Chammak Chandra: సుమారుగా 12 ఏళ్ళ నుండి ఈటీవీ ఛానల్ లో దిగ్విజయంగా నడుస్తున్న ఎంటర్టైన్మెంట్ షో ఏదైనా ఉందా అంటే అది జబర్దస్త్(Jabardasth Show) షో మాత్రమే అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటి వరకు ఈ షో నుండి ఎంతో మంది కమెడియన్స్ మన టాలీవుడ్ కి పరిచయం అయ్యారు. వాళ్లంతా ఇప్పుడు ఉన్నంత స్థాయిలో ఉన్నారు. గెటప్ శ్రీను, హైపర్ ఆది, సుడిగాలి సుధీర్, చమ్మక్ చంద్ర ఇలా ఎంతో మంది ఈ షో ద్వారా వచ్చినవారే. సుడిగాలి సుధీర్ అయితే ఏకంగా హీరోగా స్థిరపడ్డాడు. ఇప్పుడు కాస్త గ్యాప్ రావడం తో యాంకరింగ్ రంగం లోకి అడుగుపెట్టి దున్నేస్తున్నాడు. ఇక చమ్మక్ చంద్ర అయితే ఈమధ్య కాలం లో ప్రతీ సినిమాలోనూ ఉంటున్నాడు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు. అయితే ఈమధ్య కాలం లో అవకాశాలు తగ్గిపోయిన కొంతమంది టాప్ కమెడియన్స్ మళ్ళీ జబర్దస్త్ లోకి రీ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే.
Also Read: టీ బీజేపీలో కలహాలు.. రామచందర్‌రావు గుర్తించట్లేదా?
అందుకు బెస్ట్ ఉదాహరణ ధనరాజ్. కెరీర్ మంచి బిజీ గా ఉన్న సమయం లో కూడా ఈయన సమాంతరంగా అప్పట్లో జబర్దస్త్ షో చేసేవాడు. కానీ ఇప్పుడు కెరీర్ బాగా డౌన్ అయ్యింది. సినిమాల్లో అవకాశాలు తగ్గిపోయాయి. అందుకే ఆయన మళ్ళీ జబర్దస్త్ లోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు మరో టాప్ కమెడియన్ కూడా రీ ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్. ఆ టాప్ కమెడియన్ మరెవరో కాదు, చమ్మక్ చంద్ర. వరుస సినిమాలతో ఊపిరి తీసుకోలేనంత బిజీ గా ఉంటున్న ఆయన్ని, భారీ పారితోషికం ఇచ్చి మళ్ళీ జబర్దస్త్ కి తీసుకొచ్చే ప్రయత్నాలు మల్లె మాల ఎంటర్టైన్మెంట్స్ చేస్తుందని తెలుస్తుంది. చమ్మక్ చంద్ర వస్తే పడిపోయిన టీఆర్ఫీ రేటింగ్స్ మళ్ళీ పైకి లేస్తుందని అనుకుంటున్నారు.
ప్రస్తుతం జబర్దస్త్ లో ఉన్న కమెడియన్స్ ఒకప్పటి రేంజ్ లో ఎంటర్టైన్మెంట్ ని ఇవ్వలేకపోతున్నారు. ఎదో కామెడీ చెయ్యాలని ప్రయత్నం చేస్తున్నట్టే ఉంది కానీ, ప్రేక్షకులను నవ్వించడం లో విఫలం అవుతున్నారు. అందుకే ఖర్చు అయినా టాప్ కమెడియన్ ని ఈ షో కి తీసుకొని రావాలనే ఉద్దేశ్యం తో చమ్మక్ చంద్ర ని తీసుకొస్తున్నట్టు తెలుస్తుంది. గెటప్ శ్రీను కూడా మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. వీళ్లంతా జబర్దస్త్ కి మరోసారి పూర్వ వైభవాన్ని తీసుకొస్తారా లేదా అనేది చూడాలి. రీసెంట్ గానే 12 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా జబర్దస్త్ పాత కమెడియన్స్ మొత్తం రీ యూనియన్ అయ్యి చేసిన ఒక ఎపిసోడ్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో మనమంతా చూసాము. ఇక నుండి అలాంటి ఎపిసోడ్స్ వస్తాయని ఆశిస్తున్నారు జబర్దస్త్ ఫ్యాన్స్.