Homeఎంటర్టైన్మెంట్Pradeep Ranganathan LIK Trailer Review: ప్రదీప్ రంగనాథన్ 'LIK' ట్రైలర్ రివ్యూ : యాప్...

Pradeep Ranganathan LIK Trailer Review: ప్రదీప్ రంగనాథన్ ‘LIK’ ట్రైలర్ రివ్యూ : యాప్ తెచ్చే కష్టాలు.. కాన్సెప్ట్ అదిరిపోయింది..

Pradeep Ranganathan LIK Trailer Review: ‘లవ్ టుడే’, ‘డ్రాగన్’, ‘డ్యూడ్’ వంటి వరుస హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్స్ తో అటు తమిళంలో , ఇటు తెలుగు లో జెన్ జీ యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ని సంపాదించుకున్న ప్రదీప్ రంగనాథన్(Pradeep Ranganathan) లేటెస్ట్ చిత్రం ‘LIK : లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ'(LIK Movie) చిత్రం ఈ నెల 10 న ప్రపంచవ్యాప్తంగా తెలుగు , తమిళ భాషల్లో గ్రాండ్ రిలీజ్ కానుంది. ఎప్పుడో […]

Pradeep Ranganathan LIK Trailer Review: ‘లవ్ టుడే’, ‘డ్రాగన్’, ‘డ్యూడ్’ వంటి వరుస హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్స్ తో అటు తమిళంలో , ఇటు తెలుగు లో జెన్ జీ యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ని సంపాదించుకున్న ప్రదీప్ రంగనాథన్(Pradeep Ranganathan) లేటెస్ట్ చిత్రం ‘LIK : లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ'(LIK Movie) చిత్రం ఈ నెల 10 న ప్రపంచవ్యాప్తంగా తెలుగు , తమిళ భాషల్లో గ్రాండ్ రిలీజ్ కానుంది. ఎప్పుడో షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం, ప్రేక్షకుల ముందుకు రావడానికి ఇంత సమయం పట్టడానికి కారణం ఏంటో అసలు అర్థం కావడం లేదు. తన ప్రతీ సినిమాకు ప్రొమోషన్స్ తో పిచ్చెక్కించే ప్రదీప్ రంగనాథన్ , ఈ సినిమాని ఎందుకో అసలు పట్టించుకోవడం లేదు. రీసెంట్ గానే ఈ చిత్రానికి సంబంధించిన తెలుగు టీజర్ ని విడుదల చేశారు.

వాస్తవానికి తమిళం లో ఈ టీజర్ విడుదలై 8 నెలలు అయ్యింది. కానీ తెలుగు లో అనువదించడానికి ఇన్ని ఇన్ని రోజుల సమయం పట్టింది. డబ్బింగ్ కూడా అత్యంత నీచంగా ఉండడం గమనార్హం. ఏప్రిల్ 10 న రెండు భాషల్లోనూ ఈ చిత్రం విడుదల అవుతుందా?, లేదంటే కేవలం తమిళం లో మాత్రమే విడుదల అవుతుందా అనే దానిపై ఇప్పటి వరకు స్పష్టత రాలేదు. ప్రదీప్ కి తెలుగు లో మంచి మార్కెట్ ఉన్న సంగతి తెలిసిందే. దానిని క్యాష్ చేసుకోలేకపోతే మేకర్స్ అసమర్థత అనే చెప్పాలి. ఈ చిత్రానికి నయనతార భర్త సతీష్ విగ్నేష్ దర్శకత్వం వహించగా, నయనతార నిర్మాతగా వ్యవహరించింది. కృతి శెట్టి ఇందులో హీరోయిన్ గా నటించింది. కాసేపటి క్రితమే ఈ చిత్రానికి సంబందించిన థియేట్రికల్ ట్రైలర్ ని విడుదల చేశారు. ఇది కేవలం తమిళ వెర్షన్ కి సంబంధించిన ట్రైలర్ మాత్రమే. మరి ఈ ట్రైలర్ ఎలా ఉందో ఒకసారి ఈ రివ్యూ లో చూద్దాం.

ఇది 2040 వ సంవత్సరానికి సంబంధించిన కథ. అప్పటికి చెన్నై ఎలా ఉంటుందో , ఈ ట్రైలర్ లో చూపించిన విజువల్స్ ప్రేక్షకుల దృష్టిని ప్రత్యేకంగా ఆకర్షించింది. అదే విధంగా టెక్నాలజీ బాగా పెరిగిపోయిన నేపథ్యం లో , ఒక ప్రముఖ వ్యక్తి (ఎస్ జె సూర్య) ‘LIK’ అనే యాప్ ని కనిపెడుతాడు. ఈ యాప్ ని ప్రేమజంటలు తెగ వాడేస్తుంటాయి. అలా తొలిచూపులోనే ధీమా అనే అమ్మాయితో ప్రేమలో పడిన హీరోకి , ధీమా కూడా కనెక్ట్ అవుతుంది. కనెక్ట్ అయ్యాక ఆమె కోరిక మేరకు LIK యాప్ ని వాడడం మొదలు పెడుతాడు హీరో. ఈ యాప్ కారణంగా వీళ్లిద్దరి మధ్య బ్రేకప్ జరుగుతుంది. ఆ తర్వాత అనేక సమస్యలు ఎదురు అవుతాయి. అంతా ఆ యాప్ కారణంగా, చివరికి హీరో ఆ యాప్ యాజమాన్యం తో పోరాడి, తన ప్రేమని ఎలా దక్కించుకున్నాడు అనేదే స్టోరీ. సోషల్ మీడియా లో బాగా వైరల్ అయిన ఈ ట్రైలర్ ని మీరు కూడా చూసేయండి.

 

 

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper