Homeఎంటర్టైన్మెంట్Anushka Shetty: కథ, రెమ్యూనరేషన్ తెలుసుకోకుండానే బాహుబలికి కమిట్ అయిన అనుష్క? ఎవరి కోసమో తెలుసా?

Anushka Shetty: కథ, రెమ్యూనరేషన్ తెలుసుకోకుండానే బాహుబలికి కమిట్ అయిన అనుష్క? ఎవరి కోసమో తెలుసా?

బాహుబలి సినిమాలో ప్రభాస్ కు జోడీగా నటించింది అనుష్క. అయితే అనుష్క ఏ సినిమాకు కమిట్ అయినా కూడా సినిమాపై నమ్మకంతో మాత్రమే కమిట్ అవుతుంది. కానీ బాహుబలి సినిమాలో అలా జరగలేదట. ఈ విషయాన్ని రాజమౌళి స్వయంగా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

Anushka Shetty: టాలీవుడ్ బ్యూటీ అనుష్క గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈమె ఏ సినిమాలో నటించినా కచ్చితంగా హిట్ అనేంత నమ్మకం పెట్టుకున్నారు నెటిజన్లు. బాహుబలి సినిమాతో స్టార్ హీరోయిన్ గా కొనసాగిన అనుష్క పాన్ ఇండియా స్టార్ గా ఎదిగింది. అయితే దర్శకధీరుడు రాజమౌళి, ప్రభాస్ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ ను సంపాదించింది. అంతేకాదు దీనికి కొనసాగింపుగా బాహుబలి కన్ క్లూజన్ కూడా వచ్చి తెలుగు సినిమా ఖ్యాతిని హద్దులు దాటేలా చేసింది. అయితే ఇందులో అనుష్క నటించిన విషయం తెలిసిందే. మరి ఈ అమ్మడు సినిమా కథ, రెమ్యూనరేషన్ తో సంబంధం లేకుండా, తెలుసుకోకుండా నటించిందంట. నమ్మలేకపోతున్నారు కదా అయితే ఇది మీకోసమే..

బాహుబలి సినిమాలో ప్రభాస్ కు జోడీగా నటించింది అనుష్క. అయితే అనుష్క ఏ సినిమాకు కమిట్ అయినా కూడా సినిమాపై నమ్మకంతో మాత్రమే కమిట్ అవుతుంది. కానీ బాహుబలి సినిమాలో అలా జరగలేదట. ఈ విషయాన్ని రాజమౌళి స్వయంగా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. రవితేజ హీరోగా అనుష్క హీరోయిన్ గా వచ్చిన విక్రమార్కుడు సూపర్ హిట్ అయింది. చత్రపతి సినిమాలో ప్రభాస్ నటిస్తే ఈ సినిమాకు జక్కన్ననే దర్శకత్వం వహించారు. ఇలా ఈ రెండు సినిమాలు కూడా సూపర్ సక్సెస్ అయ్యాయి.

అయితే రాజమౌళి మీద ఉన్న నమ్మకం అందులోనూ ప్రభాస్ నటిస్తున్నారు అని తెలియగానే అనుష్క ఒప్పుకుందంట. ఈ సినిమా కథ వివరించలేదట. రెమ్యూనరేషన్ గురించి కూడా మాట్లాడలేదట. కానీ అనుష్క మాత్రం సినిమాకు సైన్ చేసిందట. దీనికి కారణం ప్రభాస్, రానా, రమ, కీరవాణి అని తెలుస్తోంది. వీరంతా ఉంటే ఆ సినిమా సక్సెస్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని.. వీరి వల్ల సినిమా షూటింగ్ లాగ ఉండదని ఒక వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నట్టుగా ఉంటుందని వెంటనే కమిట్ అయిందట అనుష్క. మొత్తం మీద అనుష్క, ప్రభాస్ ఉన్నాడనే కారణంతో కూడా ఆ సినిమాకు ఒప్పుకుందనే టాక్ కూడా ఉంది. ఏదేమైనా ఈ జోడీతో మరో సినిమా రావాలని కోరుకుంటున్నారు నెటిజన్లు.

ఇక అనుష్క ప్రభాస్ లు పెళ్లి చేసుకుంటే బాగుండు అని అభిమానులు ఎప్పుడు కోరుకుంటారు. వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తే చూడాలని మాత్రమే కాదు వీరిద్దరు రియల్ లైఫ్ లో కూడా జోడీ అవ్వాలని కోరుకునే వారు ఎందరో ఉన్నారు. అయితే ఇద్దరు కూడా రిలేషన్ లో ఉన్నారనే టాక్ ఎప్పటి నుంచో వస్తుంది కానీ ఈ విషయంపై ఎవరు కూడా స్పందించడం లేదు. కానీ ఇలాంటి వార్తలు వచ్చినప్పుడు మాత్రం నిజంగానే స్వీటీ, ప్రభాస్ రిలేషన్ లో ఉన్నారా అనే అనుమానం మరింత ఎక్కువ అవుతందని కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.

Related News

Most Popular

Oktelugu Epaper