Mahesh Babu Rajamouli Fight Scene: రాజకుమారుడు (Rajakumarudu ) సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన నటుడు మహేష్ బాబు (Mahesh Babu)…సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈయన మొదటి సినిమాతో నటుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక ఆ తర్వాత చేసిన సినిమాలన్నీ అతనికి గొప్ప పేరు ప్రతిష్టలను తీసుకురావడమే కాకుండా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తనవైపు తిప్పుకున్నాడు… ప్రస్తుతం రాజమౌళితో చేస్తున్న పాన్ వరల్డ్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకోవడమే కాకుండా ఆయన క్రేజ్ ను కూడా వరల్డ్ లెవెల్ కి తీసుకెళ్లే ప్రయత్నంలో ఉన్నాడు. మరి ఇలాంటి సందర్భంలోనే ఆయన చేస్తున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తగా తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటివరకు ఆయన ఏ సినిమా చేసిన కూడా అందులో చాలా వరకు సక్సెస్ అయితే సాధిస్తూ వచ్చాడు. ఇక రాజమౌళి లాంటి దర్శకుడు సైతం ఇప్పటివరకు ఫెయిల్యూర్ అయితే చూడలేదు. మరి అలాంటి దర్శకుడితో చేస్తున్న సినిమా కావడం వల్ల ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి. ఇక ప్రపంచవ్యాప్తంగా రాజమౌళి కి చాలా మంచి గుర్తింపైతే ఉంది. జేమ్స్ కామెరూన్ (James Cameroon) ఇక లాంటి లాంటి స్టార్ డైరెక్టర్ సైతం రాజమౌళి తీసిన ‘ త్రిబుల్ ఆర్ ‘ (RRR) సినిమా గురించి ప్రశంసల వర్షం కురిపించాడు అంటే రాజమౌళి క్రేజ్ ఏ లెవల్లో ఉందో మన అర్థం చేసుకోవచ్చు.
Also Read: ‘హరి హర వీరమల్లు’ ఓవర్సీస్ అభిమానులకు చేదువార్త..డిస్ట్రిబ్యూటర్ సంచలన ప్రకటన!
మరి బాహుబలి (Bahubali) సినిమాతో పాన్ ఇండియా ను శాసించిన రాజమౌళి త్రిబుల్ ఆర్ సినిమాతో పాన్ వరల్డ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు మహేష్ బాబుతో చేస్తున్న సినిమాతో జేమ్స్ కామెరూన్ లాంటి స్టార్ డైరెక్టర్ పక్కన తన పేరును చిరస్మరణీయంగా నిలుపుకోవాలనే ఉద్దేశంతో ఆయన ముందుకు అడుగులు వేస్తున్నాడు…
అందుకోసమే ఈ సినిమా విషయంలో ఆయన ఎక్కడ రాజీ పడకుండా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ సినిమాలోని ఒక ఫైట్ ని భారీ ఎత్తున షట్ చేయాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ ఫైట్ సినిమా మొత్తానికి హైలైట్ గాని లోబోతుందట. దాదాపు 100 కోట్ల వరకు ఈ ఒక్క ఫ్లైట్ కోసమే డబ్బులు కేటాయిస్తున్నట్టుగా తెలుస్తోంది.
మరి మొత్తానికైతే రాజమౌళి ఈ సినిమాకి సంబంధించిన మూడో షెడ్యూల్ ని తెరకెక్కించడానికి ఒక ప్రణాళికను రూపొందించే పనుల్లో ఉన్నాడు. తొందరలోనే కెన్యాలో మూడో షెడ్యూల్ ని కంప్లీట్ చేసుకొని ఆ తర్వాత భారీ ఫైట్ సీక్వెన్స్ ను తెరకెక్కించే ప్రయత్నం చేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే దీనికోసం హాలీవుడ్ నుంచి స్టంట్ కొరియోగ్రాఫర్లు వచ్చి వర్క్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది…