Devara: దెబ్బకు దిగొచ్చిన ‘దేవర’ టీం..చిరంజీవి ఫ్యాన్స్ కి క్షమాపణలు చెప్తూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి వార్నింగ్ !

ఎవరి పని వారు చేసుకుంటూ పోతే సక్సెస్ వస్తుంది అని, అది ముమ్మాటికీ నిజమే. దానికి ఉదాహరణ మా దేవర చిత్రం' అని అన్నాడు. ఇది మెగాస్టార్ చిరంజీవి ని ఉద్దేశించి అన్నాడు అనే విషయం చిన్న పిల్లవాడికి కూడా అర్థం అవుతుంది.

Written By: Vicky, Updated On : September 28, 2024 5:12 pm

Devara Movie

Follow us on

Devara: కొరటాల శివ దర్శకత్వం లో ఎన్టీఆర్ హీరో గా నటించిన ‘దేవర’ చిత్రం నిన్న విడుదలై యావరేజ్ టాక్ ని సొంతం చేసుకొని, బంపర్ ఓపెనింగ్ వసూళ్లను రాబట్టిన సంగతి అందరికీ తెలిసిందే. మేకర్స్ ఈ చిత్రానికి 172 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు మొదటి రోజు రాబట్టిందని పోస్టర్ ని విడుదల చేసారు, కానీ మార్కెట్ లెక్కల్లో ఈ సినిమాకి కేవలం 158 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు మాత్రమే వచ్చాయట. ఇంకా తక్కువగానే ఉండొచ్చని అంటున్నారు. నైజాం మరియు హిందీ వెర్షన్ వసూళ్లు నమ్మశక్యంగా లేవని ఇతర హీరోల అభిమానులు సోషల్ మీడియా లో కామెంట్ చేస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే నిన్న ఈ చిత్రానికి సంబంధించిన సక్సెస్ ప్రెస్ మీట్ ని మూవీ టీం సాయంత్రం ఏర్పాటు చేసింది. ఈ సక్సెస్ మీట్ లో ప్రముఖ పాటల రచయితా రామ జోగయ్య శాస్త్రి మాట్లాడుతూ ‘ఈ సినిమాకి ఇంతటి ఘన విజయాన్ని అందించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. కొరటాల శివ గారు మొన్న ఒక మాట చెప్పారు.

ఎవరి పని వారు చేసుకుంటూ పోతే సక్సెస్ వస్తుంది అని, అది ముమ్మాటికీ నిజమే. దానికి ఉదాహరణ మా దేవర చిత్రం’ అని అన్నాడు. ఇది మెగాస్టార్ చిరంజీవి ని ఉద్దేశించి అన్నాడు అనే విషయం చిన్న పిల్లవాడికి కూడా అర్థం అవుతుంది. ఎందుకంటే కొరటాల గత చిత్రం ‘ఆచార్య’ పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ కాబట్టి. ఈ సినిమా ఫ్లాప్ అవ్వడం తో ఒక వర్గపు మీడియా చిరంజీవి కథలో వేలు పెట్టడం వల్లే ఫ్లాప్ అయ్యిందని , రామ్ చరణ్ పాత్ర కోసం కథలో మార్పులు చేర్పులు చేయకపోయుంటే ఇలాంటి ఫలితం వచ్చేది కాదని బలంగా రుద్దేసింది. ఇది ఎంత వరకు నిజమో తెలియదు కానీ, కొరటాల శివ కూడా ఇటీవలే ఒక ఇంటర్వ్యూ లో రామ జోగయ్య శాస్త్రి మాట్లాడిన మాటలే మాట్లాడాడు.

ఆ తర్వాత మరో ఇంటర్వ్యూ లో ‘ఆచార్య ఫ్లాప్ అవ్వగానే నాకు మొట్టమొదట ఫోన్ చేసింది చిరంజీవి గారే. ఎం బాధపడకు శివ మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతావు. ఈసారి మామూలుగా కొట్టవు’ అని అన్నాడు అంటూ చెప్పుకొచ్చాడు కొరటాల శివ. కానీ పరోక్షంగా మాత్రం ఇలాంటి కామెంట్స్ ఎవరిని ఉద్దేశించి అన్నారు? అని సోషల్ మీడియా లో అభిమానులు నిలదీశారు. ఇక రామ జోగయ్య శాస్త్రి కి అయితే నిన్నటి నుండి ట్విట్టర్ లో మెగాస్టార్ చిరంజీవి అభిమానులు చుక్కలు చూపిస్తున్నారు. వాళ్ళు అడిగే మాటలకు సమాధానం చెప్పలేకపోతున్నారు. స్పందించకపోతే అభిమానులు బయట కూడా కొట్టేలా ఉన్నారనే భయం తో రామ జోగయ్య శాస్త్రి మాట్లాడుతూ ‘ఆ వ్యాఖ్యలు నేను ఎవరినీ ఉద్దేశించి చేసినవి కాదు. దయచేసి అభిమానులు వేరే అర్థాలు తీసుకొని వివాదాలు సృష్టించకండి’ అంటూ చెప్పుకొచ్చాడు. ఆయన ఎంత సర్దిచెప్పాలనుకున్నా అవి మెగాస్టార్ చిరంజీవి ని ఉద్దేశించి చేసిన కామెంట్స్ అని అభిమానులు బలంగా ఫిక్స్ అయ్యారు.