది.
ఇక ఏది ఏమైనా కూడా సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటులు వాళ్లను వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి దర్శకులు చాలా వరకు హెల్ప్ చేస్తున్నారు. మరి రామ్ చరణ్ ని కూడా పాన్ ఇండియాలో మరోసారి స్టార్ హీరోగా నిలబెట్టే ప్రయత్నం సుకుమార్ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది…ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమా కనక సూపర్ సక్సెస్ సాధిస్తే మాత్రం సుకుమార్ టాప్ డైరెక్టర్ గా ఎదగడమే కాకుండా రామ్ చరణ్ కూడా గ్లోబల్ స్టార్ గా మరోసారి తనను తాను ఎస్టాబ్లిష్ చేసుకున్నవాడవుతాడు…