Animal Collection: వసూళ్ల సునామిని సృష్టిస్తున్న అనిమల్…8 రోజుల్లో ఎన్ని వందల కోట్లు వసూలు చేసిందంటే..?

మైండ్ లో ఎలాంటి సినిమా అయితే చేయాలి అనుకున్నాడో దానికి ఏమాత్రం తగ్గకుండా అదిరిపోయే కథతో అద్భుతమైన కథనంతో డిఫరెంట్ మేకింగ్ తో సందీప్ వంగ అంటే ఎలా ఉంటుందో ఆ సినిమా ద్వారా చూపిస్తూ ఉంటాడు.

Written By: Gopi, Updated On : December 10, 2023 9:27 am

Animal OTT

Follow us on

Animal Collection: ఒక సినిమా చేయాలంటే చాలా రకాల క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. స్టోరీ వర్క్ అవుట్ అవుతుందా, ఈ హీరోతో మనం సినిమా చేయగలమా, ఎంత బడ్జెట్ పెడుతే ఎంత మనీ వస్తుంది అనే లాంటి క్యాలిక్యులేషన్స్ తో ఒక సినిమా అనేది స్టార్ట్ అవుతుంది. కానీ సందీప్ రెడ్డి వంగ లాంటి డైరెక్టర్ డైరెక్షన్ లోఒక సినిమా స్టార్ట్ అవుతుంది అంటే మాత్రం తనకు ఎలాంటి క్యాలిక్యులేషన్స్ ఉండవు. సినిమా ఎలా తీయాలి, సినిమా లెంత్ ఎంత ఉండాలి అనే విషయాలను మాటీమ్ ఆయన అస్సలు పట్టించుకోడు.

ఆయన మైండ్ లో ఎలాంటి సినిమా అయితే చేయాలి అనుకున్నాడో దానికి ఏమాత్రం తగ్గకుండా అదిరిపోయే కథతో అద్భుతమైన కథనంతో డిఫరెంట్ మేకింగ్ తో సందీప్ వంగ అంటే ఎలా ఉంటుందో ఆ సినిమా ద్వారా చూపిస్తూ ఉంటాడు. ప్రస్తుతం ఆయన తీసిన అనిమల్ సినిమా కలెక్షన్ల సునామీని సృష్టిస్తుంది. రణ్బీర్ కపూర్ హీరోగా వచ్చిన ఈ సినిమా రిలీజ్ కి ముందు వచ్చిన ట్రైలర్ తోనే మంచి హైప్ ని క్రియేట్ చేసుకుంది. ఇక అప్పటినుంచి ఈ సినిమా మీద బజ్ అయితే బాగా క్రియేట్ అయింది. డిసెంబర్ ఒకటోవ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక అప్పటినుంచి ఇప్పటివరకు అంటే ఎనిమిది రోజుల్లో ఈ సినిమా 600 కోట్లకు పైన వసూళ్లను రాబట్టింది అంటే ఈ సినిమా స్టామినా ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమా జనాలకి ఎంతలా నచ్చిందో కూడా మనం అర్థం చేసుకోవచ్చు.

ఇక ఈ సినిమా లెంత్ 3 గంటల 20 నిమిషాలు ఉన్నప్పటికీ ఏ ఒక్క ప్రేక్షకుడు కూడా మొదటి నుంచి చివరి వరకు అసలు బోర్ గా ఫీల్ అవ్వకుండా సినిమా మొత్తం చూసి బయటికి వెళ్లి పోతున్నారు అంటే మనం అర్థం చేసుకోవచ్చు ఈ సినిమా నార్మల్ జనాల్లో ఎలాంటి ఇంపాక్ట్ ని క్రియేట్ చేసిందో… ఒక సినిమా ఎలా ఉంటుంది అనేది దాని లెంత్ ను బట్టి మనం డిసైడ్ చేయలేం డైరెక్టర్ దగ్గర దమ్ము ఉండి సినిమాని బాగా ఎగ్జిక్యూట్ చేయగలిగితే జనాలు సినిమా లెంత్ ని పట్టించుకోరు. ఇక ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో సినిమా అంటే కలెక్షన్ల వర్షం కురిపించాల్సిందే అనేలా అనిమల్ సినిమా తో మరొకసారి తన పేరుని పాన్ ఇండియా రేంజ్ లో మారుమ్రోగేలా చేసుకున్నాడు. ఇక ఈ వారంలో ఈ సినిమా 1000 కోట్ల కలెక్షన్స్ ను రాబడుతుంది.

ఇక దాంతో రణ్బీర్ కపూర్ లాంటి హీరోకి ఫస్ట్ టీమ్ వెయ్యికోట్ల సినిమాను అందించిన డైరెక్టర్ గా సందీప్ రెడ్డి వంగ మంచి గుర్తింపు పొందుతాడు. నిజంగా ఒక తెలుగు సినిమా డైరెక్టర్ బాలీవుడ్ లో ఇలాంటి ఒక బ్లాక్ బస్టర్ హిట్ సినిమాను తీసి 1000 కోట్ల వరకు కలెక్షన్స్ ని రాబడుతున్నాడు అంటే మామూలు విషయం కాదనే చెప్పాలి. చూడాలి మరి లాంగ్ రన్ లో ఈ సినిమా ఎంత వసూళ్లను కలెక్ట్ చేస్తుందనేది. ఒక వేళ ఈ సినిమా వెయ్యి కోట్లకు పైన కలెక్షన్స్ ని వసూలు చేసిన ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు…