UPI Payments: ప్రస్తుతం అందరూ విరివిగా ఫోన్ పే, గూగుల్ పే వంటివి వాడుతున్నారు. ఈ రోజుల్లో ఎక్కువగా డిజిటల్ పేమెంట్స్ వాడుతున్నారు. నెట్ కాష్ కంటే ప్రతీ దానికి కూడా ఆన్‌లైన్ పేమెంట్స్ చేస్తున్నారు. నిజం చెప్పాలంటే ఏ వస్తువు అయిన కొనాలంటే ఒకప్పుడు బయటకు వెళ్లేవారు. కానీ ప్రస్తుతం కూర్చున్న ప్లేస్ నుంచే అన్ని కొనుగోలు చేస్తున్నారు. ఎవరికైనా డబ్బులు పంపించాలన్నా కూడా క్షణాల్లో డిజిటల్ పేమెంట్స్ చేస్తున్నారు. బ్యాంకులకు వెళ్లి కట్టే ఇబ్బంది లేకుండా ఉన్న దగ్గర నుంచే ఇతరులకు పంపిస్తున్నారు. ఇలా కేవలం ఇతరులకు డబ్బులు పంపించడమే కాకుండా.. ప్రతీ చిన్న విషయానికి కూడా యూపీఐ పేమెంట్స్ చేస్తున్నారు. మార్కెట్‌కి వెళ్లి ఒక చిన్న చాక్లెట్ కొనాలన్నా కూడా ఈ రోజుల్లో అందరూ ఫోన్ పే లేదా గూగుల్ పే వాడుతున్నారు. ఇలా యూపీఐ పే చేసిన ప్రతీసారి కొంత ఎక్స్‌ట్రా ఛార్జ్ చేస్తే ఎంతో డబ్బు సంపాదించవచ్చు. అయితే యూపీఐపై ఈ మధ్యన ఒక వార్త బాగా ప్రచారం అవుతుంది. యూపీఐ ట్రాన్సక్షన్ చేస్తే ట్యాక్స్ కట్టాల్సి వస్తుందని అంటున్నారు. మరి యూపీఐ పేమెంట్స్ చేస్తే నిజంగానే ఎక్స్‌ట్రా డబ్బులు ఛార్జ్ చేస్తారా? లేదా? ఇందులో నిజమెంతో ఈ స్టోరీలో చూద్దాం.
యూపీఐ వాడకం పెరిగిపోవడంతో చాలా మందికి అనుమానాలు వస్తున్నాయి. ఈ క్రమంలో కొందరు పేమెంట్ చేస్తే ట్యాక్స్ కట్టాలని ఓ వార్త ప్రచారం చేస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి గూగుల్ పే, ఫోన్ పే లేదా ఏ ఇతర యూపీఐ పేమెంట్స్ చేసిన కూడా డబ్బులు కట్ అవుతాయట. రూ. 2 వేలకు కంటే ఎక్కువగా అమౌంట్ ట్రాన్స్‌ఫర్ చేస్తే 1.1% పన్ను కట్టాల్సి వస్తుందని ఓ వార్త నెట్టింట వైరల్ అవుతోంది. ఉదాహరణకు మీరు ఎవరికైనా ఒక రూ.5000 పంపిస్తే.. వారికి ట్యాక్స్ రూపంలో రూ.55 కట్ అవుతుంది. మీరు ఇతరులకు పంపించే డబ్బులు బట్టి ఈ ట్యాక్స్ పడుతుందనే వార్తలు జోరుగా సాగాయి. అయితే ఈ యూపీఐపై ట్యాక్స్ వార్త ఫేక్ అని, ఇందులో ఎలాంటి నిజం లేదని కేంద్రం స్పష్టం చేసింది. ఇది ఫేక్ వార్త అని, ఎవరో ఇలా స్ప్రెడ్ చేస్తున్నారని తెలిపింది. సాధారణ యూపీఐ ట్రాన్సక్షన్లపై ఎలాంటి ట్యాక్స్ విధించమని కేంద్రం తెలిపింది. కేవలం డిజిటల్ వ్యాలెట్లు అయిన ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రూమెంట్లపైనే ఛార్జ్ చేస్తు్న్నట్లు కేంద్రం స్పష్టం చేసింది.
ప్రస్తుతం రోజుల్లో యూపీఐ వాడకం బాగా పెరిగిపోయింది. దీంతో వీటిపై ఎలాంటి వార్తలు వచ్చిన కూడా ఎక్కువగా నమ్మేస్తుంటారు. సోషల్ మీడియా వినియోగం పెరగడంతో కొందరు చెడుకి ఉపయోగిస్తున్నారు. వ్యూస్ కోసం ఇలాంటి ఫేక్ న్యూస్‌ను కొందరు స్ప్రెడ్ చేస్తున్నారు. ఇలాంటి ఫేక్ వార్తలను నమ్మవద్దని, అధికారంగా తెలిపితేనే నమ్మాలని కేంద్రం ప్రజలను సూచించింది. కాబట్టి సోషల్ మీడియాలో వచ్చే ఇలా ఫేక్ న్యూస్‌ను నమ్మవద్దు.