Anushka Shetty: స్వీటీ అనుష్క శెట్టి గురించి చాలా గ్యాప్ తర్వాత మరో వార్త వినిపిస్తోంది. అనుష్క మళ్లీ వేశ్యగా మారబోతుంది. గతంలో వేదం సినిమాలో వేశ్య సరోజా పాత్రకు ప్రాణం పోసిన ఈ భారీ స్వీటీ.. మళ్ళీ అలాంటి పాత్రలోనే మెరుపులు మెరిపించబోతుంది. నటన ప్రాధాన్యమున్న పాత్రలనే ఎంచుకోవాలని నిర్ణయించుకున్న అనుష్కకి, క్రిష్ ఒక వేశ్య కథను వినిపించాడు. కాకపోతే ఇది సినిమా కాదు, వెబ్ సిరీస్.

కన్యాశుల్కం అనే పేరుతో ఈ సిరీస్ రాబోతుంది. గురజాడ అప్పారావు రచించిన కన్యాశుల్కం నాటకం ఆధారంగా క్రిష్ ఈ వెబ్ సిరీస్ కథను సిద్ధం చేశాడు. ఈ సిరీస్ లో ‘మధురవాణి’ అనే వేశ్య పాత్రలో అనుష్క నటించబోతుంది. ఇప్పటివరకు అనుష్క చేసిన పాత్రల కంటే ఈ ‘మధురవాణి’ పాత్ర ఛాలెంజింగ్ గా చాలా వైవిధ్యంగా ఉంటుందట.
Also Read: Pakka Commercial 4 Days Collections: ‘పక్కా కమర్షియల్’ బాక్సాఫీస్ పరిస్థితి ఇదే
నిజానికి ఈ పాత్రలో అనసూయ నటిస్తోంది అన్నారు. అయితే, అనుష్కతో క్రిష్ గతంలో కలిసి పని చేసి ఉండటం, క్రిష్ రైటింగ్ పై అనుష్కకి పూర్తి నమ్మకం ఉండటంతో అనుష్క ఈ ‘కన్యాశుల్కం’కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ వెబ్ సిరీస్ తెలుగుతో పాటు తమిళ, మలయాళంలో కూడా రిలీజ్ కానుంది. అందుకే.. అనుష్క అయితే మార్కెటింగ్ కి సులభంగా ఉంటుందని.. మేకర్స్ ను ఆమెను ఈ సిరీస్ లో నటించడానికి ఒప్పించారు.
పైగా అనుష్కకి వేశ్య పాత్రలో నటించడం అంటే ఇష్టమట. ఆ పాత్రల్లో నటనకు ఎంతో స్కోప్ ఉంటుందని అనుష్క నమ్ముతుంది. ఇక అనుష్క ఇండస్ట్రీకి వచ్చి దగ్గర దగ్గరగా రెండు దశాబ్దాలు అవుతుంది. అయినా, ఇప్పటికీ అనుష్కకి ఫుల్ క్రేజ్ ఉంది. హీరోయిన్ గా కూడా ఫుల్ ఫామ్ లో ఉన్నా.. సినిమాలను మాత్రం ఎక్కువ అంగీకరించట్లేదు.

ఎలాగూ యంగ్ బ్యూటీస్ రష్మిక, పూజా హెగ్డే, కీర్తి సురేష్, కృతి శెట్టి, కేతిక శర్మ లాంటి కొత్త భామలు వరుస అవకాశాలతో రెచ్చిపోతున్న క్రమంలో అనుష్క సినిమాలను తగ్గించింది. మరోపక్క అనుష్కతో పాటు హీరోయిన్ గా వచ్చిన శ్రీయా, కాజల్ లాంటి హీరోయిన్లు ఆల్ రెడీ పెళ్లి చేసుకుని.. పిల్లల ప్రోగ్రామ్ కూడా పెట్టుకున్నారు.
కానీ, అనుష్క మాత్రం ఇంకా మేకప్ పూసుకుంటూ.. తనకు సినిమాలే సరదా అంటూ కాలక్షేపం చేస్తోంది. ‘కక్కు వచ్చినా కళ్యాణం వచ్చినా ఆగదంటారు, కానీ అనుష్కకు మాత్రం ఆ కళ్యాణ ఘడియలు రావడం లేదు.
Also Read:Sammathame 12 Days Collections: ‘సమ్మతమే’ కి ప్రేక్షకుల నుంచి ‘అసమ్మతి’

[…] […]