Pakka Commercial 4 Days Collections: హీరో గోపీచంద్ – మారుతి కలయికలో వచ్చిన “పక్కా కమర్షియల్” సినిమా పరిస్థితి ఏమిటి ?, ఈ సినిమా ప్రేక్షకులను ఏ రేంజ్ లో ఆకట్టుకుంది ?, ఇంతకీ.. ఈ సినిమాకి థియేటర్స్ వద్ద అసలు గిట్టుబాటు అయ్యిందా ? లేదా ?, ఈ సినిమా నిర్మాత బన్నీ వాసుకు లాభాలు వచ్చాయా ? లేక, నష్టాలే మిగిలాయా ? చూద్దాం రండి. ముందుగా ఈ సినిమా మొదటి 4 డేస్ కలెక్షన్స్ ఏరియాల వారీగా ఎలా ఉన్నాయో చూద్దాం.

4 డేస్ కలెక్షన్స్’ కు గానూ “పక్కా కమర్షియల్” చిత్రం ఎంతవరకు కలెక్ట్ చేసింది అంటే..
Also Read: Chiranjeevi changed His Name: షాకింగ్.. తన పేరు ని మార్చుకున్న మెగాస్టార్ చిరంజీవి
నైజాం 1.95 కోట్లు
సీడెడ్ 1.00 కోట్లు
ఉత్తరాంధ్ర 1.01 కోట్లు
ఈస్ట్ 0.57 కోట్లు
వెస్ట్ 0.45 కోట్లు
గుంటూరు 0.51 కోట్లు
కృష్ణా 0.48 కోట్లు
నెల్లూరు 0.33 కోట్లు
ఏపీ + తెలంగాణలో మొత్తం కలుపుకొని 4 డేస్ కలెక్షన్స్’ కు గానూ “పక్కా కమర్షియల్” 6.30 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. గ్రాస్ పరంగా చూసుకుంటే.. 12.54 కోట్లు వచ్చాయి.
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.30 కోట్లు
ఓవర్సీస్ 0.75 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ గా 4 డేస్ కలెక్షన్స్’ కు గానూ “పక్కా కమర్షియల్” రూ. 7.35 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసింది. ఇక గ్రాస్ పరంగా చూసుకుంటే వరల్డ్ వైడ్ గా రూ. 14:66 కోట్లను కొల్లగొట్టింది
బాక్సాఫీస్ వద్ద ఈ ‘పక్కా కమర్షియల్’ సినిమాకి రూ.17.5 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. మిగిలిన కొన్ని ఏరియాల్లో ‘గీతా ఆర్ట్స్’ మరియు ‘యూవీ క్రియేషన్స్’ సంస్థలే ఓన్ గా రిలీజ్ చేసుకున్నాయి. కాబట్టి, ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ.15 కోట్లు. ఐతే, 4 డేస్ పూర్తయ్యేసరికి ఈ “పక్కా కమర్షియల్” రూ. 7.35 కోట్ల షేర్ ను మాత్రమే కలెక్ట్ చేసింది.

ఇక రాశీ ఖన్నా హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో సత్యరాజ్, సప్తగిరి, రావు రమేష్, వరలక్ష్మీ శరత్ కుమార్, చిత్ర శుక్ల మొదలైన వారు కీలక పాత్రల్లో నటించారు. భారీ తారాగణం ఉన్నపటికీ కథాకథనాల్లో మ్యాటర్ లేకపోవడంతో ఈ సినిమాకి ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ రావడం లేదు. మొత్తమ్మీద ఈ సినిమాకి నష్టాలు తప్పేలా లేవు.
Also Read:Nayantara House: నయనతార కొన్న ఇంటి ఖరీదు ఎంతో తెలుసా?
[…] […]