https://oktelugu.com/

Sai Dharma Tej Health Condition: 48 గంటల టైం.. సాయిధరమ్ తేజ్ ఆరోగ్యంపై పై అపోలో ఆస్పత్రి సంచలన ప్రకటన

Sai Dharma Tej Health Condition: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు, హీరో సాయిధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితిపై అపోలో ఆస్పత్రి హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. నిన్న రాత్రి బైక్ రైడింగ్ అంటే ఆసక్తి చూపించే సాయిధరమ్ తేజ్ స్పోర్టస్ బైక్ నడుపుతూ మాదాపూర్ తీగల వంతెనపైనుంచి వెళుతుండగా ఒక్కసారిగా బైక్ అదుపుతప్పి కిందపడిపోయాడు. ప్రమాదంలో ఆయన కుడికంటిపై భాగంతోపాటు ఛాతి భాగంలో ఎముకలు విరిగి తీవ్రగాయాలయ్యాయి. ప్రస్తుతం అపోలో ఆస్పత్రిలో […]

Written By: , Updated On : September 11, 2021 / 09:00 AM IST
Follow us on

Sai Dharma Tej Health Condition

Sai Dharma Tej Health Condition: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు, హీరో సాయిధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితిపై అపోలో ఆస్పత్రి హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. నిన్న రాత్రి బైక్ రైడింగ్ అంటే ఆసక్తి చూపించే సాయిధరమ్ తేజ్ స్పోర్టస్ బైక్ నడుపుతూ మాదాపూర్ తీగల వంతెనపైనుంచి వెళుతుండగా ఒక్కసారిగా బైక్ అదుపుతప్పి కిందపడిపోయాడు. ప్రమాదంలో ఆయన కుడికంటిపై భాగంతోపాటు ఛాతి భాగంలో ఎముకలు విరిగి తీవ్రగాయాలయ్యాయి.

ప్రస్తుతం అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సాయిధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని కాలర్ బోన్ విరిగిందని శరీరంలోని అంతర్గతంగా గాయలేవీ లేవని ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు.

సాయిధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన చెందాల్సిన పనిలేదని ప్రస్తుతం వెంటిలేటర్ పై చికిత్స కొనసాగుతోందని అపోలో ఆస్పత్రి వైద్యులు తెలిపారు. మరో 48 గంటల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉండాలని వివరించారు.

ప్రమాద సమాచారం తెలుసుకున్న జనసేన అధినేత,ప్రముఖ నటుడు పవన్ కళ్యాణ్, సినీ దర్శకుడు త్రివిక్రమ్, అల్లు అరవింద్, సందీప్ కిషన్ తదితరులు ఆస్పత్రికి తరలివచ్చారు. వైద్యులతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం అపోలో ఆస్పత్రికి తరలించారు.

ప్రమాదంలో గాయపడిన సాయిధరమ్ తేజ్ క్రమంగా కోలుకుంటున్నారని సినీ నిర్మాత అల్లు అరవింద్ తెలిపారు. సాయితేజ్ కు స్వల్ప గాయాలయ్యాయని.. ఆరోగ్యం గురించి అభిమానులు ఆందోళన చెందాల్సిన పనిలేదని మెగాస్టార్ చిరంజీవి తెలిపారు.