Pawan Kalyan and Prabhas : పాన్ ఇండియాలో టాలీవుడ్ లో స్టార్ హీరోల హవా ఎక్కువగా కొనసాగుతుంది. ప్రస్తుతం ప్రతి ఒక్క హీరో వాళ్ల సినిమాలతో సందడి చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే సమ్మర్ సీజన్ స్టార్ట్ అవ్వబోతున్న నేపధ్యంలో ఇప్పటివరకు ఒక్క సమ్మర్ సినిమా కూడా అనౌన్స్ చేయలేదు. ఇక పవన్ కళ్యాణ్ (Pavan Kalyan) హీరోగా వస్తున్న ‘హరి హర వీరమల్లు’ (Hari Hara Veeramallu) సినిమా మేకర్స్ దాదాపు ప్రతిసారి తమ రిలీజ్ డేట్ ని పోస్ట్ పోన్ చేసుకుంటూనే వస్తున్నారు. ఇక ఇంతకు ముందే మార్చి 28వ తేదీన సినిమాను రిలీజ్ చేస్తామంటూ మేకర్స్ అనౌన్స్ చేసినప్పటికి ఆ తేదీన కూడా ‘హరిహర వీరమల్లు’ సినిమా వచ్చే అవకాశాలు లేవు అంటూ మరికొన్ని వార్తలైతే వస్తున్నాయి. ఇక ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కూడా చాలా వరకు బ్యాలెన్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు పూర్తి చేసుకోవాలి. అలాగే పోస్ట్ పొడక్షన్ వర్క్ ని ఎప్పుడు కంప్లీట్ చేసుకొని ప్రేక్షకుల ముందుకు వస్తుందనే దానిమీద నైతే క్లారిటీ లేకుండా పోయింది… ఇక ఏప్రిల్ లో ప్రభాస్(Prabhas) రాజాసాబ్ (Rajasaab) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తాడంటూ సందడి చేసినప్పటికి ఇప్పుడు ఆ సినిమా కూడా పోస్ట్ పోన్ అయ్యే విధంగా కనిపిస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం ప్రభాస్ ఫౌజి (Fouji) సినిమా మీద తన పూర్తి డేట్స్ ని కేటాయించాడు. రాజాసాబ్ సినిమా షూట్ ఇంకా కొంచెం బ్యాలెన్స్ ఉన్న నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన డేట్స్ ని ప్రభాస్ ఇవ్వడం లేదట.
మరి దాని వల్ల ఈ సినిమా కూడా రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ కొన్ని వార్తలైతే వెలువడుతున్నాయి…ఇక చిరంజీవి వశిష్ట కాంబినేషన్ లో వస్తున్న విశ్వంభర (Vishvam bhara) సినిమా కూడా మే లో రిలీజ్ అవుతుంది అంటూ అనౌన్స్ చేశారు.
కానీ ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన రెండు పాటలు, 5 రోజుల టాకీ పార్ట్ బ్యాలెన్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి వీటన్నింటినీ ఎప్పుడు పూర్తి చేసుకొని గ్రాఫిక్స్ వర్క్ ని ఎప్పుడు కంప్లీట్ చేసుకుంటుంది. రిలీజ్ కి మరొక మూడు నెలల సమయం మాత్రమే ఉన్న నేపధ్యంలో ఈ సినిమా కూడా మే లో వచ్చే అవకాశాలు లేనట్టుగా కనిపిస్తున్నాయి…
మన స్టార్ హీరోలు సమ్మర్ ని ఎందుకు వృధగా వదిలేస్తున్నారో ఎవరికి అర్థం కావడం లేదు. నిజానికి పండుగ సీజన్ల కంటే సమ్మర్ సీజన్ సినిమాలకు చాలా బాగా కలిసి వస్తుంది. మరి ఇలాంటి సందర్భంలో ఇలా నెగ్లెక్ట్ చేయడం కరెక్ట్ కాదు అంటూ కొంతమంది సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు…