Pushpa 2 Collection: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2 : ది రూల్’ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఏ స్థాయి సంచలనాలు సృష్టిస్తూ ముందుకు దూసుకుపోతుందో మనమంతా చూస్తూనే ఉన్నాం. కేవలం అల్లు అర్జున్ అభిమానులు మాత్రమే కాకుండా, ఇతర హీరోల అభిమానులు, తెలుగు సినిమాని ఇష్టపడే ప్రతీ ఒక్కరు కూడా ఈ చిత్రం సాధిస్తున్న రికార్డ్స్ పై గర్వం వ్యక్తం చేస్తున్నారు. టాలీవుడ్ లో కంటే బాలీవుడ్ లో ఈ చిత్రం అత్యధిక వసూళ్లను రాబడుతుంది. ఒక తెలుగు డబ్బింగ్ సినిమాకి హిందీ లో ఈ రేంజ్ వసూళ్లు భవిష్యత్తులో వస్తాయో లేదో చెప్పలేం. కానీ కచ్చితంగా ఇక మన టాలీవుడ్ సినిమాలు బాలీవుడ్ ని ఏలుతాయి అనే నమ్మకాన్ని మాత్రం ఇచ్చింది ఈ చిత్రం. ఆరు రోజుల్లో 1000 కోట్ల రూపాయలకు ఇంచు దూరంలో ‘పుష్ప 2’ చిత్రం ప్రాంతాల వారీగా 6వ రోజు ఎంత వసూళ్లను రాబట్టిందో ఒకసారి చూద్దాము.
సోమవారం రోజు ఈ చిత్రానికి దాదాపుగా 100 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చింది. ఇప్పటి వరకు బాహుబలి 2 కి తప్ప మరో ఇండియన్ సినిమాకి ఈ రేంజ్ వర్కింగ్ డే లో ఇంత వసూళ్లు రావడం మనం చూడలేదు. ఆరవ రోజు కూడా హిందీ వెర్షన్ వసూళ్లు ట్రేడ్ ని ఆశ్చర్యానికి గురి చేసింది. ఆరవ రోజు ఇండియా వైడ్ గా హిందీ వెర్షన్ వసూళ్లు 40 కోట్ల రూపాయలకు పైగా నెట్ వసూళ్లు వచ్చిందని ట్రేడ్ పండితులు చెప్తున్నారు. గ్రాస్ ని లెక్కగడితే 52 కోట్ల రూపాయలకు పైగా ఉంది. అదే విధంగా తెలుగు రాష్ట్రాల్లో 18 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు, 7 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయని తెలుస్తుంది. ఓవరాల్ గా హిందీ వెర్షన్, తెలుగు రాష్ట్రాల వసూళ్లను కలిపితే ఆరవ రోజు 70 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చినట్టు తెలుస్తుంది. ఇక కర్ణాటక, తమిళనాడు, కేరళ ప్రాంతాలకు కలిపి మరో 7 కోట్ల రూపాయిల రూపాయిల గ్రాస్ వచ్చిందట.
ఇండియా లో ఈ రేంజ్ ర్యాంపేజ్ చూపిస్తున్న ఈ సినిమా, ఓవర్సీస్ లో మాత్రం బాగా పడిపోయింది. వసూళ్లు బాగానే వస్తున్నాయి కానీ, ప్రభాస్ కల్కి రేంజ్ లో మాత్రం రావడం లేదు. ముఖ్యంగా నార్త్ అమెరికా లో తెలుగు వెర్షన్ వసూళ్లు దారుణంగా పడిపోయాయి. ఆరవ రోజు తెలుగు వెర్షన్ లో కేవలం 40 వేల డాలర్స్ మాత్రమే వచ్చాయట. కానీ హిందీ వెర్షన్ మాత్రం రెండు లక్షల డాలర్స్ కి పైగా వచ్చినట్టు తెలుస్తుంది. ఓవరాల్ గా ఆరవ రోజు ముగిసే సరికి నార్త్ అమెరికాలో ఆరు లక్షల డాలర్ల గ్రాస్ వసూళ్లు వచ్చింది. ఓవర్సీస్ మొత్తం కలిపి 8 లక్షల డాలర్లు ఉండొచ్చు. అంటే దాదాపుగా ఇండియన్ కరెన్సీ లో 6 కోట్ల రూపాయిల గ్రాస్ అన్నమాట. ఓవరాల్ గా ఆరవ రోజు 83 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చినట్టు సమాచారం.