సంక్రాంతి జర్నీ భారం.. ‘ప్రైవేటు’ బాదుడుతో పండుగ కష్టాలు

ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం ‘చల్ చల్ రే’ హైదరాబాద్ అంటూ రెక్కలు కట్టుకొని ఇక్కడికి వచ్చి ఉపాధి పొందుతున్న వారు కోట్లలో ఉన్నారు. తెలుగు రాష్ట్రాలే కాదు.. వివిధ రాష్ట్రాల నుంచి భాగ్యనగరానికి ఉద్యోగ, ఉపాధి నిమిత్తం వచ్చారు. అయితే సంక్రాంతి తెలుగు రాష్ట్రాల్లోనే పెద్ద పండుగ. దీనికి అందరూ సెలవులు ఇస్తారు. దీంతో సంక్రాంతికి ఊరెళ్లడానికి అందరూ రెడీ అయిపోతున్నారు. Also Read: జగన్ తో ఫైట్ ను వదలని నిమ్మగడ్డ.. మరో దుందుడుకు […]

Written By: NARESH, Updated On : January 12, 2021 10:00 am
Follow us on

ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం ‘చల్ చల్ రే’ హైదరాబాద్ అంటూ రెక్కలు కట్టుకొని ఇక్కడికి వచ్చి ఉపాధి పొందుతున్న వారు కోట్లలో ఉన్నారు. తెలుగు రాష్ట్రాలే కాదు.. వివిధ రాష్ట్రాల నుంచి భాగ్యనగరానికి ఉద్యోగ, ఉపాధి నిమిత్తం వచ్చారు. అయితే సంక్రాంతి తెలుగు రాష్ట్రాల్లోనే పెద్ద పండుగ. దీనికి అందరూ సెలవులు ఇస్తారు. దీంతో సంక్రాంతికి ఊరెళ్లడానికి అందరూ రెడీ అయిపోతున్నారు.

Also Read: జగన్ తో ఫైట్ ను వదలని నిమ్మగడ్డ.. మరో దుందుడుకు చర్య

కానీ ఇప్పుడు ప్రభుత్వ రవాణా సంస్థలైన ఆర్టీసీ, రైళ్లలో సరిపడా టికెట్లు లేని పరిస్థితి. ఫుల్ రష్, డిమాండ్ కారణంగా ఆర్టీసీ బస్సుల్లో పెద్ద పెద్ద క్యూలు ఉన్నాయి. రైళ్లో రిజర్వేషన్లన్నీ ఎప్పుడో అయిపోయాయి. మరి ఊరెళ్లి పోవడం ఎలా అని ఆలోచిస్తున్నారు జనాలు.

పండుగ సీజన్ క్యాష్ చేసుకుంటున్నాయి ‘ప్రైవేట్ ట్రావెల్’.. వాహనదారులు. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. రద్దీని క్యాష్ చేసుకోవాలనుకునే క్రమంలో టికెట్ రేట్లను భారీగా పెంచేస్తూ ప్రయాణికులకు చుక్కలు చూపిస్తున్నాయి.

Also Read: ఏపీని షేక్ చేసిన జడ్జీల ఆడియో టేపుల కేసు.. సుప్రీంకోర్టులో షాక్

ఈ సంక్రాంతి సీజన్ తోపాటు కరోనా మహమ్మారి ఎఫెక్ట్ వల్ల చాలా మంది ప్రజలు ఆర్టీసీ, రైళ్లలో కంటే ప్రైవేటు వెహికల్స్ లోనే పోవడానికి ఇష్టపడుతున్నారు. దీంతో ఈ సంక్రాంతి సీజన్ కు ప్రైవేట్ ట్రావెల్స్ యజమానులు దోపిడీకి తెగబడ్డారు. డిమాండ్ ఉన్న తేదీల్లో అయితే టికెట్ రేట్లను డబుల్ చేసి మరీ ప్రయాణికుల జేబులు చిల్లులు పడేలా చేస్తున్నారు.

మామూలు పరిస్థితుల్లో హైదరాబాద్ నుంచి రాజమండ్రికి ఆర్టీసీ బస్సు టికెట్ ధర రూ.900కాగా.. ప్రైవేట్ ట్రావెల్స్ రూ.1500 వసూలు చేస్తున్నాయి. హైదరాబాద్ -గుంటూరు రేటు 418 కాగా ప్రైవేటు టికెట్ ధర రూ.950గా ఉంది. అంటే డబుల్ రేట్లను పెట్టి దోపిడీ చేస్తున్నారన్నమాట..

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్