చైనాకు షాక్ ట్రీట్మెంట్ మొదలెట్టిన భారత్..

భారత్-చైనా సరిహద్దుల్లో ఉద్రక్తత పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. జూన్ 15న భారత సరిహద్దుల్లోని గాల్వానా లోయ ప్రాంతంలో చైనా-భారత్ సైనికుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. చైనా దొంగదెబ్బతీయడంతో భారత్ జవాన్లు 20మంది వీరమరణం పొందారు. చైనా దాడిని భారత జవాన్లు సమర్ధవంతంగా తిప్పికొట్టారు. ఈ ఘర్షణలో చైనా సైనికులు 40మంది మృతిచెందినట్లు సమాచారం. సరిహద్దుల్లో భారత జవాన్లను చైనా సైన్యం దొంగదెబ్బతీయడంతో యావత్ భారత్ రగిలిపోయింది. వెగటు పుట్టిస్తున్న లోకేష్ కుల రాజకీయం అమరులైన వీరజవాన్ల మృతికి […]

Written By: Neelambaram, Updated On : June 25, 2020 4:31 pm
Follow us on


భారత్-చైనా సరిహద్దుల్లో ఉద్రక్తత పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. జూన్ 15న భారత సరిహద్దుల్లోని గాల్వానా లోయ ప్రాంతంలో చైనా-భారత్ సైనికుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. చైనా దొంగదెబ్బతీయడంతో భారత్ జవాన్లు 20మంది వీరమరణం పొందారు. చైనా దాడిని భారత జవాన్లు సమర్ధవంతంగా తిప్పికొట్టారు. ఈ ఘర్షణలో చైనా సైనికులు 40మంది మృతిచెందినట్లు సమాచారం. సరిహద్దుల్లో భారత జవాన్లను చైనా సైన్యం దొంగదెబ్బతీయడంతో యావత్ భారత్ రగిలిపోయింది.

వెగటు పుట్టిస్తున్న లోకేష్ కుల రాజకీయం

అమరులైన వీరజవాన్ల మృతికి వృథాకావొద్దని భారతీయులు పెద్దఎత్తున నినదించారు. ప్రజలు రోడ్లపైకి వచ్చి జవాన్లకు ఘనంగా నివాళర్పించి చైనా అధ్యక్షుడి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. చైనాను రక్షణపరంగా ఎదుర్కొవడంతోపాటు ఆర్థికంగా దెబ్బతీయాలని పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా చైనా వస్తువులను బహిష్కరించాలని భారతీయ నెటిజన్లు పెద్దఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం చేపట్టారు. దీనికి భారతీయులు నుంచి అనుహ్య స్పందన లభిస్తోంది.

కేసీఆర్ తో ప్రత్యక్ష యుద్ధానికి తమిళిసై రె’ఢీ’?

ఓవైపు శాంతి చర్చలు అంటూనే భారత జవాన్లపై దొంగదెబ్బ తీసిన చైనాకు గుణపాఠం చెప్పాలని కేంద్రం సైతం సిద్ధమైంది. ఈనేపథ్యంలోనే సరిహద్దుల్లో కమాండర్ స్థాయి అధికారులకు పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకునే అధికారం కల్పించింది. అంతేకాకుండా త్రివిధ దళాలను సిద్ధంగా ఉండాలని ఆదేశించింది. అయితే ఇటీవల చైనా-భారత్ ఆర్మీ అధికారుల చర్చల నేపథ్యంలో ఇరుదేశాల సైనికులు వెనక్కి వెళ్లేందుకు నిర్ణయానికొచ్చారు.

ఫెయిలైనా విద్యార్థులకు గుడ్ న్యూస్..!

మరోవైపు చైనాకు భారత్ షాకిచ్చిందుకు రెడీ అవుతోంది. ఇప్పటికే చైనా కంపెనీలకు చెందిన పలు కాంట్రాక్టులను కేంద్రం రద్దుచేసింది. చైనా నుంచి దిగుమతులను కట్టడి చేసేందుకు రెడీ అవుతోంది. కఠినమైన నాణ్యతా నిబంధనలు, అధిక టారిఫ్‌ల విధింపుతో చైనా వస్తు దిగుమతులను తగ్గించుకోవాలని కేంద్రం భావిస్తోంది. ఈమేరకు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్(బీఐఎస్) ఇప్పటికే 370 ప్రొడక్టులతో ఒక జాబితాను రూపొందించినట్లు సమాచారం. ఈ దిగుమతులపై కఠినమైన నాణ్యత ప్రమాణాలు నిర్దేశించడం ద్వారా వీటిని నిలువరించి చైనాకు షాకిచ్చేందుకు భారత్ రెడీ అవుతోంది.