Deepseek: డీప్ సీక్(Deep seak) వల్ల.. ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు ఒడి దుడుకులకు గురయ్యాయి. ముఖ్యంగా అమెరికా స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలను నమోదు చేశాయి. ట్రంప్ ఇటీవల ప్రకటించిన జన్మత: పౌరసత్వం రద్దు నిర్ణయం కంటే కూడా డీప్ సీక్(Deep seak) వల్ల అమెరికా స్టాక్ మార్కెట్లకు జరిగిన నష్టం ఎక్కువ. అంటే చైనా దేశంలో పుట్టిన డీప్ సీక్(Deep seak) అమెరికా కంపెనీలకు ఎంతటి నష్టమో అర్థం చేసుకోవచ్చు. ప్రఖ్యాత కంపెనీలకు సవాల్ విసురుతున్న డీప్ సీక్(Deep seak) వెనక ఉన్నది ఒక మహిళ అంటే ఆశ్చర్యం అనిపించక మానదు.డీప్ సీక్(Deep seak) పనితీరుతో టెక్ దిగ్గజాల ప్రశంసలను ఆమె అంటుకుంటున్నది.. డీప్ సీక్(Deep seak) ఆవిర్భావం వెనక “లువో పులి”(29) అనే మహిళ ఉంది. ఆమె చైనాలో ఏఐ జీనియస్ గా పేరు పొందారు. కృత్రిమ మేధ విభాగంలో(artificial intelligence department) ఆమె పరిశుద్ధ గ్రలిగా కొనసాగుతున్నారు. డీప్ సీక్(Deep seak) లో అత్యంత కీలకమైన నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ (NLP) లో ముఖ్య పాత్ర పోషించారు. లువో పులి బీజింగ్ యూనివర్సిటీలో చదువుకున్నారు. ఆ తర్వాత కంప్యూటర్ సైన్స్ లో చేరారు. ప్రారంభంలో ఇబ్బందులు ఎదురైనప్పటికీ.. చివర్లో విజయం సాధించారు. 2019లో ఏసీఎఎల్ లో 8 పరిశోధక పత్రాలను సమర్పించారు.
వారి దృష్టిలో పడ్డారు
ఈ పరిశోధక పత్రాలను సమర్పించిన తర్వాత లువో పులి ఆలీబాబా, షావోమీ వంటి టెక్నాలజీ దిగ్గజాల దృష్టిలో పడ్డారు. అయితే ఆ కంపెనీలలో ఆమె కొంతకాలం పనిచేశారు. ఆలీబాబా గ్రూపుకు చెందిన దామో అకాడమీలో పరిశోద ఎకరాలిగా ఆమె పని చేశారు. అక్కడ మల్టీ లింగ్వల్ ఫ్రీ ట్రైనింగ్ మోడల్ (VECO) అభివృద్ధికి నాయకత్వం వహించారు. ఓపెన్ సోర్స్ అలైస్మెండ్(open source Alice mind) లో కీలక పాత్ర పోషించారు. ఇక ఇదే సమయంలో 2022లో డీప్ సీక్(Deep seak) లో చేరారు. నాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ లో ఆమె నైపుణ్యం నేర్చుకున్నారు. ప్రస్తుతం ఆమె డీప్ సీక్(Deep seak)- వీ2 రూపకల్పనలో విజయవంతమయ్యారు. ప్రస్తుతం ఇది చాట్ జిపిటి, జెమిని వంటి వాటికి సవాల్ విసురుతోంది… మరోవైపు లువో పులి సామర్ధ్యాన్ని గుర్తించిన శావమి అధినేత లీ జున్.. సుమారు 11 కోట్ల ప్యాకేజీ ఆమెకు ఆఫర్ చేశాడు. దీనిపై చైనా మీడియా సంచలన కథనాలను ప్రసారం చేసింది. అయితే ఈ ప్యాకేజీని లువో పులి స్వీకరిస్తారా? లేదా? అనే విషయాలపై స్పష్టత ఇంకా రాలేదు.