Homeఎంటర్టైన్మెంట్God Of War: సౌత్ లో వెల్లువెత్తుతున్న 'కుమార స్వామి' కథలు.. లిస్ట్ లోకి క్రేజీ...

God Of War: సౌత్ లో వెల్లువెత్తుతున్న ‘కుమార స్వామి’ కథలు.. లిస్ట్ లోకి క్రేజీ డైరెక్టర్ కూడా వచ్చేశాడు..

God Of War: మన టాలీవుడ్ లో దేవుళ్ళ కథలపై ఇప్పటి వరకు చాలానే వచ్చాయి, కానీ కుమార స్వామి కథ మీద మాత్రం చాలా తక్కువ మాత్రమే వచ్చాయి. అందుకే ఇప్పుడు క్రేజీ డైరెక్టర్స్ అందరూ ఈ కథ పై బెల్లం చుట్టూ ఈగలు లాగా వాలిపోయారు. ముందుగా త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ కథని చాలా గ్రాండ్ గా , భారీ బడ్జెట్ తో తెరకెక్కించాలని చూస్తున్నాడు. ‘గాడ్ ఆఫ్ వార్’ అనే టైటిల్ తో […]

God Of War: మన టాలీవుడ్ లో దేవుళ్ళ కథలపై ఇప్పటి వరకు చాలానే వచ్చాయి, కానీ కుమార స్వామి కథ మీద మాత్రం చాలా తక్కువ మాత్రమే వచ్చాయి. అందుకే ఇప్పుడు క్రేజీ డైరెక్టర్స్ అందరూ ఈ కథ పై బెల్లం చుట్టూ ఈగలు లాగా వాలిపోయారు. ముందుగా త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ కథని చాలా గ్రాండ్ గా , భారీ బడ్జెట్ తో తెరకెక్కించాలని చూస్తున్నాడు. ‘గాడ్ ఆఫ్ వార్’ అనే టైటిల్ తో తెరకెక్కబోతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ లేదా అల్లు అర్జున్ హీరోగా నటించబోతున్నారు. ప్రస్తుతం విక్టరీ వెంకటేష్ తో ఒక సినిమా చేస్తున్న త్రివిక్రమ్ , ఈ చిత్రం పూర్తి అవ్వగానే , గాడ్ ఆఫ్ వార్ కి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ ని మొదలు పెట్టబోతున్నాడు. అదే విధంగా తమిళం లో శివ కార్తికేయన్ కూడా కుమార స్వామి పై ఒక సినిమా చేస్తున్నాడు.

కమల్ హాసన్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి ‘సియోన్’ అనే టైటిల్ ని ఖరారు చేశారు. రీసెంట్ గానే టీజర్ కూడా విడుదలైంది. మరోపక్క టాలీవుడ్ డైరెక్టర్ కిషోర్ తిరుమల కూడా కుమార స్వామి బ్యాక్ డ్రాప్ లో ఒక పవర్ ఫుల్ కథని రెడీ చేసుకున్నాడట. ఈ స్క్రిప్ట్ కి సంబంధించిన పనులు చకచకా జరుగుతున్నాయి. హీరో ఎవరు అనేది స్క్రిప్ట్ పూర్తి అయ్యాక తెలుస్తుందట. ఇప్పుడు ‘హనుమాన్’ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కూడా ఈ జాబితాలోకి చేరిపోయాడు. కుమార స్వామి బ్యాక్ డ్రాప్ లో ఒక పవర్ ఫుల్ కథని రాసుకున్నాడట. కానీ ఈ చిత్రానికి ఆయన దర్శకత్వం వహించడట, కేవలం నిర్మాతగా మాత్రమే వ్యవహరిస్తాడట. మరి డైరెక్టర్ ఎవరు?, హీరో ఎవరు? అనేది తెలియాలంటే కొన్ని రోజులు ఆగక తప్పదు. కానీ ఆసక్తి కరమైన విషయం ఏమిటంటే త్రివిక్రమ్ ‘గాడ్ ఆఫ్ వార్’ మరియు కిషోర్ తిరుమల సినిమాల కంటే ముందుగా ఈ చిత్రమే సెట్స్ మీదకు వెళ్తుందట.

కానీ ముందుగా ఏ సినిమా విడుదల అవుతుందో చూడాలి. ముందుగా విడుదలయ్యే సినిమాకు మంచి క్రేజ్ ఉంటుంది, బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ కూడా చాలా సాలిడ్ గా ఉంటాయి. కానీ ఆ తర్వాత వచ్చే సినిమాలన్నీ కూడా ముందుగా వచ్చిన సినిమాని చూసి కాపీ కొట్టినట్టుగానే ఆడియన్స్ కి అనిపించే ప్రమాదం ఉంది. మరి ప్రశాంత్ వర్మ ముందుగా వస్తాడా ?, లేదా కిషోర్ తిరుమల ముందుగా వస్తాడా అనేది చూడాలి. త్రివిక్రమ్ శ్రీనివాస్ ‘గాడ్ ఆఫ్ వార్’ మాత్రం ముందుగా వచ్చే అవకాశాలు లేవు. ఎందుకంటే అది భారీ బడ్జెట్ చిత్రం కాబట్టి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper