https://oktelugu.com/

PM Modi : మోడీ 400 సీట్ల లక్ష్యాన్ని ఎలా సాధించగలడో చూద్దామా..

మోడీ 400 సీట్ల లక్ష్యాన్ని ఎలా సాధించగలడో లేదో అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

Written By: , Updated On : February 7, 2024 / 02:12 PM IST

PM Modi : మోడీ మొన్న లోక్ సభలో 400 ఎంపీ సీట్లను టార్గెట్ చేసుకున్నారు. ఒక విధంగా మోడీ తీసుకున్న సాహసమైన నిర్ణయం. మోడీ ఎప్పుడూ ప్రజల మీద నమ్మకం ఉంది.. మాకు సంపూర్ణ మెజార్టీ ఇస్తే చాలు అని మాట్లాడుతుంటాడు. అంకెల గారడీలోకి మోడీ ఇంతవరకూ వెళ్లలేదు. మొట్టమొదటిసారి వెళ్లాడు.

మోడీ ఇప్పటివరకూ తీసుకున్న టార్గెట్లు రీచ్ అయ్యాడా? అంటే సాధించాడనే చెప్పాలి. ఎవరూ ఊహించని విధంగా పలు పనులు చేశాడు. ఆర్టికల్ 370 రద్దు, రామమందిర నిర్మాణం, మహిళా బిల్లు, యూసీసీ కానీ ఎవరూ సాధ్యం కావని అనుకున్నారు. కానీ అసాధ్యమనుకున్న వీటిని సుసాధ్యం చేసిన ఘనత మోడీది. ఇదీ నాయకత్వ పటిమ. చెప్పింది.. చెప్పనవి చేస్తున్నాడని.. ప్రజల్లో మోడీ పట్ల ఒక ఆరాధన భావం వస్తోంది. ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ పెరిగింది. పాజిటివ్ వేవ్ పెరిగింది.

2019లో పాకిస్తాన్ లోని బాలాకోట్ పై వైమానిక దాడులతో ఒక్కసారిగా జాతీయ భావాలు పెరిగిపోయాయి. 2024 వరకూ అసలు ఈయన రా నాయకుడు అంటే అనే స్థాయికి మోడీ ప్రతిష్ట పెరిగింది.

మోడీ 400 సీట్ల లక్ష్యాన్ని ఎలా సాధించగలడో లేదో అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

మోడీ 400 సీట్ల లక్ష్యాన్ని ఎలా సాధించగలడో చూద్దామా || BJP guaranteed 370 seats, NDA will cross 400