https://oktelugu.com/

ఆర్ఆర్ఆర్ గురించి మరో ఆసక్తికర అప్ డేట్

రాజమౌళి సినిమాలకు క్రేజ్‌ అంతాఇంతా కాదు. ఎప్పుడెప్పుడు కొత్త సినిమా రిలీజ్‌ అవుతుందా అని ఏళ్ల తరబడి వెయిట్‌ చూస్తూనే ఉంటారు అభిమానులు. బాహుబలి, బాహుబలి–2తో ప్రపంచ స్థాయిలో ఖ్యాతి సాధించిన రాజమౌళి ఇప్పుడు RRR తీస్తున్నారు. ‘రౌద్రం రణం రుధిరం’ ఈ మూవీ పేరు. Also Read: హీరో కావాల్సిన లోకేష్ పొలిటీషన్ ఎలా అయ్యాడు? ‘ఎన్టీఆర్‌‌–రామ్‌చరణ్’ కాంబోలో ఈ సినిమా రాబోతోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్‌‌కు జోడీగా హాలీవుడ్ బ్యూటీ ఒలివియా మోరిస్‌ను తీసుకున్నారు. […]

Written By: , Updated On : September 15, 2020 / 12:17 PM IST
Follow us on


రాజమౌళి సినిమాలకు క్రేజ్‌ అంతాఇంతా కాదు. ఎప్పుడెప్పుడు కొత్త సినిమా రిలీజ్‌ అవుతుందా అని ఏళ్ల తరబడి వెయిట్‌ చూస్తూనే ఉంటారు అభిమానులు. బాహుబలి, బాహుబలి–2తో ప్రపంచ స్థాయిలో ఖ్యాతి సాధించిన రాజమౌళి ఇప్పుడు RRR తీస్తున్నారు. ‘రౌద్రం రణం రుధిరం’ ఈ మూవీ పేరు.

Also Read: హీరో కావాల్సిన లోకేష్ పొలిటీషన్ ఎలా అయ్యాడు?

‘ఎన్టీఆర్‌‌–రామ్‌చరణ్’ కాంబోలో ఈ సినిమా రాబోతోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్‌‌కు జోడీగా హాలీవుడ్ బ్యూటీ ఒలివియా మోరిస్‌ను తీసుకున్నారు. ఇన్నాళ్లు కొవిడ్‌ కారణంగా ఆగిపోయిన షూటింగ్‌ మళ్లీ సెట్స్‌ మీదకు వెళ్తోంది. వచ్చే నవంబర్‌‌లో తదుపరి షెడ్యూల్‌ ప్లాన్‌ చేస్తున్నారు. ఈ షెడ్యుల్‌లో ఒలివియా మోరిస్ అండ్ ఎన్టీఆర్‌‌కు మధ్య నడిచే సీన్స్‌ను షూట్ చేయనున్నారట. ఎన్టీఆర్ మీద ఫస్ట్ లుక్ వీడియోను రిలీజ్ చేయడానికి ఈ సీన్స్‌లోని కొన్ని షాట్స్ అవసరం అవుతాయట. అందుకే ముందుగా ఈ సీన్స్‌ను ప్లాన్ చేస్తున్నారని తెలిసింది.

Also Read: మెగా బ్రదర్ నాగబాబుకు కరోనా సోకిందా?

ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ ప్రేమ కోసం ఒలివియా తమ దేశం పైన, తన తల్లిదండ్రుల పైనే పోరాడుతుందట. చివరికి ఎన్టీఆర్ మీద ప్రేమతోనే భారతదేశం కోసం ప్రాణాలు ఇస్తుందని.. ఎన్టీఆర్ – ఒలివియా ట్రాక్ కొత్తగా ఉంటుందని తెలుస్తోంది. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై దానయ్య ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

కాగా ‘బాహుబలి’ తరువాత రాజమౌళి చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై ఆరంభం నుంచి భారతీయ అన్ని సినీ పరిశ్రమల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.