Govindudu Andarivadele: మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా అడుగుపెట్టిన రామ్ చరణ్, రెండవ సినిమాతోనే సూపర్ స్టార్స్ లో ఒకడిగా నిల్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆయన చేసిన లవ్ స్టోరీ ‘ఆరంజ్’ చిత్రం పెద్ద ఫ్లాప్ అవ్వడం తో రామ్ చరణ్ అప్పటి నుండి మాస్ సినిమాలను మాత్రమే చేస్తూ వచ్చాడు. ‘రచ్చ’, ‘నాయక్’, ‘ఎవడు’ వంటి వరుస మాస్ సినిమాలతో అలరించిన ఆయన ఫ్యామిలీ ఆడియన్స్ కి దగ్గర అయ్యేందుకు కృష్ణ వంశీ తో కలిసి ‘గోవిందుడు అందరివాడేలే’ అనే చిత్రం చేసాడు. అప్పట్లో ఈ చిత్రానికి యావరేజ్ టాక్ వచ్చింది, కానీ కమెర్షియల్ గా 42 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను ఫుల్ రన్ లో రాబట్టి రామ్ చరణ్ కెరీర్ లో హిట్ గా నిల్చింది. ఇక ఈ చిత్రం లో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించగా, రామ్ చరణ్ చెల్లి పాత్రలో ఆయేషా కాదుస్కర్ అనే అమ్మాయి నటించింది.
చాలా క్యూట్ గా కనిపించిన ఈ అమ్మాయి మళ్ళీ భవిష్యత్తులో హీరోయిన్ అవుతుందని అందరూ అనుకున్నారు. చూసేందుకు అచ్చ తెలుగు అమ్మాయి లాగా అనిపిస్తుంది కానీ, ఈమె తెలుగు అమ్మాయి కాదు. ముంబై ప్రాంతానికి చెందిన అమ్మాయి. 2012 వ సంవత్సరం లో హృతిక్ రోషన్ హీరో గా నటించిన ‘అగ్నిపధ్’ చిత్రం లో ఈ అమ్మాయి ఒక కీలక పాత్రలో నటించి మంచి గుర్తింపు పొందింది. ఆ తర్వాత ఈమె 2014 వ సంవత్సరం లో ‘గోవిందుడు అందరి వాడేలే’ చిత్రం లో కనిపించింది. ఈ చిత్రం తర్వాత మళ్ళీ ఈ అమ్మాయి ఎలాంటి తెలుగు సినిమాలో కనిపించలేదు కానీ బాలీవుడ్ లో మాత్రం రెగ్యులర్ గా సినిమాలు చేస్తూనే ఉంది. గత ఏడాది ఈమె ఆయుష్మాన్ ఖురానా హీరో గా నటించిన ‘డాక్టర్ జీ’ అనే చిత్రం లో ఒక కీలక పాత్ర పోషించింది. ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించింది. అంతే కాదు, ఈ అమ్మాయి సోషల్ మీడియా లో కూడా చాలా యాక్టీవ్ గా ఉంటుంది.
ఇంస్టాగ్రామ్ లో ఈమెకు ఉన్నటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుది కాదు. కుర్రాళ్ళు హీటెక్కిపోయే రేంజ్ ఫోటోలను, వీడియోలను ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తూ ఉంటుంది ఈ బ్యూటీ. రీసెంట్ గా ఈ అమ్మాయి అప్లోడ్ చేసిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారింది. స్లీవ్ లెస్ జాకెట్ తో ఎరుపు రంగు చీరలో ఈమె కనిపించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ‘మా అమ్మ 30 ఏళ్ళ వయస్సులో ఉన్నప్పటి చీరను నేను కట్టుకున్నాను. నేను కూడా ఆమె లాగానే ఉన్నాను’ అంటూ చెప్పుకొచ్చింది అయేషా. ప్రస్తుతం ఈమె బాలీవుడ్ తో పాటు, కోలీవుడ్ లో కూడా పలు చిత్రాలు చేసేందుకు సంతకం చేసింది. మరి టాలీవుడ్ లోకి ఈ బ్యూటీ ఎప్పుడు రీ ఎంట్రీ ఇస్తుందో చూడాలి.