Vishal Mega Mart IPO: గురుగ్రామ్‌కు చెందిన ప్రముఖ సంస్థ విశాల్ మెగామార్ట్ ఇటీవల ఐపీఓకి అడుగుపెట్టింది. బిడ్డింగ్ కోసం డిసెంబర్ 11వ తేదీన ఐపీఓ ఒపెన్ అయ్యింది. సబ్‌స్క్రిప్షన్ డిసెంబర్ 11వ తేదీన ఉదయం 10 గంటలకు ప్రారంభం కాగా.. డిసెంబర్ 13వ శుక్రవారం సాయంత్రం 5 గంటల వరకు జరిగింది. విశాల్ మెగా మార్ట్ ఐపీఓ ఒక్కో షేర్‌ను రూ.74 నుంచి రూ.78 వరకు నిర్ణయించారు. అయితే ఈ కంపెనీ గ్రే మార్కెట్ ప్రీమియం(GMP) దాని లిస్టింగ్‌కు ఒక రోజు ముందే పెరిగింది. నిన్న సాయంత్రం IPO కేటాయించారు. దీంతో పబ్లిక్ ఇష్యూ రూ.1.61 లక్షల కోట్ల విలువైన బిడ్‌లను పెట్టుబడిదారులు ఆకర్షించారు. హైపర్ మార్కెట్ చైన్ షేర్లు డిసెంబర్ 18న ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈలలో లిస్ట్ కానున్నాయి. షేర్ కేటాయింపును అధికారిక రిజిస్ట్రార్ KFin టెక్నాలజీస్ లిమిటెడ్‌లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. విశాల్ మెగా మార్ట్ షేర్లు గ్రే మార్కెట్‌లో కేవలం ఒక్క రోజులో జీఎమ్‌పీ 25 శాతానికి పెరిగింది. విశాల్ మెగా మార్ట్‌లు దేశంలో మొత్తం 645 స్టోర్‌లు ఉన్నాయి. రూ.8000 కోట్ల పబ్లిక్ ఇష్యూ 27 రెట్లు ఓవర్ సబ్‌స్క్రిప్షన్ వచ్చింది. ఇన్వెస్టర్ల ఆఫర్‌లో అయితే 75.67 కోట్లు షేర్లకు వ్యతిరేకంగా 2064 కోట్ల షేర్లకు వేలం వేశారు.
విశాల్ మెగా మార్ట్‌లో ధరలు చాలా తక్కువ నుంచి ఉంటాయి. కనీస ధర రూ.99 నుంచే ప్రారంభం అవుతుంది. ఈ విశాల్ మెగా మార్ట్‌ను దేశంలో 2001లో స్థాపించారు. ఇందులో కిరాణా, దుస్తులు, ఎలక్ట్రానిక్స్, గృహవసరాలు అన్ని కూడా ఉంటాయి. ఇది ఒక హైపర్ మార్కెట్ చైన్. దేశం మొత్తం మీద 645 స్టోర్‌లు ఉన్న వాటిలో 16,537 ఉద్యోగులు ఉన్నారు. ఈ కంపెనీ ఉత్పత్తులను వెబ్‌సైట్, స్టోర్, మొబైల్ యాప్ ద్వారా కూడా కొనుగోలు చేసుకోవచ్చు. దేశంలో ఉన్న డీమార్ట్ వంటి స్టోర్‌లాగే విశాల్ మార్ట్‌లో అన్ని సరుకులు లభిస్తాయి. మధ్య తరగతి ప్రజలకు ఈజీగా తక్కువ ధరలకు లభించే విధంగా ఇందులో అన్ని వస్తువులు ఉంటాయి. తెలుగు రాష్ట్రాల్లో తక్కువగా ఈ విశాల్ స్టోర్‌లు ఉన్నాయి. ఉత్తర భారత దేశంలో అయితే విశాల్ మెగా మార్ట్ స్టోర్‌లు విపరీతంగా కనిపిస్తాయి.
ఈ కంపెనీలోని షేర్లు గ్రే మార్కె్ట్‌లో రూ.26 ప్రీమియంతో దొరుకుతాయి. ఒక లాట్‌ను ఈ కంపెనీలో కొనుగోలు చేయాలంటే మొత్తం 190 షేర్లకు పెట్టుబడుదారులు వేలం వేయాలి. హైపర్ మార్కెట్ కంపెనీ అయిన విశాల్ మెగా మార్ట్ ఐపీఓ ఒక్కో షేర్ ధర రూ.74 నుంచి రూ.78గా నిర్ణయించింది. దీంతో మొత్తం 1,025,641025 షేర్లను విక్రయిస్తోంది. ఇదే రేటుకి ఒక లాట్ ధరఖాస్తు చేయాలంటే రూ.4820 వరకు పెట్టుబడి పెట్టాలసి వస్తుంది.