Balakrishna: నందమూరి తారకరామారావు నట వారసుడిగా బాలకృష్ణ పరిశ్రమలో అడుగుపెట్టాడు. తాతమ్మ కల ఆయన మొదటి చిత్రం. అప్పటికి బాలకృష్ణ పూర్తి స్థాయిలో హీరో కాలేదు. చెప్పాలంటే చైల్డ్ ఆర్టిస్ట్. గాడ్ ఫాదర్ ఉన్నప్పటికీ టాలెంట్ లేకపోతే పరిశ్రమలో నిలబడలేరు. ప్రేక్షకులు ఎక్కువ కాలం ఆదరించరు. బాలకృష్ణ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్, ఫేమ్ సంపాదించుకున్నాడు. తండ్రి ఎన్టీఆర్ వలె పలు జోనర్స్ లో నటించారు.
టాలీవుడ్ టాప్ స్టార్స్ లో బాలకృష్ణ ఒకరిగా ఎదిగారు. సుదీర్ఘ కెరీర్లో బాలకృష్ణ అనేక బ్లాక్ బస్టర్స్, ఇండస్ట్రీ హిట్స్ నమోదు చేశాడు. ఇప్పటికీ ఆయన మేనియా తగ్గలేదు. వంద కోట్ల వసూళ్లు ఈజీగా సాధిస్తున్నాయి ఆయన సినిమాలు. బాలకృష్ణ నటుడిగా మారి 50ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా స్వర్ణోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకకు చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరు కావడం విశేషం.
అయితే బాలకృష్ణ హీరో అవుతాడని నేను అసలు అనుకోలేదని ఆయన మిత్రుడు ఓ షోలో ఓపెన్ కామెంట్స్ చేశాడు. ఆయన ఎవరో కాదు. మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి. బాలకృష్ణ, కిరణ్ కుమార్ రెడ్డి హైదరాబాద్ లో చదువుకున్నారు. బాలకృష్ణ కిరణ్ కుమార్ రెడ్డికి సీనియర్ అట. అయినప్పటికీ వీరి మధ్య మంచి అనుబంధం ఉండేదట.
చదువుకునే రోజుల్లో బాలకృష్ణ చాలా సరదాగా ఉండేవాడట. జోక్స్ వేస్తూ అందరితో కలిసిపోయేవాడట. బాలకృష్ణ ఫిగర్, హైట్ చూసి నేను నటుడు అవుతాడని అసలు అనుకోలేదు. అంటే నటనను అంత సీరియస్ గా తీసుకుంటాడని, దానిపైనే దృష్టి పెడతాడని భావించలేదు, అని కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. బాలకృష్ణ హైట్ తక్కువే. సిమ్రన్ వంటి హీరోయిన్స్ తో ఆయన డాన్స్ చేసేటప్పుడు ఆ డిఫరెన్స్ స్పష్టంగా కనిపించేది.
అలాగే బాలకృష్ణ యంగ్ ఏజ్ లో బొద్దుగా ఉండేవాడు. బాలకృష్ణ ఫిజికల్ ఫీచర్స్ చూసి నటుడిగా ఫిట్ కాడేమో అని కిరణ్ కుమార్ రెడ్డి భావించారట. కట్ చేస్తే.. బాలకృష్ణ హీరోగా ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయ్యారు. కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ సీనియర్ లీడర్. 2010లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం అనంతరం కొణిజేటి రోశయ్య ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం కిరణ్ కుమార్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎం అయ్యారు.