Pradeep Machiraju : బుల్లితెర పై యాంకర్ గా రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకుల అశేష ఆదరాభిమానాలు సొంతం చేసుకున్న ప్రదీప్(Pradeep Machiraju) గత కొంతకాలంగా బుల్లితెర లో ఎలాంటి ఎంటర్టైన్మెంట్ షోస్ లో కనిపించకపోవడంతో ప్రేక్షకులు అసలు ప్రదీప్ ఏమైపోయాడు అంటూ ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఆయన కేవలం ఒక సినిమా కోసం మాత్రమే షోస్ కి బ్రేక్ ఇచ్చాడని, ఆ సినిమా తర్వాత మళ్ళీ బుల్లితెర పై ప్రత్యక్షం అవుతానని చెప్పుకొచ్చాడు ప్రదీప్. ఆయన బుల్లితెర కి బ్రేక్ ఇచ్చింది ‘అక్కడ అమ్మాయి..ఇక్కడ అబ్బాయి'(Akkada Ammayi..Ikkada Abbayi) చిత్రం కోసమే. మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ప్రొమోషన్స్ లో ఫుల్ బిజీ గా ఉన్నాడు ప్రదీప్. అందులో భాగంగా ప్రతీ ఆదివారం రాత్రి 7 గంటలకు ఈటీవీ ఛానల్ లో ప్రసారమయ్యే ‘ఫ్యామిలీ స్టార్స్'(Family Stars) ప్రోగ్రాం లో హీరోయిన్ దీపికా పిల్లి తో కలిసి పాల్గొన్నాడు.
Also Read : సోనూ సూద్ పై 1000 కోట్ల బాంబ్ వేసిన అన్వేష్
‘ఫ్యామిలీ స్టార్స్’ ప్రోగ్రాం కి యాంకర్ గా సుడిగాలి సుధీర్(Sudigaali Sudheer) వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. బుల్లితెర పై సుధీర్, ప్రదీప్ కాంబినేషన్ ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆరోజుల్లో వీళ్లిద్దరు ఢీ షోలో కలిసి పండించిన కామెడీ ని అంత తేలికగా ఎవరైనా మర్చిపోగలరా..?, ఇప్పటికీ యూట్యూబ్ లో వీళ్లిద్దరి వీడియోస్ ని చూస్తూనే ఉంటారు. వీళ్ళ కాంబినేషన్ మిస్ అయ్యిందని అభిమానులు చాలా బాధపడ్డారు. మళ్ళీ ఇన్నాళ్లకు వీళ్ళ కాంబినేషన్ ‘ఫ్యామిలీ స్టార్స్’ ప్రోగ్రాం ద్వారా రిపీట్ అవ్వడంతో అభిమానులు సంతోషిస్తున్నారు. ఈ ప్రోగ్రాం లో వీళ్లిద్దరు కలిసి డ్యాన్స్ వేశారు, కామెడీ చేశారు, వింటేజ్ వైబ్స్ మొత్తాన్ని తీసుకొచ్చారు. ఈ ప్రోగ్రాం కి సంబంధించిన ప్రోమో కాసేపటి క్రితమే విడుదలై బాగా వైరల్ అయ్యింది. ఇదంతా పక్కన పెడితే ఈ ప్రోమో లో యాంకర్ ప్రదీప్ హీరోయిన్ దీపికా పిల్లి(Deepika Pilli) కి లవ్ ప్రొపోజ్ చేయడం హైలైట్ గా నిల్చింది.
ప్రదీప్ ప్రపోజ్ చేయగానే దీపికా చాలా సిగ్గు పడిపోయింది. ఆమె తీరు ని చూస్తే కేవలం స్కిట్ కోసం సిగ్గు పడుతున్నట్టుగా అనిపించలేదు. నిజంగానే ఆమె సిగ్గు పడింది. చూస్తుంటే షూటింగ్ సమయంలో వీళ్ళిద్దరూ ప్రేమలో పడిపోయారా? అనే అనుమానాలు అభిమానుల్లో వ్యక్తం అవుతున్నాయి. దీపికా పిల్లి విజయవాడ ప్రాంతానికి చెందిన అమ్మాయి. ఈమె ఢీ షో లో ప్రదీప్, సుధీర్, రష్మీ, హైపర్ ఆది తో కలిసి కామెడీ స్కిట్స్ చేసిన అమ్మాయే. ఈ షో ద్వారా పాపులారిటీ ని తెచ్చుకొని, ప్రదీప్ తో మంచి బాండింగ్ ఏర్పడడం వల్ల, ఈమెని తన సినిమాలో హీరోయిన్ గా ఏరికోరి ప్రదీప్ ఎంచుకున్నాడనే ఒక టాక్ కూడా నడుస్తుంది. ఇన్ని రోజలు వీళ్ళు కేవలం ఒక సినిమా కోసం కలిసి పని చేశారు అని మాత్రమే అనుకున్నారు కానీ, ఈరోజు విడుదలైన ప్రోమో ని చూసిన తర్వాత కచ్చితంగా వీళ్ళ మధ్య ఎదో నడుస్తుంది అని అనుమానంగా ఉందంటూ సోషల్ మీడియా లో ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.