Jabardasth Apparao: తెలుు బెల్లితెరపై నవ్వులు పూయించింది జబర్దస్త్. ప్రేక్షకులకు కనువిందు చేసే హాస్యాన్ని పండించడంలో మల్లెమాల ముందుంది. అందుకే జబర్దస్త్ అనే కార్యక్రమానికి రూపకల్పన చేసి కమెడియన్లకు జీవితాన్నిచ్చిన షో. అందుకే చాలా మంది ఆర్టిస్టులు కూడా జబర్దస్త్ షో ద్వారానే తమకు గుర్తింపు వచ్చిందని చెబుతారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారి అభిమాన కార్యక్రమం జబర్దస్త్ అనడంలో అతిశయోక్తి లేదు. అందుకే ప్రజల హృదయాలను కొల్లగొడుతూ నవ్వులు పూయిస్తూ అందరి చేత శభాష్ అనిపించుకుంటోంది. ప్రతి గురు, శుక్రవారాలు జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ గా ప్రేక్షకుల మందు హంగామా చేస్తోంది.

తెర ముందు కథ ఇదైనా తెర వెనుక కథ వేరే ఉంటుంది. జబర్దస్త్ ఆర్టిస్టుల్లో సైతం అసంతృప్తి జ్వాలలు చెలరేగుతున్నాయి. తమకు సరైన గుర్తింపు ఇవ్వడం లేదని కొందరంటుంటే మరికొందరు బయటకు వెళ్లి వేరే షోల్లో తమ సత్తా చాటుతున్నారు. ఇన్నాళ్లు తమకు లైఫ్ ఇచ్చినా కొన్ని కారణాల వల్ల సరైన గౌరవం ఇవ్వకుండా పొమ్మనలేక పొగపెడుతున్నారని వాపోతున్నారు. ఇదే కోవలో కమెడియన్ అప్పారావు ఓ యూట్యూబ్ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన మనోభావాలు వ్యక్తం చేశారు. జబర్దస్త్ కూడా వాడుకుని వదిలేసేదే అని వ్యాఖ్యానించడం గమనార్హం.
తనను మొదటిసారి జబర్దస్త్ షోకు పరిచయం చేసింది షకలక శంకర్. తరువాత చలాకీ చంటి టీంలో చేశాను. పిదప బుల్లెట్ భాస్కర్ టీంలో చేయమన్నారు. కానీ కరోనా సమయంలో కొంత కాలం దూరంగానే ఉన్నాను. మళ్లీ రాకింగ్ రాకేష్ టీంలో చేరుస్తామన చెప్పి నాతో ఆడుకున్నారు. అందుకే కోపం వచ్చి బయటకొచ్చేశా. కనీసం ఎందుకు వెళుతున్నావని కూడా అడగలేదు. జబర్దస్త్ యాజమాన్యం ఏమిటో కానీ కళాకారుల్లో మాత్రం ఈర్ష్య, ద్వేషాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు.

Also Read: CM Jagan Delhi Tour: మళ్లీ ఢిల్లీకి జగన్.. అసలు కథేంటి?
మల్లెమాల హాస్యానికి పెద్దపీట వేస్తుందని పలుమార్లు చెప్పినా కమెడియన్ల విషయంలో మాత్రం పట్టించుకోవడం లేదు. ఫలితంగా చాలా మంది షో నుంచి బయటకు వెళుతున్నారు. జడ్జి నాగబాబు మొదలు ఎందరో సీనియర్ ఆర్టిస్టులు ఈ షోను వీడి వేరే చానల్ లో మరో షోలో ప్రత్యక్షమవుతున్నారు. టీం లీడర్ల వేధింపులతోనే కమెడియన్లకు ఈ గతి పడుతున్నట్లు తెలుస్తోంది. కానీ యాజమాన్యం మాత్రం లెక్క చేయడం లేదు. ప్రస్తుతం జబర్దస్త్ సమయాన్ని సైతం కుదించారు. కామెడీ పండించాలని ఓ వైపు చెబుతూనే మరోవైపు ప్రక్షాళన చేస్తూ ఆర్టిస్టులకు అవకాశాలు ఇవ్వడం లేదనే వాదనలు కూడా వస్తున్నాయి.
ఎప్పుడు కొత్తవారితో షోలు చేస్తుండటంతో ప్రేక్షకులకు కూడా అయిష్టత కలుగుతోంది. గతంలో ఉన్న ఫాలోయింగ్ ఇప్పుడు కానరావడం లేదు. మొదట్లో ఈ షో చూసేందుకు జనం ఎంతో ఉత్సాహం చూపేవారు. కానీ ఈ మధ్య కామెడీ తగ్గిందనే వార్తలు వస్తున్నాయి. అందుకే జబర్దస్త్ షో చూసేందుకు అంతంతమాత్రంగానే ముందుకు వస్తున్నట్లు తెలుస్తోంది. యాజమాన్యం ఇలాగే చేస్తే భవిష్యత్ లో జబర్దస్త్ కు ఆదరణ మరింత తగ్గిపోయి కనుమరుగయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Also Read: Kamal Haasan: రెండున్నర దశాబ్దాలు… ఆ రేంజ్ హిట్ కమల్ కి పడలేదు!


