https://oktelugu.com/

కో‘దండమే’.. పోటీకి భయపడుతున్న కేసీఆర్?

తెలంగాణ కల సాకారంలో ఇద్దరు కృష్ణ అర్జునల పాత్ర ఉంది.అందులో కృష్ణుడిగా కోదండరాం ముందు కనపడితే.. వెనుకుండి నడిపించింది అర్జునడైన కేసీఆర్. అయితే ఎందుకో తెలంగాణ ఏర్పడ్డాక వీరిద్దరికీ చెడింది. ఇద్దరూ విడిపోయారు. బద్ద శత్రువులయ్యారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కొత్త పార్టీ పెట్టి కోదండరాం ప్రతిపక్ష కాంగ్రెస్ తో కలిసి పోరాడినా ఫలితం లేకుండా పోయింది. అప్పటి నుంచి సైలెంట్ అయిపోయాడు.అయితే ప్రజాక్షేత్రంలో కేసీఆర్ ను ఓడించలేని కోదండరాం ఇప్పుడు విద్యావంతులతో కలిసి ఓడించాలని యోచిస్తున్నాడు. […]

Written By:
  • NARESH
  • , Updated On : September 15, 2020 / 12:32 PM IST
    Follow us on


    తెలంగాణ కల సాకారంలో ఇద్దరు కృష్ణ అర్జునల పాత్ర ఉంది.అందులో కృష్ణుడిగా కోదండరాం ముందు కనపడితే.. వెనుకుండి నడిపించింది అర్జునడైన కేసీఆర్. అయితే ఎందుకో తెలంగాణ ఏర్పడ్డాక వీరిద్దరికీ చెడింది. ఇద్దరూ విడిపోయారు. బద్ద శత్రువులయ్యారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కొత్త పార్టీ పెట్టి కోదండరాం ప్రతిపక్ష కాంగ్రెస్ తో కలిసి పోరాడినా ఫలితం లేకుండా పోయింది. అప్పటి నుంచి సైలెంట్ అయిపోయాడు.
    అయితే ప్రజాక్షేత్రంలో కేసీఆర్ ను ఓడించలేని కోదండరాం ఇప్పుడు విద్యావంతులతో కలిసి ఓడించాలని యోచిస్తున్నాడు. తెలంగాణలో నిరుద్యోగులకు ఏమీ చేయని కేసీఆర్ ఇప్పుడు వారితో పెట్టుకోవడం లేదు. అలాగే వారి మద్దతు తో వస్తున్న కోదండరాంపై కూడా పోటీ పెట్టడం లేదట..ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో కూడా కేసీఆర్ కు బాగా తెలుసు. అందుకే త్వరలో జరగబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏకంగా కోదండరాంపై పోటీచేయడానికి కూడా సాహసించకపోవడం విశేషం. తెలంగాణలో అధికారంలో ఉన్న ఒక పార్టీ ఒక అభ్యర్థిపై పోటీపెట్టకపోవడం అంటే అంతకంటే అవమానం ఇంకొకటి కాదు.కానీ విద్యావంతుల చేతిలో చావుదెబ్బ తినేందుకు.. కోదండరాం చేతిలో ఓడిపోయేందుకు కేసీఆర్ సిద్ధంగా లేడు. అందుకే ముందే ఓటమిని అంగీకరించి వైదొలుగుతున్నాడట.
    .Also Read: అక్టోబర్‌‌ 16 నాడే ఎంగిలిపూల బతుకమ్మ

    తెలంగాణ జనసమితి అధినేత కోదండరాం మరోసారి పాలిటిక్స్ లో యాక్టివ్ కావాలని ఆలోచిస్తున్నాడు. కరీంనగర్-వరంగల్-ఖమ్మం  గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ నియోజకవర్గం నుంచి రాబోయే శాసనమండలి ఎన్నికలలో పోటీ చేయాలని కోదండరాం భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు గ్రాడ్యుయేట్ల మద్దతు కోసం ప్రచారం చేయాలని నిర్ణయించారట.. అన్నీ సరిగ్గా జరిగితే త్వరలోనే నామినేషన్ దాఖలు చేస్తాడని సమాచారం. కోదండరాంకు బిజెపి,  ప్రతిపక్షం కాంగ్రెస్ కూడా మద్దతు ఇచ్చే అవకాశాలున్నాయి.

    టిఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ మొదట్లో తన సొంత పార్టీ అభ్యర్థిని నిలబెట్టాలని అనుకున్నప్పటికీ కోదండరాం మీద గెలవడం కష్టం కాబట్టి.. టిఆర్ఎస్ అభ్యర్థి ఎన్నికలలో ఓడిపోతే అది తనకు అవమానంగా ఉంటుందని డ్రాప్ అయినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే హైదరాబాద్ రంగారెడ్డి, మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సైతం టీఆర్ఎస్ వైదొలిగి అక్కడ పోటీచేస్తున్న ప్రొఫెసర్ నాగేశ్వర్ కు మద్దతు ఇవ్వాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. కాబట్టి, అధికారిక అభ్యర్థిని నిలబెట్టడానికి బదులుగా, టిఆర్ఎస్ పరోక్షంగా నాగేశ్వర్ కు మద్దతు ఇస్తుందని అంటున్నారు.

    Also Read: టీఎస్‌–బీపాస్‌.. : సామాన్యులకు ఎంత లాభం?

    టీఆర్ఎస్ వైదొలగడంతో  అటు కోదండరాం, ఇటు నాగేశ్వర్ గెలవడానికి సమస్యలు లేవని తెలుస్తోంది. కోదండరాంపై అభ్యర్థిని పెట్టకూడదని టీఆర్ఎస్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. అంటే కోదండకు కేసీఆర్ భయపడుతున్నాడని ప్రచారం జరుగుతోంది.