https://oktelugu.com/

టీఎస్‌–బీపాస్‌.. : సామాన్యులకు ఎంత లాభం?

  రాష్ట్రంలోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఇక నుంచి ఇంటి నిర్మాణ అనుమతులకు ఇబ్బందులు తొలగనున్నాయి. ఇందుకు సంబంధించి టీఎస్‌–బీపాస్‌ బిల్లును సోమవారం శాసనసభ ఆమోదించింది. మంత్రి కేటీఆర్‌‌ ప్రవేశపెట్టిన ఈ బిల్లును ఈ నెలాఖరు నుంచే అమలు చేసేందుకు పురపాలక శాఖ సిద్ధమైంది. టీఎస్‌–ఐపాస్‌ తరహాలోనే టీఎస్‌–బీపాస్‌ ఉంటుందని కేటీఆర్‌‌ చెప్పారు. Also Read: విపక్షాల గొంతు కేసీఆర్ నొక్కేస్తున్నారా? సీతక్క ఆవేదన ఇదీ.. కొత్త చట్టం ప్రకారం 75 చదరపు గజాల విస్తీర్ణం, ఏడు మీటర్ల […]

Written By:
  • NARESH
  • , Updated On : September 15, 2020 1:54 pm
    Follow us on

     

    రాష్ట్రంలోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఇక నుంచి ఇంటి నిర్మాణ అనుమతులకు ఇబ్బందులు తొలగనున్నాయి. ఇందుకు సంబంధించి టీఎస్‌–బీపాస్‌ బిల్లును సోమవారం శాసనసభ ఆమోదించింది. మంత్రి కేటీఆర్‌‌ ప్రవేశపెట్టిన ఈ బిల్లును ఈ నెలాఖరు నుంచే అమలు చేసేందుకు పురపాలక శాఖ సిద్ధమైంది. టీఎస్‌–ఐపాస్‌ తరహాలోనే టీఎస్‌–బీపాస్‌ ఉంటుందని కేటీఆర్‌‌ చెప్పారు.

    Also Read: విపక్షాల గొంతు కేసీఆర్ నొక్కేస్తున్నారా? సీతక్క ఆవేదన ఇదీ..

    కొత్త చట్టం ప్రకారం 75 చదరపు గజాల విస్తీర్ణం, ఏడు మీటర్ల కంటే తక్కువ ఎత్తు ఉండే నివాసాలకు ఎలాంటి పర్మిషన్‌ అక్కర్లేదు. 75 చదరపు గజాల కంటే ఎక్కువ 600 చదరపు గజాలలోపు (500 మీటర్ల కంటే తక్కువ), పది మీటర్ల కంటే తక్కువ ఉండే భవన నిర్మాణాలకు స్వీయ ధ్రువీకరణ పత్రంతో అనుమతి లభిస్తుంది. 600 చదరపు గజాల కంటే ఎక్కువ విస్తీర్ణంలో నిర్మిస్తే 21 రోజుల్లోనే అనుమతి వస్తుంది. ఒకేసారి ఉమ్మడి దరఖాస్తు సమర్పిస్తే అగ్నిమాపక, సాగునీటి శాఖ, రెవెన్యూ, పోలీసు, విమానయాన సంస్థల అనుమతికి ఆటోమెటిక్‌గా అప్లికేషన్‌ వెళ్తుంది. సంబంధిత శాఖలు కూడా రీమార్కులను వారం రోజుల్లోనే పంపిస్తాయి.

    ప్రభుత్వం కొత్తగా తెచ్చిన ఈ చట్టం ప్రత్యేకతలు ఇలా ఉన్నాయి. మొబైల్‌ యాప్‌, టీఎస్‌–బీపాస్‌ వెబ్‌సైట్‌, మీ సేవా కేంద్రాలు, పట్టణ స్థానిక సంస్థలు, కలెక్టర్లలోని పౌరసేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. మాస్టర్‌‌ప్లాన్‌, జోనింగ్‌ నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు ఉంటే అనుమతి పొందిన 21 రోజుల్లోనే వాటిని రద్దు చేస్తారు. స్వీయ ధ్రువీకరణ ద్వారా అనుమతి పొందిన 21 రోజుల తర్వాత నిర్మాణ పనులు ప్రారంభించాల్సి ఉంటుంది. ఈ 21 రోజుల్లో అధికారులు పరిశీలన పూర్తిచేస్తారు. జిల్లాల్లో కలెక్టర్‌‌ అధ్యక్షతన, జీహెచ్ఎంసీలో జోనల్‌ కమిషనర్‌‌ ఆధ్వర్యంలో కమిటీ పరిశీలన జరుగుతుంది.

    Also Read: మళ్లీ రవి ప్రకాష్‌ చేతికి టీవీ 9..?

    టీఎస్‌–బీపాస్‌ ద్వారా అనుమతులు పొందిన ప్రతీ బిల్డింగ్‌ వివరాలు వెబ్‌సైట్‌లో ఉంటాయి. వీటిపై ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే 21 రోజుల్లోపు కమిటీ దృష్టికి తీసుకురావాల్సి ఉంటుంది. నిబంధనలు ఉల్లంఘిస్తే కూల్చివేయడం లేదా మూసివేయడం లేదా జరిమానా విధించడం చేస్తారు. దరఖాస్తు సమయంలో కూడా నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం ఉంటే ఎటువంటి నోటీసు లేకుండానే కూల్చివేయవచ్చని దరఖాస్తుదారుడు ప్రకటించాల్సి ఉంది. ఒకవేళ అనుమతి మంజూరులో జాప్యం జరిగితే సంబంధిత అధికారిపై క్రమశిక్షణ చర్యతోపాటు అవసరమైతే ఫైన్‌ కూడా వేస్తారు.