https://oktelugu.com/

బిగ్ బాస్-4లో మరో వైల్డ్ కార్డు ఎంట్రీ..  హాట్ హీరోయిన్ ఎంట్రీ?  

  తెలుగు రియల్టీ షోలలో బిగ్ బాస్ నెంబర్ వన్ గా కొనసాగుతోంది. ఇప్పటికే బిగ్ బాస్-1.. బిగ్ బాస్-2.. బిగ్ బాస్-3లతో నిర్వాహకులు బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు. ఇటీవల బిగ్ బాస్-4 సీజన్ ప్రారంభమైంది. అప్పుడే రెండువారాలు గడిచిపోయినా నిర్వాహకులు అనుకున్నంత క్రేజ్ మాత్రం రావడం లేదట. దీంతో ప్రస్తుత సీజన్లో మరో వైల్డ్ కార్డు ఎంట్రీ ఉంటుందనే టాక్ విన్పిస్తోంది.  Also Read: ఉన్నట్టు ఉండి ఆ పోస్ట్ ఎందుకు చేసిందో ? […]

Written By:
  • NARESH
  • , Updated On : September 25, 2020 / 03:23 PM IST

    hot herohine

    Follow us on

     
    తెలుగు రియల్టీ షోలలో బిగ్ బాస్ నెంబర్ వన్ గా కొనసాగుతోంది. ఇప్పటికే బిగ్ బాస్-1.. బిగ్ బాస్-2.. బిగ్ బాస్-3లతో నిర్వాహకులు బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు. ఇటీవల బిగ్ బాస్-4 సీజన్ ప్రారంభమైంది. అప్పుడే రెండువారాలు గడిచిపోయినా నిర్వాహకులు అనుకున్నంత క్రేజ్ మాత్రం రావడం లేదట. దీంతో ప్రస్తుత సీజన్లో మరో వైల్డ్ కార్డు ఎంట్రీ ఉంటుందనే టాక్ విన్పిస్తోంది. 

    Also Read: ఉన్నట్టు ఉండి ఆ పోస్ట్ ఎందుకు చేసిందో ?

    16మంది కంటెస్టులతో బిగ్ బాస్-4 సీజన్ ప్రారంభమైంది. కరోనా సమయంలో బిగ్ బాస్-4 సీజన్ ఉంటుందా? ఉండదా? అనే సంగిద్ధంలో షో ప్రారంభమైంది. ప్రస్తుత సీజన్లో పాల్గొన్న కంటెస్టులు పెద్దగా సెలబ్రెటీలు కాకపోవడంతో ప్రేక్షకులు కొంత నిరుత్సాహంగా ఉన్నట్లు తెలుస్తోంది. బిగ్ బాస్-4 ఇప్పటికే రెండు వారాలు పూర్తి చేసుకొని మూడోవారానికి చేరుకుంది.బిగ్ బాస్-4 నుంచి తొలి ఎలిమినేటర్ గా దర్శకుడు సూర్యకిరణ్ బయటికి వెళ్లారు. ఇక రెండోవారంలో కరాటే కల్యాణ్ బిగ్ బాస్ హౌజ్ నుంచి వెళ్లిపోయింది. మొదటి వారంలో వైల్డ్ కార్డు ఎంట్రీతో కామెడియన్ కుమార్ సాయి.. రెండోవారంలో జబర్దస్త్ కామెడీయన్ అవినాష్ ఎంట్రీ ఇచ్చారు. ఇద్దరు కంటెస్టులు బిగ్ బాస్ హౌజ్ నుంచి బయటికి వెళ్లగా మరో ఇద్దరు ఎంట్రీ ఇచ్చారు. అయినప్పటికీ బిగ్ బాస్ షోలో ఊపు రావడం లేదని టాక్ విన్పిస్తోంది.

    Also Read: బాపురే.. పవన్ మళ్లీ మారిపోయాడు.. షాక్ లో అభిమానులు..!

    దీంతో ‘బిగ్ బాస్’ నాలుగో సీజన్లో మరో హాట్ హీరోయిన్ ను రంగంలోకి దింపుతున్నట్లు తెలుస్తోంది. మూడోవారం చివర్లో ఈ హీరోయిన్ ఎంట్రీ ఉండనుందని ప్రచారం జరుగుతోంది. రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన ‘పట్టపగలు’లో హీరోయిన్ గా నటించిన స్వాతిదీక్షిత్ బిగ్ బాస్ హౌజ్ లోకి ఎంట్రీ ఇస్తుందనే గుసగుసలు విన్పిస్తున్నాయి. స్వాతి దీక్షిత్ తెలుగులో చందమామ కథలు.. పట్టపగలు.. జంప్ జిలానీ.. లేడీస్ అండ్ జంటిల్మెన్ సినిమాల్లో నటించింది. హాట్ హీరోయిన్ గా పేరున్న స్వాతిదీక్షిత్ ఎంట్రీతోనైనా బిగ్ బాస్ కు ఊపు వస్తుందో లేదో వేచి చూడాల్సిందే..!