https://oktelugu.com/

అల్లుడు అదుర్స్ కి డైరక్టర్ అనిల్ రావిపూడి గైడెన్స్ !

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మొదటి సినిమా ‘అల్లుడు శీను’తో తెలుగు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత వరుస ఫ్లాప్స్ ఎదురయినా ఈ హీరో తెలుగు ఇండస్ట్రీలో నిలబడేందుకు గట్టిగానే ప్రయత్నిస్తున్నాడు. సస్పెన్స్ సైకో థ్రిల్లర్ ‘రాక్షసుడు’ ఈ బెల్లంకొండ వారసుడికి మంచి కంబ్యాక్ హిట్ అందించింది. ఈయన ప్రస్తుతం దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ డైరెక్షన్ లో ‘అల్లుడు అదుర్స్’ అనే కామెడీ ఎంటర్టైన్మెంట్ సినిమాతో సంక్రాతి కానుకగా ప్రేక్షకుల ముందుకి వస్తున్నాడు. Also Read: అరుదైన […]

Written By:
  • admin
  • , Updated On : January 12, 2021 / 09:41 AM IST
    Follow us on


    బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మొదటి సినిమా ‘అల్లుడు శీను’తో తెలుగు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత వరుస ఫ్లాప్స్ ఎదురయినా ఈ హీరో తెలుగు ఇండస్ట్రీలో నిలబడేందుకు గట్టిగానే ప్రయత్నిస్తున్నాడు. సస్పెన్స్ సైకో థ్రిల్లర్ ‘రాక్షసుడు’ ఈ బెల్లంకొండ వారసుడికి మంచి కంబ్యాక్ హిట్ అందించింది. ఈయన ప్రస్తుతం దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ డైరెక్షన్ లో ‘అల్లుడు అదుర్స్’ అనే కామెడీ ఎంటర్టైన్మెంట్ సినిమాతో సంక్రాతి కానుకగా ప్రేక్షకుల ముందుకి వస్తున్నాడు.

    Also Read: అరుదైన గౌరవం: ఆస్ట్రేలియా స్టాంప్ పై ఈ తెలుగు హీరో..

    ఇప్పటికే విడుదలయిన అల్లుడు అదుర్స్ మూవీ టీజర్, ట్రైలర్ లను చూస్తుంటే ఫుల్ కామెడీ కాన్సెప్ట్ తో అభిమానులని అలరించటానికి సంతోష్ శ్రీనివాస్, బెల్లంకొండ బాబు సిద్దమైనట్లుగా అనిపిస్తుంది. అయితే రొటీన్ స్టోరీలానే అనిపిస్తున్నా కానీ కథనం కొత్తగా ఉంటే హిట్ అయ్యే అవకాశం ఉంది. ఫిలిం నగర్ లో ఈ సినిమా మీద ఒక ఆసక్తికరమైన వార్త హల్ చల్ చేస్తుంది.

    Also Read: పవన్ కళ్యాన్ అభిమానులకు గుడ్ న్యూస్

    తెలుగులో ఇప్పుడున్న డైరెక్టర్స్ లో కామెడీ మీద మంచి గ్రిప్ ఉన్న అనిల్ రావిపూడి ‘అల్లుడు అదుర్స్’ మూవీ అవుట్ పుట్ చూసి కొన్ని మార్పులు చేర్పులు సూచించారని, ఆమేరకు డైరెక్టర్ కూడా మార్పులు చేశారట. కందిరీగ‌లో సోనూసూద్‌తో విన్నూతనంగా కామెడీ చేయించిన సంతోష్ శ్రీ‌నివాస్ ఈ చిత్రంలోనూ సోనూ పాత్ర‌ను మ‌రింత కొత్త‌గా మ‌లిచార‌ట‌. సాయి శ్రీనివాస్ సరసన నభా నటేష్ హీరోయిన్ గా ఆడిపాడింది, రాక్‌స్టార్ దేవిశ్రీ‌ప్ర‌సాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి చోట కె. నాయుడు ఛాయాగ్ర‌హ‌ణం అందిస్తున్నారు. ఈ మూవీతో సంక్రాంతికి బెల్లంకొండ శ్రీ‌నివాస్ ఆడియ‌న్స్‌ని ఆకట్టుకుంటాడో లేదో చూడాలి.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్