Animal Collections: బాక్సాఫీస్ ను చేసిన రన్బీర్-వంగ… మైండ్ బ్లాక్ చేసేలా యానిమల్ ఫస్ట్ డే కలెక్షన్స్

సోషల్ మీడియాలో ఈ మూవీ మీద విపరీతమైన చర్చ నడిచింది. తెలుగు ఆడియన్స్ అయితే మూవీని ఓన్ చేసుకున్నారు. ఒక స్ట్రైట్ తెలుగు సినిమా మాదిరి ఎదురుచూశారు.

Written By: NARESH, Updated On : December 2, 2023 9:37 am

Animal Collections

Follow us on

Animal Collections: యానిమల్ మూవీ అంచనాలు అందుకుంది. మొదటి షో నుండే పాజిటివ్ టాక్ నడిచింది. యానిమల్ లెంగ్త్ ఎక్కువ, మితిమీరిన వైలెన్స్ అనే కొన్ని నెగిటివ్ కామెంట్స్ వినిపించాయి. ఓవర్ ఆల్ గా మూవీ అద్భుతం అన్న అభిప్రాయం మెజారిటీ వర్గాలు అభిప్రాయపడ్డాయి. సందీప్ రెడ్డి టేకింగ్, హీరో క్యారెక్టరైజేషన్ కొత్తగా ఉన్నాయి. రన్బీర్ కపూర్ నటనకు వంద శాతం మార్క్స్ పడ్డాయి. ఆయన ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ.

సోషల్ మీడియాలో ఈ మూవీ మీద విపరీతమైన చర్చ నడిచింది. తెలుగు ఆడియన్స్ అయితే మూవీని ఓన్ చేసుకున్నారు. ఒక స్ట్రైట్ తెలుగు సినిమా మాదిరి ఎదురుచూశారు. ఉదయం నుండే థియేటర్స్ వద్ద బారులు తీరారు. యానిమల్ చిత్రానికి సందీప్ రెడ్డి వంగ దర్శకుడు కావడం, హైదరాబాద్ లో మహేష్, రాజమౌళి గెస్ట్స్ గా ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించడం బాగా కలిసి వచ్చింది. మొత్తంగా యానిమల్ సినిమాకు అన్ని విషయాలు కలిసొచ్చాయి.

ఈ ప్రభావం వసూళ్ల మీద కనిపించింది. రికార్డు స్థాయిలో బుకింగ్స్ నమోదు అయ్యాయి. యానిమల్ మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ పరిశీలిస్తే.. హిందీలో రూ.50.5 కోట్లు, తెలుగు రూ.10 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టింది. తమిళంలో రూ. 40 లక్షలు, కర్ణాటకలో 9 లక్షలు, కేరళలో రూ. 1 లక్ష నెట్ వసూళ్లు సాధించింది. ఇండియాలో అన్ని భాషల్లో కలిపి యానిమల్ చిత్రానికి రూ. 70 లక్షల గ్రాస్ వసూళ్లు దక్కాయి.

ఓవర్సీస్ లో కూడా యానిమల్ దుమ్ముదులిపింది. కేవలం నార్త్ అమెరికా ప్రీమియర్ సేల్స్ $1.5 మిలియన్ దాటిపోయాయి. రన్బీర్ కి వరల్డ్ వైడ్ అభిమానులు ఉన్నారు. దీంతో మొదటి రోజు ఓవర్సీస్ లో $ 4 మిలియన్ వసూళ్ళు రాబట్టినట్లు సమాచారం. అంటే దాదాపు రూ. 33 కోట్లు. కాబట్టి వరల్డ్ వైడ్ యానిమల్ ఫస్ట్ డే రూ.103 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది. ఇది రన్బీర్ కపూర్ కెరీర్ బెస్ట్. రన్బీర్ కపూర్ కి జంటగా ఈ చిత్రంలో రష్మిక మందాన నటించింది.