India vs Australia 4th T20: చరిత్ర సృష్టించిన భారత జట్టు.. ఇదో గొప్ప వరల్డ్ రికార్డ్…

ఆస్ట్రేలియా మీద ఇండియన్ టీం గెలిచి సిరీస్ ని కైవసం చేసుకోవడంతో పాటుగా టి20 మ్యాచ్ ల్లో అత్యధిక విజయాలను నమోదు చేసుకున్న జట్టుగా కూడా ఇండియన్ టీం ఒక సరి కొత్త రికార్డును క్రియేట్ చేసింది.

Written By: Gopi, Updated On : December 2, 2023 9:32 am

India vs Australia 4th T20

Follow us on

India vs Australia 4th T20: ఆస్ట్రేలియా ఇండియా మధ్య జరుగుతున్న టి20 సిరీస్ లో ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే ఇండియా సీరీస్ ని కైవసం చేసుకుంది. ఇక ఇప్పటికే 3-1తేడాతో ఇండియా కప్ గెలిచి చూపించింది.ఒక 10 రోజుల కిందట వన్డే వరల్డ్ కప్ ఫైనల్ లో ఆస్ట్రేలియా చేతిలో ఇండియన్ టీం ఓటమిపాలవడం చూసిన ప్రతి అభిమాని చాలా బాధపడ్డాడు కానీ ఈ టి 20 సీరీస్ నెగ్గడం తో ఇప్పుడు ప్రతి ఒక్క ఇండియన్ క్రికెట్ అభిమాని కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాడు. ఇక ఆ పరాభవం నుండి కోలుకోవడానికి అటు ప్లేయర్లకి గాని, ఇటు అభిమానులకు గాని ఈ టి 20 సిరీస్ అనేది చాలా ఉత్తమమైన విధంగా ఉపయోగపడింది.

ఇక అందులో భాగంగానే ఈ సీరీస్ కి సూర్య కుమార్ యాదవ్ కెప్టెన్ గా వ్యవహరించడం ఫ్యూచర్ లో ఆయన కెరియర్ కి చాలా వరకు హెల్ప్ అయ్యే అవకాశం ఉంది. ఇక ఇండియన్ టీం ఈ సీరీస్ ను నెగ్గి ఇంకొక మ్యాచ్ మిగిలి ఉండగానే ఈ కప్ ని కైవసం చేసుకుంది. ఇక ఇలాంటి క్రమంలోనే ఈ సీరీస్ కోసం బిసిసిఐ జూనియర్ ప్లేయర్లని సెలెక్ట్ చేసింది.ఇక బీసీసీఐ వాళ్ల మీద నమ్మకం ఉంచినట్టుగానే ఈ కుర్ర ప్లేయర్లు ఆస్ట్రేలియన్ టీం కి చెమటలు పటిస్తూ ఇండియాకి సరికొత్త విజయాన్ని అందించారు. ఇంకా వచ్చే సంవత్సరం టి 20 వరల్డ్ కప్ జరగనున్న నేపథ్యంలో ఇప్పటినుంచి దానికి సంబంధించిన కసరత్తులను చేస్తూ ప్లేయర్లందరిని ఒక్కతాటిపై నడిపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు…

ఇక ఇదిలా ఉంటే నిన్న ఆస్ట్రేలియా మీద ఇండియన్ టీం గెలిచి సిరీస్ ని కైవసం చేసుకోవడంతో పాటుగా టి20 మ్యాచ్ ల్లో అత్యధిక విజయాలను నమోదు చేసుకున్న జట్టుగా కూడా ఇండియన్ టీం ఒక సరి కొత్త రికార్డును క్రియేట్ చేసింది.ఇక ఇప్పటివరకు ఇండియా 213 మ్యాచ్ లు ఆడితే అందులో 136 విజయాలను సొంతం చేసుకొని మొదటి ప్లేస్ లో దక్కించుకుంది. ఇక ఇండియా తర్వాత ప్లేస్ లో పాకిస్తాన్ టీం కొనసాగుతుంది. పాకిస్థాన్ టీమ్ 226 మ్యాచులను ఆడితే అందులో 135 విజయాలను సొంతం చేసుకుని రెండో ప్లేస్ లో కొనసాగుతుంది.ఇక ఈ రెండు టీం ల తర్వాత న్యూజిలాండ్ టీం 200 మ్యాచ్ లను ఆడితే అందులో 102 విజయాలను సొంతం చేసుకొని మూడో పొజిషన్ లో కొనసాగుతుంది.ఇక ఆ తర్వాత ఈ లిస్ట్ లో ఆస్ట్రేలియా,సౌతాఫ్రికా టీమ్ లు ఉండటం విశేషం…

ఈ అన్ని టీమ్ లను కలిపి చూస్తే ఇప్పటివరకు ఇండియా టీం అత్యధిక విజయాలను అందుకొని టాప్ లో నిలవడం ఒక వంతుకు మనకు గర్వకారణం అనే చెప్పాలి. ఇక ఇదే రీతిలో గనక ఇండియన్ టీం ముందుకు దూసుకుపోతే టి20 వరల్డ్ కప్ లో ఇండియా విజయం సాధిస్తుందని ప్రతి ఒక్క అభిమాని కూడా వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు…