AP Assembly Session 2024: ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. సీఎంగా చంద్రబాబు, డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ తో పాటు మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. నేడు 175 మంది ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందుకుగాను ఏపీ అసెంబ్లీ సమావేశాలు నేడు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే ప్రొటెమ్ స్పీకర్ గా గోరంట్ల బుచ్చయ్య చౌదరి నియమితులయ్యారు. చింతకాయల అయ్యన్నపాత్రుడిని స్పీకర్ గా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. సీఎం గానే సభలో అడుగు పెడతానని చంద్రబాబు శపధం చేసిన సంగతి తెలిసిందే. అందుకు తగ్గట్టుగానే ఆయన సీఎంగా హౌస్ లో అడుగుపెట్టనున్నారు. పవన్ ను అసెంబ్లీ గేటు కూడా పాతనివ్వనని సీఎం జగన్ శపధం చేసిన సంగతి తెలిసిందే. కానీ అత్యధిక మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలవడంతో పాటు డిప్యూటీ సీఎం గా పవన్ బాధ్యతలు స్వీకరించారు. నేడు హౌస్ లో అడుగుపెట్టనున్నారు.
గత ఎన్నికల్లో 151 స్థానాల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చారు జగన్. కానీ ఈసారి 11 స్థానాలకి పరిమితమయ్యారు. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. ఈ తరుణంలో ఆయన హౌస్ లో అడుగు పెడతారా? లేదా? అన్న చర్చ నడిచింది. అయితే ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేయని ఉండడంతో ఆయన అసెంబ్లీకి వస్తారని తెలుస్తోంది. బంపర్ మెజారిటీతో కూటమి అధికారంలోకి రావడంతో పాటు పరాజయం తర్వాత జగన్ ఇంతవరకు పబ్లిక్ లో కనిపించలేదు. ఆయన తొలిసారిగా ఈరోజు ప్రజలకు కనిపించనున్నారు. అన్నింటికీ మించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే హోదాలో తొలిసారిగా శాసనసభలో అడుగు పెడుతున్నారు. పార్టీని స్థాపించి ఎమ్మెల్యే కావడానికి పవన్ పట్టింది. ఎన్నెన్నో అవమానాలు ఆయన ఎదుర్కొన్నారు. అన్నింటినీ భరించి పిఠాపురం నుంచి పోటీ చేసిన ఆయనకు 70 వేల మెజారిటీ దక్కింది.
తమ అభిమాన నాయకుడు అసెంబ్లీలో అధ్యక్షా అనడం చూడాలని లక్షలాదిమంది జనసేన కార్యకర్తలు, పవన్ అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఆయనను చూడటానికి అసెంబ్లీకి కుటుంబ సభ్యులు, సన్నిహితులు, అభిమానులు తరలివచ్చే అవకాశం ఉంది. వీరిని ఆపడం భద్రతా సిబ్బంది వల్ల కాదు. దీనిని దృష్టిలో ఉంచుకొని ముందు జాగ్రత్త చర్యగా విసిటింగ్ పాసులను రద్దు చేస్తున్నట్లు అసెంబ్లీ అధికారులు ప్రకటించారు. ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులైన సరే పాసులను ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పారు. అధికారుల నిర్ణయంతో పవన్ అభిమానులు నిరుత్సాహానికి గురయ్యారు. ప్రత్యేకించి మెగా కుటుంబానికి చెందిన కొందరు పవన్ ను అసెంబ్లీలో చూడాలని ముచ్చట పడ్డారు. కానీ వారి ఆశలపై ప్రభుత్వం నీళ్లు చెల్లింది. అయితే టీవీలలో ప్రత్యక్ష ప్రసారం ద్వారా పవన్ ను ఎమ్మెల్యే హోదాలో చూసుకోవచ్చని వారు సంతృప్తి రక్తం చేస్తున్నారు.