https://oktelugu.com/

Anil Ravipudi: చిరంజీవితో చేయబోయే సినిమా టైటిల్ ని ప్రకటించిన అనీల్ రావిపూడి..ఈ సెంటిమెంట్ ని జీవితాంతం వదిలేలా లేడు!

జనవరి 14 నుండి తెలుగు రాష్ట్రాల్లో ఉండే డిస్ట్రిబ్యూటర్లు సంక్రాంతి పండుగని ఇప్పటికీ 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాతో జరుపుకుంటూనే ఉన్నారు. విక్టరీ వెంకటేష్ కి సరైన బ్లాక్ బస్టర్ పడితే కుటుంబం లో ఉండే ప్రతీ ఒక్కరు థియేటర్స్ కి కదులుతారని, నెలల తరబడి అద్భుతమైన బాక్స్ ఆఫీస్ రన్ ని సొంతం చేసుకుంటుందని ట్రేడ్ విశ్లేషకులు అంటుంటారు. అది నిజమే అని మరోసారి 'సంక్రాంతికి వస్తున్నాం' చిత్రం నేటి తరం ఆడియన్స్ కి తెలియజేసింది.

Written By:
  • Vicky
  • , Updated On : February 11, 2025 / 08:32 AM IST
    Follow us on

    Anil Ravipudi: జనవరి 14 నుండి తెలుగు రాష్ట్రాల్లో ఉండే డిస్ట్రిబ్యూటర్లు సంక్రాంతి పండుగని ఇప్పటికీ ‘సంక్రాంతికి వస్తున్నాం'(Sankranthiki Vastunnam|) సినిమాతో జరుపుకుంటూనే ఉన్నారు. విక్టరీ వెంకటేష్ కి సరైన బ్లాక్ బస్టర్ పడితే కుటుంబం లో ఉండే ప్రతీ ఒక్కరు థియేటర్స్ కి కదులుతారని, నెలల తరబడి అద్భుతమైన బాక్స్ ఆఫీస్ రన్ ని సొంతం చేసుకుంటుందని ట్రేడ్ విశ్లేషకులు అంటుంటారు. అది నిజమే అని మరోసారి ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం నేటి తరం ఆడియన్స్ కి తెలియజేసింది. ఇప్పటికీ ఈ చిత్రానికి థియేటర్స్ నుండి డీసెంట్ స్థాయి వసూళ్లు వస్తుండడం అనేది సాధారమైన విషయం కాదు. ‘తండేల్'(Thandel Movie) సక్సెస్ కాస్త ఈ చిత్రంపై ప్రభావం చూపించింది కానీ, వర్కింగ్ డేస్ లో ఆ సినిమాతో పోటీని ఇస్తుంది ఈ చిత్రం. ఇకపోతే ఈ సినిమాకి సంబంధించిన సక్సెస్ సెలెబ్రేషన్స్ నిన్న హైదరాబాద్ లో మరోసారి గ్రాండ్ గా నిర్వహించారు.

    ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో జరిగిన ఈ సక్సెస్ మీట్ కి దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు, హరీష్ శంకర్, వశిష్ట , వంశీ పైడిపల్లి వంటి వారు ముఖ్య అథిధులుగా విచ్చేసి ఈ సినిమా గురించి ఎంతో అద్భుతంగా మాట్లాడారు. ముఖ్యంగా దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు మాట్లాడుతూ ‘ఈ సభలో నేను కొన్ని నిజాలు మాట్లాడుతాను, అందుకు ఎవ్వరూ నొచ్చుకోకూడదు’ అని అంటాడు. దానికి డైరెక్టర్ అనిల్ రావిపూడి సమాధానం చెప్తూ ‘ మేమెవ్వరం అలా అనుకోము సార్..దయచేసి చెప్పండి’ అని అంటాడు. ‘ఈ సినిమా కి నేను ఒక రేంజ్ లో ఎంజాయ్ చేశాను. ఇంత పెద్ద హిట్ అవ్వడానికి కారణం కూడా వాళ్ళే అని అనుకుంటున్నాను’ అంటూ మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ వైపు చూపిస్తాడు రాఘవేంద్ర రావు. ‘ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య నలిగిపోయిన వెంకటేష్(victory venkatesh) రోల్ లో నన్ను నేను ఊహించుకున్నాను కాబట్టే’ అని నవ్వుతూ సమాధానం ఇస్తాడు.

    ఇంకా ఆయన మాట్లాడుతూ ‘ఆ బుడ్డోడు మామూలుగా చేయలేదు’ అని బుల్లిరాజు వైపు చూసి చెప్పగా, బుల్లిరాజు ‘థాంక్యూ సార్..’ అని అంటాడు. దానికి రాఘవేంద్ర రావు కౌంటర్ ఇస్తూ ‘అంత మర్యాదగా సమాధానం చెప్పవేంట్రా..వివాహ వేడుకలకు నిన్ను తీసుకెళ్లాలంటే భయపడిపోతారేమో, ఎక్కడ వాళ్ళని తిట్టేస్తావేమో అని’ అని ఫన్నీ కామెంట్స్ చేసాడు. ఇక చివర్లో అనీల్ రావిపూడి గురించి మాట్లాడుతూ ‘మా చిరంజీవి(Megastar Chiranjeevi) తో సినిమా చేస్తున్నావు కదా..టైటిల్ నేను చెప్తాను..’సంక్రాంతి అల్లుడు’ అని పెట్టుకో అదిరిపోతుంది’ అని చెప్పుకొచ్చాడు. అయితే అనీల్ రావిపూడి ఆ టైటిల్ నే ఫిక్స్ చేశాడని, దానిని రాఘవేంద్ర రావు గారితో చెప్పించారని ఇండస్ట్రీ వర్గాల్లో వార్తల్లో వినిపిస్తున్నాయి. ఈ వయస్సులో చిరంజీవి ‘సంక్రాంతి అల్లుడు’ అంటే కచ్చితంగా పెద్ద వయస్సులో పెళ్లి చేసుకున్న ఒక వ్యక్తి జీవితంలో చోటు చేసుకున్న సందర్భాలను ఈ సినిమాలో చూడబోతున్నారు అనేది అర్థం అవుతుంది.