https://oktelugu.com/

Kalki Movie: కల్కి సినిమా నుంచి మరో భారీ అప్డేట్.. ఖుషి అవుతున్న ఫ్యాన్స్…

Kalki Movie: భైరవ బుజ్జిగా వచ్చిన యానిమేషన్ వీడియో గాని, రీసెంట్ గా ముంబై లో ప్రీ రిలీజ్ ఈవెంట్ గాని అన్ని ఈ సినిమా మీద భారీ అంచనాలను పెంచేస్తున్నాయి.

Written By: , Updated On : June 21, 2024 / 09:59 AM IST
Another huge update from Kalki movie

Another huge update from Kalki movie

Follow us on

Kalki Movie: ప్రస్తుతం ఇండియా వైడ్ గా ఎక్కడ చూసిన కల్కి సినిమా హవానే నడుస్తుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ట్రైలర్ ప్రేక్షకులందరిని మెప్పిస్తుంది. భైరవ బుజ్జిగా వచ్చిన యానిమేషన్ వీడియో గాని, రీసెంట్ గా ముంబై లో ప్రీ రిలీజ్ ఈవెంట్ గాని అన్ని ఈ సినిమా మీద భారీ అంచనాలను పెంచేస్తున్నాయి. ఇక మొత్తానికైతే ఈ సినిమాతో ప్రభాస్ మరొక భారీ సక్సెస్ ని కొట్టబోతున్నాడు అనే విషయం చాలా క్లియర్ గా అర్థం అవుతుంది.

ఇక ఈ సినిమా కనక సూపర్ సక్సెస్ ని సాధించినట్లైతే ప్రభాస్ కూడా మరోసారి స్టార్ హీరోగా తను తాను ఎస్టాబ్లిష్ చేసుకుంటాడు. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబంధించిన సెకండ్ ట్రైలర్ ని కూడా రిలీజ్ చేయడానికి సినిమా యూనిట్ సిద్దమైనట్టుగా తెలుస్తుంది. ఇక అందులో భాగంగానే శుక్రవారం సాయంత్రం 6 గంటలకు ఈ సినిమా ట్రైలర్ ని రిలీజ్ చేస్తున్నట్టుగా సినిమా యూనిట్ అఫిషియల్ గా ఒక అనౌన్స్ మెంట్ అయితే వచ్చింది. ఇక ఇప్పుడు ఈ విషయాన్ని తెలుసుకున్న ప్రభాస్ అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

Also Read: Nindha Movie Review: నింద ఫుల్ మూవీ రివ్యూ…

ఇక ఈనెల 27వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో సినిమాకు సంబంధించిన రోజుకొక అప్డేట్ ను ఇస్తు సినిమా మీద భారీ హైప్ అయితే క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక బుజ్జి వెహికిల్ తో ప్రభాస్ దేశమంత చుట్టేసి వస్తుంటే మరోవైపు నాగ్ అశ్విన్ ఈ సినిమాకి సంబంధించిన కథను కూడా మొత్తం రిలీజ్ చేసి ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచేస్తున్నాడు.

Also Read: Venkatesh: కూతురు వయసున్న హీరోయిన్ తో వెంకీ రొమాన్స్.. ఇండస్ట్రీలో హాట్ టాపిక్

అన్ని రకాలుగా ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ ని నిర్వహిస్తూ ఈ సినిమాని ఎలివేట్ అయితే చేస్తున్నారు. ఇంకా తొందర్లోనే తెలుగులో ఈ సినిమాకి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా నిర్వహించబోతున్నట్టుగా తెలుస్తుంది… ఇక మొత్తానికైతే ఈ సినిమాతో ప్రభాస్ భారీ సక్సెస్ కొట్టాలని చూస్తున్నాడు…