PF Rules : ప్రైవేట్ ఉద్యోగాలు చేసేవారు తరచుగా తమ ఉద్యోగాలను మారుతుంటారు. ఇలా మారిన ప్రతిసారి వారి కొత్త కంపెనీ ఒక కొత్త EPF (ఉద్యోగుల భవిష్య నిధి) ఖాతాను ఓపెన్ చేస్తుంది. అయితే, UAN (యూనివర్సల్ అకౌంట్ నంబర్) మాత్రం పాతదే ఉంటుంది. చాలా మంది ఉద్యోగులకు ఒక డౌట్ ఉంటుంది. UAN పాతదే కదా, మరి ఆ UAN నంబర్‌తో నడిచే వారి EPF ఖాతా కూడా ఒకటేనా అని. కాకపోతే అది నిజం కాదు.
మీరు కొత్త ఉద్యోగంలో చేరినప్పుడు మీ UAN నంబర్‌ను కంపెనీకి ఇస్తారు. ఆ UAN నంబర్ కింద కంపెనీ మీ కోసం మరొక PF ఖాతాను తెరుస్తుంది. అప్పటి నుండి మీ, కొత్త కంపెనీ PF డబ్బులు ఆ కొత్త ఖాతాలో జమ కావడం మొదలవుతుంది. ఇక్కడ మీరు తప్పనిసరిగా చేయవలసిన పని ఏమిటంటే, కొత్త PF ఖాతా తెరిచిన తర్వాత మీ పాత ఖాతాను కొత్త దానితో కలపడం (Merge) చేయడం. ఈ పనిని మీరు EPFO (ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ) వెబ్‌సైట్‌కి వెళ్లి సులభంగా పూర్తి చేయవచ్చు. ఒకవేళ మీరు ఇంకా ఈ పని చేయకపోతే, భవిష్యత్తులో అనేక పెద్ద నష్టాలను ఎదుర్కోవలసి రావచ్చు.
Also Read : ఆర్‌బీఐ నుంచి కొత్త అప్‌డేట్.. రూ.500, రూ.10 కొత్త నోట్లు.. మరి పాతవి?
ఖాతాను మెర్జ్ చేయడం ఎలా
* ముందుగా మీరు EPFO మెంబర్ సేవా పోర్టల్ https://unifiedportal-mem.epfindia.gov.in కి వెళ్లాలి.
* ఆ తర్వాత Online Services విభాగంలో ‘One Member – One EPF Account- Transfer Request’ ఆఫ్షన్ ను ఎంచుకోవాలి.
* తర్వాత మీ వ్యక్తిగత వివరాలు, ప్రస్తుత కంపెనీ ఖాతాను ధృవీకరించాలి.
* ఆ తర్వాత ‘Get Details’ పై క్లిక్ చేయాలి. అప్పుడు మీ ముందు పాత యజమానుల జాబితా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఏ ఖాతాను బదిలీ చేయాలనుకుంటున్నారో దానిపై క్లిక్ చేయండి.
* తర్వాత ‘Get OTP’ పై క్లిక్ చేయండి. మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది. దానిని నమోదు చేసి ‘Submit’ చేయండి.
* దీంతో మీ రిక్వెస్ట్ సమర్పించబడుతుంది. మీ ప్రస్తుత కంపెనీ దీనిని ఆమోదించాల్సి ఉంటుంది.
* ఆ తర్వాత EPFO మీ పాత ఖాతాను కొత్త ఖాతాతో కలుపుతుంది. కొంత సమయం తర్వాత మీరు మీ మెర్జ్ స్టేటస్‌ను చెక్ చేసుకోవచ్చు.
ఖాతాను కలపకపోతే జరిగే నష్టాలు
ఖాతాను కలపకపోవడం వల్ల వచ్చే మొదటి నష్టం ఏమిటంటే, కొత్త EPF ఖాతా తెరవడం వల్ల మీ పాత ఖాతాలో ఉన్న డబ్బు మీకు ఒకేసారి కనిపించదు. అంతేకాకుండా, పన్ను ఆదా పరంగా కూడా వీటిని కలపడం చాలా ముఖ్యం. మీరు ఏదైనా EPF ఖాతా నుంచ డబ్బు విత్‌డ్రా చేసేటప్పుడు ఐదు సంవత్సరాల పరిమితిని చూస్తారు. ఐదు సంవత్సరాల పాటు డబ్బులు జమ చేసిన తర్వాత విత్‌డ్రా చేస్తే టాక్స్ ఉండదు. ఖాతాలు కలపకపోతే ఈ సమయం వేర్వేరుగా లెక్కించబడుతుంది. దీనివల్ల మీరు పన్ను ప్రయోజనాలు కోల్పోయే అవకాశం ఉంది. కాబట్టి, జాబ్ మారిన వెంటనే మీ పాత PF ఖాతాను కొత్త దానితో కలపడం చాలా ముఖ్యం.
Also Read : బ్యాంకు డబ్బులు ఆలస్యమైతే మీకు పెనాల్టీ వస్తుంది.. ఎలాగంటే?