ప్రజలు లొల్లి చేయడం లేదనే ఈ ధరల పెంపా..?

ఓ వైపు కరోనాతో ఇప్పటికే సామాన్య ప్రజల బతుకులు దీనావస్థకు చేరిపోయాయి. జీవితాలు ఛిన్నాభిన్నం అయిపోయాయి. ఉద్యోగాలు కోల్పోయారు.. ఉపాధిని కోల్పోయారు.. ఇప్పటికే కుటుంబాలను ఇబ్బందుల నడుమ నెట్టుకొస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అండగా ఉండాల్సిన కేంద్ర ప్రభుత్వం మరింత నడ్డి విరుస్తోంది. ఇష్టం వచ్చినట్లుగా పెట్రో ధరలు పెంచుతూ కోలుకోకుండా చేస్తోంది. Also Read: విశాఖ సాక్షిగా.. రాజీ‘డ్రామా’ల పర్వం..? రోజురోజుకూ పెట్రో ధరలు పెరుగుతున్నా ప్రజల నుంచి వ్యతిరేకత రాకపోవడంతో దానిని కేంద్రం అడ్వాంటేజీగా తీసుకున్నట్లు […]

Written By: Srinivas, Updated On : February 15, 2021 1:33 pm
Follow us on


ఓ వైపు కరోనాతో ఇప్పటికే సామాన్య ప్రజల బతుకులు దీనావస్థకు చేరిపోయాయి. జీవితాలు ఛిన్నాభిన్నం అయిపోయాయి. ఉద్యోగాలు కోల్పోయారు.. ఉపాధిని కోల్పోయారు.. ఇప్పటికే కుటుంబాలను ఇబ్బందుల నడుమ నెట్టుకొస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అండగా ఉండాల్సిన కేంద్ర ప్రభుత్వం మరింత నడ్డి విరుస్తోంది. ఇష్టం వచ్చినట్లుగా పెట్రో ధరలు పెంచుతూ కోలుకోకుండా చేస్తోంది.

Also Read: విశాఖ సాక్షిగా.. రాజీ‘డ్రామా’ల పర్వం..?

రోజురోజుకూ పెట్రో ధరలు పెరుగుతున్నా ప్రజల నుంచి వ్యతిరేకత రాకపోవడంతో దానిని కేంద్రం అడ్వాంటేజీగా తీసుకున్నట్లు తెలుస్తోంది. పెట్రోల్, డీజిల్‌పై రోజువారీగా వడ్డిస్తోంది. లాక్ డౌన్ తర్వాత లీటర్ పెట్రోల్ ధర రూ.పాతిక రూపాయలకుపైగా పెంచారు. ఆత్ననిర్భర్ పేరుతో అమలు చేసిన ప్యాకేజీలకు నిధులు పెట్రో ధరల వడ్డింపు ద్వారానే పొందినట్లుగా కేంద్రం చెబుతోంది. అయితే ఆ వడ్డింపు అంతటితో ఆపలేదు. రోజుకు పావలా చొప్పున కొనసాగిస్తూనే ఉన్నారు. బడ్జెట్‌లో టాక్స్‌లు తగ్గిస్తారన్న ప్రచారం చేశారు. కానీ.. అదనపు వడ్డింపులు చేశారు. అయితే ఒక్క సారిగా నాలుగైదు రూపాయలు పెంచితే.. ప్రజలు ఊరుకోరని అనుకున్నారేమో కానీ ఎక్సైజ్ ట్యాక్స్ ను తగ్గించి సెస్ రూపంలో కవర్ చేశారు. కానీ.. ఆ నాలుగైదు రూపాయల పెంపును బడ్జెట్‌ అమల్లోకి వచ్చే సరికి కవర్ చేసేస్తున్నారు.

ప్రభుత్వం తీరు సామాన్యుల జీవితాలపై దారుణంగా ప్రభావం చూపిస్తోంది. ఇతర వాటిపై పన్నులు పెంచితే ఆ ఒక్క రంగంపై ప్రభావం పడుతుండేది. కానీ.. పెట్రోల్ , డీజీల్‌ రేట్లు పెంచితే నిత్యావసర వస్తువుల ధరలపైనా ప్రభావం చూపుతోంది. అలా పెరిగితే.. కేంద్ర ప్రభుత్వానికి జీఎస్టీ పెరుగుతోంది. రికార్డు స్థాయిలో వసూలు అవుతున్న జీఎస్టీ గణాంకాలే ఈ విషయాన్ని సైతం నిరూపిస్తున్నాయి. అయితే ప్రజలు మాత్రం చితికిపోతున్నారన్న కనీస స్పృహ కేంద్రానికి ఉండటం లేదు. కరోనా కారణంగా ప్రజల జీవన ప్రమాణాలపై తీవ్ర ప్రభావం పడింది. ఆదాయం పడిపోయింది. ఈ విషయం తెలిసి కూడా కేంద్రం పన్నుల బాదుడును ఆపడం లేదు.

Also Read: మళ్లీ తెరపైకి హైదరాబాద్ ‘యూటీ’

పెరుగుతున్న ధరలపై ప్రజలు కూడా టైం తీసుకుని రోడ్లెక్కే పరిస్థితుల్లో కనిపించడం లేదు. ఇదే కేంద్ర ప్రభుత్వానికి అలుసైనట్లుగా కనిపిస్తోంది. చివరికి వంట గ్యాస్ పైనా.. ఓ రేంజ్‌లో బాదేస్తోంది. ఒకప్పుడు సబ్సిడీని నగదు బదిలీ అని చెప్పారు.. కానీ ఇప్పుడు కనీసం ఆ సబ్సిడీ యాభై రూపాయలు కూడా రావడం లేదు. కానీ.. సిలిండర్ మాత్రం 700 దాటిపోయింది. అంటే.. గ్యాస్ సిలిండర్ ధర రూ.700లకుపైగానే ఉంది. ఆరేళ్ల కిందట గ్యాస్ ధర రూ.300లకు అటూ ఇటూగానే ఉండేది. కానీ.. ఇప్పుడు డబుల్ దాటిపోయింది.

మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్