Anvesh : ఇప్పుడు తాజాగా ప్రముఖ సినీ నటుడు, కరోనా సమయంలో సామాజిక సేవ చేసి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు సాధించిన సోనూ సూద్(Sonu Sood) పై నా అన్వేషణ అన్వేష్ బాంబు పేల్చాడు. సోనూ సూద్ కరోనా సమయంలో సేవా కార్యక్రమాల ద్వారా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు సాధించారు. కొన్ని లక్షల మందికి ఇతర ప్రాంతాలకు వెళ్లడానికి ఆర్థిక సహాయం చేశారు. రవాణా సదుపాయం కూడా కల్పించారు. కొంతమందికయితే అత్యంత ఖరీదైన ఔషధాలు కూడా అందించారు. అప్పట్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన దానికంటే సోనూ సూద్ ఎక్కువ చేశారు. అందువల్లే సోషల్ మీడియాలో, మీడియాలో సోనూ సూద్ ప్రముఖంగా కనిపించారు. సోషల్ మీడియాలో అయితే సోనూ సూద్ ట్రెండింగ్ పర్సనాలిటీ గా నిలిచారు. సోనూసూద్ ను దానవీర కర్ణుడిగా.. భారతదేశ ప్రజలను కరోనా బారి నుంచి కాపాడేందుకు దేవుడిగా చాలామంది అభివర్ణించారు. సోనూ సూద్ అంతటితో ఆగకుండా ఆక్సిజన్ సిలిండర్లు కూడా సరఫరా చేశారు.. ఆపద ఉందని మెసేజ్ చేయడమే ఆలస్యం.. సోనూ సూద్ కార్యాలయ ప్రతినిధులు వెంటనే లైన్ లోకి వచ్చేవారు. కావలసిన సాయాన్ని వెంటనే చేసేవారు.. అందువల్లే సోనూ సూద్ ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందారు. కొన్ని దేశాలైతే అతడికి అనేక పురస్కారాలు అందించాయి.
Also Read : ఆ యాంకర్ జల్సాలు చేస్తుంది.. యూట్యూబర్ అన్వేష్ మరొక సంచలనం!
అందువల్లేనట
సోనూ సూద్ ఇంతటి పేరు తెచ్చుకోవడానికి ప్రధాన కారణం బెట్టింగ్ యాప్స్ నిర్వహించడమే నట. ఇదే విషయాన్ని నా అన్వేషణ అన్వేష్ వెల్లడించాడు..” పేద కుటుంబంలో పుట్టిన సోనుసూద్ విపరీతంగా కష్టపడ్డాడు. సినిమాల్లో గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ అతడే హీరోగా సినిమాలో నటించాలని బలమైన కోరిక ఉండేది. అందువల్లే అతడు డబ్బు కోసం బెట్టింగ్ యాప్స్ వైపు వెళ్లాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 1000 కోట్లు సంపాదించాడు. అతడు సంపాదించిన సంపాదన మీద ఈడీకేసులు నమోదయ్యాయి. వాటికి సంబంధించిన దర్యాప్తు కూడా కొనసాగుతోంది. అయితే సోనూసూద్ బెట్టింగ్ యాప్స్ కు సంబంధించి మనదేశంలో డైనోసార్.. హర్ష సాయి ఇలాంటి వాళ్ళు మొసళ్ళు మాత్రమే. తెలుగు రాష్ట్రాల్లో హర్ష సాయి కూడా ఇలాంటి వ్యవహారమే నడిపాడు. అతడి ఆధ్వర్యంలో కొంతమంది ఇతర దేశాలకు వెళ్లి అక్కడి నుంచి బెట్టింగ్ కార్యకలాపాలు సాగిస్తున్నారు. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని” నా అన్వేషణ అన్వేష్ తన యూట్యూబ్ ఛానల్ లో విడుదల చేసిన వీడియోలో ప్రస్తావించాడు. మరి దీనిపై సోనూసూద్, అతడి అభిమానులు ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.
Also Read : ఆలీ దంపతులు మోసం చేశారు, బెట్టింగ్ యాప్స్ వివాదంలో స్టార్ కమెడియన్… యూట్యూబర్ అన్వేష్ సెన్సేషనల్ కామెంట్స్
https://www.youtube.com/watch?v=pg44WHcCh_s&ab_channel=PrapanchaYatrikudu