Pawan Kalyan: ఆంధ్ర ప్రదేశ్ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన పవన్ కళ్యాణ్, ఎన్నికల సమయంలో తాను ఇచ్చిన హామీలను ఎలా నెరవేరుస్తూ ముందుకెళ్తున్నాడో మనమంతా చూస్తూనే ఉన్నాం. ప్రతీ అంశంలోనూ రాజకీయ లబ్దిని కోరుకునే నాయకులు ఉన్న ఈ రోజుల్లో, తన రాజకీయ లబ్ది కోసం కాకుండా కేవలం జనాలకు ఉపయోగపడే కార్యక్రమాలను చేస్తూ పవన్ కళ్యాణ్ ఈ ఆరు నెలల్లో సంపాదించిన క్రేజ్ మరో రాజకీయ నాయకుడు సంపాదించలేదు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ‘గ్రామసభలు’ ఏర్పాటు చేసి, రాష్ట్రంలో ఉన్న ప్రతీ పల్లెలోని సమస్యలను గుర్తించి, పల్లె పండుగ పేరుతో ప్రతీ గ్రామంలోను సీసీ రోడ్లు, బీటీ రోడ్లు , గోకులాలు నిర్మించాడు. వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్ళల్లో చేయలేని పనులను కేవలం ఆరు నెలల్లో చేసి చూపించి, నిజమైన చిత్తశుద్ధి ఉంటే ఎలాంటి అద్భుతాలు చేయొచ్చో నిరూపించి చూపించాడు.
ఇక తన సొంత నియోజకవర్గం లో పవన్ కళ్యాణ్ ఇచ్చిన ప్రతీ హామీని నెరవేరుస్తూ ముందుకు దూసుకుపోతున్నాడు. పిఠాపురం ని మోడల్ నియోజకవర్గం గా తీర్చి దిద్దుతానని మాట ఇచ్చిన ఆయన, ఆ దిశగా అడుగులు వేస్తున్నాడు. పిఠాపురంలో వంద పడకల హాస్పిటల్ కి నిధులు మంజూరు చేయించిన పవన్ కళ్యాణ్, మరో బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. ఎన్నికల ప్రచారం సమయంలో ఆయన ఇక్కడ అపోలో హాస్పిటల్స్ సేవలు జనాలకు అందేలా చేస్తానని మాట ఇచ్చాడు. నేడు అపోలో హాస్పిటల్స్ ఫౌండర్ డాక్టర్ ప్రతాప్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా, పిఠాపురం అపోలో హాస్పిటల్స్ ద్వారా ఒక ఫౌండేషన్ ని ఏర్పాటు చేసింది ఉపాసన కొణిదెల. ఈ సందర్భంగా ఒక అంగనవాడి మోడల్ ని లాంచ్ చేసారు. దీని ద్వారా హెల్త్ కేర్, న్యూట్రిషన్ సమస్యలతో పాటు, గర్భిణీ స్త్రీ సంరక్షణ వంటి ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు చేపడుతున్నారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ కార్యక్రమాన్ని చేయాలని సంకల్పించిన ఉపాసన, ముందుగా పిఠాపురం నుండి ఈ పైలట్ ప్రాజెక్ట్ ని మొదలు పెట్టింది. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నామో, పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి మా ఊరికి ఎమ్మెల్యే అయ్యాడంటూ పిఠాపురం ప్రజలు పొగడ్తలతో ముంచి ఎత్తుతున్నారు. అంతే కాదు త్వరలోనే పిఠాపురం లో ఫ్లై ఓవర్ బ్రిడ్జి పనులు కూడా ప్రారంభం కాబోతున్నాయి. రైల్వే గేట్ వద్ద విపరీతమైన ట్రాఫిక్ తో పిఠాపురం ప్రజలు ఎన్నో ఏళ్ళ నుండి తీవ్రమైన కష్టాలను ఎదురుకుంటూన్నారు. వాళ్ళ కష్టాలకు శాశ్వత పరిష్కారం చూపించబోతున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. ఆరు నెలల్లో పిఠాపురం రూపురేఖలు మారిపోయాయి. భవిష్యత్తులో ఏ రేంజ్ కి వెళ్తుందో చూడాలి. వచ్చే నెలలో పవన్ కళ్యాణ్ మరోసారి పిఠాపురం లో పర్యటించి అభివృద్ధి కార్యక్రమాలని పరిశీలించబోతున్నాడు.